పుట:Abaddhala veta revised.pdf/346

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నా చుట్టూ ప్రపంచం అనే శీర్షికతో ఎజికె వాహిని పత్రిక(విజయవాడ)లో రాసిన అంశాలు ముఖ్యమంత్రులను, రాజకీయ నాయకులను కదలించాయనడానికి అనేక ఆధారాలున్నాయి. ఒకేఒక పర్యాయం తెనాలి మునిసిపల్ చైర్మన్ గా చేసిన ఎజికె ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఆయన పత్రికా వ్యాసాలు, ప్రసంగాలే కారణం. 1964లో అమెరికా ప్రభుత్వం ఎజికెను ఆహ్వానించగా, బి.ఎస్.ఆర్.కృష్ణ తెచ్చిన ఆహ్వానలేఖ అందరినీ ఆశ్చర్య ఆనందాలతో ముంచెత్తింది. మారుమూల వున్న ఒక అనధికారిని కేవలం ప్రతిభ ఆధారంగా గుర్తించి, పిలవడం ఎజికె గొప్ప మానవతావాద విలువలకు గీటురాయి. దానికి తగ్గట్లే మూడు నెలలు పర్యటించిన ఎజికె అమెరికా వారిని ఆశ్చర్యపరిచే హేతువాద ఔన్నత్యాన్ని కనబరచారు. అది చరిత్ర.

ఎజికె పత్రికా రచనలు చాలా పదునుగా కొత్త దశలో సాగాయి. ఎందరినో ఉత్తేజపరచిన ఎజికె విమర్శలు, చాలామందిని ఇబ్బందిపెట్టేవి కూడా. గాంధీజీపై 1942లోనే రాడికల్ పత్రికలో ఎజికె రాసిన వ్యాసం అబ్బూరి రామకృష్ణారావును దిగ్భ్రాంతిపరచగా, ఆయన,ఎం.వి.రామమూర్తి కలిసి ఎం.ఎన్.రాయ్ కు ఫిర్యాదు చేశారు. రాయ్ ఆ వ్యాసాన్ని పూర్తిగా బలపరచగా, తరువాత మల్లాది రామమూర్తి, అబ్బూరిగారలు ఎజికె సన్నిహితులుగా మారారు.

గవర్నర్ త్రివేది : ఆంధ్ర గవర్నర్ గా కాకలుతీరిన ఐ.సి.ఎస్ అధికారి చందూలాల్ త్రివేది వుండగా, ఒకసారి తెనాలి సందర్శించారు. అప్పుడు మునిసిపల్ ఛైర్మన్ గా వున్న ఎజికె, పురపాలక సమావేశానికి వచ్చిన త్రివేదికి చురకలు వేయడం, త్రివేది తన తప్పిదాన్ని గ్రహించి క్షమాపణ చెప్పడం, చెప్పుకోదగిన అంశం. ప్రొటోకోల్ తెలిసిన త్రివేది,వేరే సభకు ముందు వెళ్ళి, అనంతరం మునిసిపల్ సభకు వచ్చారు. అందుపై ఎజికె చమత్కారంగా అంటేటట్లు వేసిన చురక త్రివేదికి నచ్చడం గమనార్హం.

నీలం సంజీవరెడ్డి : ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్ది తెనాలి రాగా,మునిసిపాలిటీ వారడిగిన రెండు రోడ్లలో ఒకటి మంజూరు చేసినట్లు ప్రకటించారు. అప్పటి వరకూ ఎవరికీ అడిగిన రెండిటిలో సగం యివ్వలేదని, చప్పట్ల మధ్య రోడ్లలో మంజూరు చేసిందానికి బదులు రెండోది యిస్తే సంతోషిస్తామన్నారు. మంజూరుచేసిన రోడ్డు విలువ 20వేలు కాగా, రెండో రోడ్డు విలువ లక్షరూపాయలని ఎజికె అనేసరికి, సంజీవరెడ్డి బిత్తరపోగా, జనం ఎజికెను హర్షధ్వానాలు పలికారు. నన్ను ఏడిపించడానికి ఎజికెను సభకు పిలిచారా అని తరువాత మునిసిపల్ బంగళాలో ఆలపాటి వెంకట్రామయ్య(కీ.శే.మంత్రి)తో సంజీవరెడ్డి మండిపడ్డారు.

దామోదరం సంజీవయ్య : ముఖ్యమంత్రిగా సంజీవయ్య వున్నప్పుడు, ఎజికె కు మిత్రుడు. ఒకసారి విజయవాడ పర్యటనకు వెళ్ళి,గుట్టమీద వున్న హరిజన (దళిత) హాస్టల్ కు వెళ్ళవలసి వుండగా నేను ఎక్కలేనంటూ తిరిగి వెళ్ళిపోయారు. దీనిపై ఎజికె వ్యాఖ్యానిస్తూ "ముఖ్యమంత్రి పదవికి దేక గలిగినవాడు ఆ మాత్రం దళితుల కోసం గుట్టెక్కలేకపోయాడా" అన్నారు. ఆంధ్రపత్రిక