పుట:Abaddhala veta revised.pdf/348

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆలిండియా కాంప్ లో ఒకసారి ఎం.ఎన్. రాయ్ తో కొరియా విషయంలో విభేదించగా, వీరారాధకులు ఆశ్చర్యపోయారు. ఎ.జి.కె వీరారాధకుడు కాదు. చివరకు ఆ విషయం గుర్తించిన ఎం.ఎన్.రాయ్ దిగివచ్చి ఎజికెతో సత్సంబంధాలు సాగించాడు. ఎ.బి.షా, వి.ఎం. తార్కుండే, జి.డి. పరేఖ్,కె.కె. సిన్హ మొదలైన హ్యూమనిస్టులతో ఎజికె పనిచేశారు. అన్నిటా తన వ్యక్తిత్వమే రాణించింది. పత్రికారంగంలో ఎజికె సన్నిహితులు చాలామంది వుండగా, ప్రముఖులలో పండితారాధ్యుల నాగేశ్వరరావు, నార్ల వెంకటేశ్వరరావు పేర్కొనదగినవారు.

వివేకానంద, నెహ్రూ వివాదం : 1964లో ఎజికె,అమెరికా వెళ్ళబోతున్న సందర్భంగా తెనాలిలో సన్మానించారు. వివేకానందను గురించి గొప్పగా అమెరికాలో ప్రశంసించమని సభలో కోరగా, వున్నదివున్నట్లే వివేకానంద గురించి చెబుతానుగాని, కోరినట్లు స్తుతి పాఠాలు చెప్పమని ఎజికె అన్నారు. దీనిపై ఆంధ్రప్రభ నీలంరాజు వెంకటశేషయ్య సంపాదకత్వాన తీవ్ర దాడిచేసింది. నెలరోజులపాటు లేఖలు, నిందారోపణలు గుప్పించింది. ఎజికెను అమెరికా నుండి వెనక్కు పిలిపించాలని ఉద్యమించింది. ఆ దురుద్దేశ ఉద్యమం ఫలించలేదు. కాని ఎజికె వ్యాఖ్యాల బాగోగులు పరిశీలనకు వచ్చాయి. ఎజికె అమెరికాలో వివేకానందపై ప్రస్తావనే తేలేదు. అటువంటి సందర్భంరాలేదు. కాని జవహర్ లాల్ నెహ్రూపై ఎజికె వ్యాఖ్యలు ఆనాటి రాయబారి బి.కె.నెహ్రూకు నచ్చలేదు. రాయబార కార్యాలయం వారు ఎజికె పర్యటన ఆపించాలని, వీలైతే ఇండియాకు పంపాలని ప్రయత్నించినట్లు వడ్లమూడి శ్రీకృష్ణ చెప్పారు. నెహ్రూపై విమర్శలు చేయవద్దని ఎజికెకు కబురు పంపారు. కాని ఎజికె అవి పట్టించుకోలేదు. ఇండియాలో నెహ్రూ విధానాల పట్ల ఎలాంటి విమర్శనాత్మక ధోరణి చూపాడో, అదే అమెరికాలోనూ కొనసాగించాడు. 1940 నుండి 1967లో గుండెపోటుతో చనిపోయేవరకూ "వ్యాసోపన్యాసకుడు" గా ఎజికె రాణించారు.

ఎజికె తెలుగులోనూ ఇంగ్లీషులోనూ మంచివక్త. చాలా ఆకర్షణీయంగా, జటిల అంశాలను సులభంగా అర్థం అయ్యేట్లు చెప్పేవారు. సాహిత్య సభలలో ఆయనకు ఒక ప్రత్యేకస్థానం వుండేది. ఎజికెను సభకు పిలిచారా అని విశ్వనాథ సత్యనారాయణ ముందు అడిగి, ఆరాతీసి ఎజికె వస్తున్నారంటే, ఆ సభకు వచ్చేవారే కాదు. కాటూరి వెంకటేశ్వరరావు, తుమ్మల సీతారామమూర్తి, ఏటుకూరి వెంకట నరసయ్య, పూతల పట్టు శ్రీరాములు మొదలైనవారు ఎజికె యిష్టులు. చాలా మంది కవులు, గాయకులు, రచయితలు ఎజికెను గురువుగా భావించేవారు. అందులో కొండవీటి వెంకటకవి ఒకరు. ఆయన రాసిన నెహ్రూ చరిత్ర కావ్యానికి ఎజికె సహాయపడ్డారు. ఢిల్లీ వెళ్ళి నెహ్రూను కలసి పుస్తకం యిచ్చినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ అడిగితే, ఈ గ్రంథం వెనుక ఎజికె వున్నట్లు వెంకటకవి చెప్పారు.

పెళ్ళిళ్ళు సెక్యులర్ పద్ధతిలో చేయించడం, అప్పుడు ఎజికె చెప్పే ప్రసంగం గొప్ప అంశం. బోర్ కొట్టకుండా కొత్త అంశాన్ని ఆలోచింపజేసేట్లు అందించడం ఎజికె మేధస్సుకే చెల్లింది. (నా వివాహం ఎజికె చేయించారు తెనాలిలో. ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహించారు 1964 మే