పుట:Abaddhala veta revised.pdf/352

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వదిలి, బొగ్గు పులుసు వాయువును స్వీకరిస్తాయి. జంతువులు, మనుషులు బొగ్గు పులుసు వాయువును వదలి, ఆక్సిజన్ పీల్చుకుంటారు. ఇది ఇతర గ్రహాలు, నక్షత్రాలాలో లేదు. అక్కడున్న గ్యాస్ లు పీల్చుకొని జీవులు ఉండాలంటే, వారి ఊపిరితిత్తులు, జీవ విధానం భిన్నమైనది కావాలి. గురుత్వాకర్షణలో గ్రహాలు, నక్షత్రాలు భిన్నంగా వున్నాయి. భూమి మీద వున్నదానికీ, వాటికీ తేడా కనబడుతున్నది. గనుక జీవులసైజు కూడా ఆ రకంగా మారాలి. శని గ్రహంలో చాలా ఎక్కువ గురుత్వాకర్షణ భూమితో పోల్చితే వుంది. చంద్రునిలో మనకంటే చాలా తక్కువ వుంది. కనుకనే చంద్రుని పైకి కృత్రిమ నౌకలలో వెళ్ళిన మానవుడు ఆక్సిజన్ గొట్టాలు పెట్టుకున్నాడు. తేలిపోతున్నందున నడక కష్టమై, శిక్షణ పొందాల్సి వచ్చింది. నాలుగు తలలు వుంటే ఎంతో రక్తం నాలుగు మెదడులకు కావాలి. అంతేకాక ఒక గుండె తట్టుకోలేదు.కాబట్టి మనపురాణాలలో వింత జీవులు, దేవుళ్ళు, దేవతలు వూహాజనితాలని తెలుసుకోవాలి.

ఏమైనా ఇంతవరకూ భూమిపై తప్ప మరెక్కడా మనుషులున్నట్లు రుజువుకాలేదు.

- వార్త,3 ఫిబ్రవరి 2002
బంగారం తయారు చేయడమెలా?

పూర్వకాలం నుండీ కొందరికి బంగారం తయారుచేయాలనే కోరిక వుండడం, జీవితాలే అందుకు ధారబోయడం విన్నాం. వేమన కూడా కొన్నాళ్ళు ప్రయత్నం చేశాడని వినికిడి. ఇది చాలాదేశాలలో వున్న అలవాటే. రాజులు, రాణులు కూడా యీ బంగారం చేసే విద్యను ప్రోత్సహించారు.

గ్రీకులలో కూడా ఒక లోహాన్ని మరొకటిగా మార్పిడి చేయగలమనే నమ్మిక ప్రబలంగా వుండేది.

అరబ్బులలో యీ విద్య చాలా ఎక్కువగా వుండేది. సీసం బంగారమైతే కావాల్సిందేముంది? దీనిపై అరబ్బులు చాలా గ్రంథాలు రాశారు. చైనాలో యీ బంగారం చేసే పని చాలామంది చేబట్టినట్లు తెలుస్తున్నది.

బంగారం చేయడం ఒక రహస్య విద్యగా పేర్కొనేవారు.ఇంగ్లండ్ లో ఒకటో ఎలిజబెత్ రాణి బంగారం చేయించే ప్రయత్నం అధికారికంగా తలపెట్టి విఫలమైంది. ఒక దశలో బంగారం చేసే ప్రయత్నాన్ని ఇంగ్లండ్ నిషేధించింది. 22వ పోప్ జాన్ బంగారం చేయాలని ఎంతో కృషిచేసి చతికిలబడ్డాడు. బంగారం చేయడానికి వినియోగించే పద్ధతులు రాసిన వారు రహస్య పదజాలాన్ని, నిగూడ అర్ధాల్ని వాడారు. వాటిలో ఏదో దాగివుందని కొందరు జుట్టు పీక్కుని అర్థాలకై అన్వేషిస్తుండేవారు.