పుట:Abaddhala veta revised.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
విలక్షణ పాత్రికేయుడు గో.రా.శాస్త్రి

ఆ డబ్బుకు పిండి రుబ్బమంటే రుబ్బేస్తానని సంపాదకుడుగా వ్యాఖ్యానించిన గోరాశాస్త్రి కఠోరంగా మాట్లాడినట్లనిపించవచ్చు. కాని ఆయన అద్యంతాలూ జర్నలిస్ట్ గానే గడిపారు.

గోరాశాస్త్రి గోరాకు మధ్య ఎలాంటి సంబంధం లేకున్నా కొందరు గందరగోళంతో యిరువురూ ఒకటే అనుకోపోలేదు. ఒకరికి రావలసిన ప్రశంసలు,తిట్లు మరొకరికి రావడమూ జరిగింది. విజయవాడలో నాస్తికోద్యమ నిర్మాతగా గోపరాజు రామచంద్రారావు తన పేరును గోరా అని క్లుప్తీకరించారు. గోరాశాస్త్రి అసలు పేరు గోవిందుని రామశాస్త్రి.

గోరాశాస్త్రి ఒరిస్సా సరిహద్దుల నుండి విశాఖపట్టణం వరకూ అనేక చిన్న బతుకుదెరువు ఉద్యోగాలు చేసి, చివరకు ఆనాటి రాజధాని మద్రాసు చేరారు.

ఖాసా సుబ్బారావు ఇంగ్లీషు స్వతంత్రను, గోరాశాస్త్రి తెలుగు స్వతంత్రను మద్రాసు నుండి నడిపారు. "మద్రాసు మెయిల్ మాకు ప్రియబాంధవి" అంటుండేవారు గోరాశాస్త్రి. అప్పట్లో కలకత్తా నుండి మద్రాసుకు నడిచే మెయిల్ ద్వారా ఉత్తరాలు, వ్యాసాలూ అందుకునే వారు. తెలుగు స్వతంత్ర చిన్న పెద్ద రచయితలకు ప్రోత్సాహకారిగా, భిన్నాభిప్రాయాల వేదికగా నిలిచింది. మద్రాసు సంస్కృతి, సంగీతం, మోర్ మార్కెట్ లో చౌకగా లభించే విదేశి సాహిత్య పత్రికలు, గోష్ఠులు, రచయితల ప్రవాసం అన్నీ గోరాశాస్త్రిని ఆకట్టుకున్నాయి. ఆయన సికింద్రాబాద్ లో స్థిరపడినా చివరి దాకా మద్రాసు అంటేనే అభిమానంగా వుండేవారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మిగిలిన పత్రికల వలె తెలుగు స్వతంత్రకూగడ్డుకాలం వచ్చింది. అప్పుడు హైదరాబాద్ మకాం మార్చి శ్రీదేవి (రచయిత్రి, డాక్టరు) సహకారంతో తెలుగు స్వతంత్ర నడిపారు. కాని అట్టేకాలం నడపలేక ఆపేశారు. 'కాలాతీత వ్యక్తులు' నవలరాసిన శ్రీదేవి చనిపోయారు.

గోరాశాస్త్రి ఆంధ్రభూమి ఎడిటర్ అయ్యారు. సికింద్రాబాద్ లోని జీరాలో అద్దె ఇంట్లో నివశిస్తూ, చివరివరకూ గడిపారు. కొందరు జర్నలిస్టుల వలె గోరాశాస్త్రి సంపాదనలో పడలేదు. ఆయనకు నిత్యమూ ఆర్థిక యిబ్బందులు వుండేవి. ముగ్గురు అమ్మాయిలు వుండగా పుత్రసంతానం లేదు. ఖర్చుబాగా వుండేది. అందువలన ఎప్పుడూ సంసార లంపటత్వ కష్టాలలో యీదుతుండేవాడు.

ఆంధ్రభూమి సంపాదకుడుగా గోరాశాస్త్రి వున్నప్పుడు నేను ఎన్.శూలపాణి అనే పేరుతో వ్యాసాలు రాశాను. చాలా సంవత్సరాలు యిరువురం పరిచయం లేకుండానే సాగింది. తీరా పరిచయం అయినప్పుడు గోరాశాస్త్రిగారు ఆశ్చర్యపోయారు. ఒకటి పేరు గురించి, రెండు వయస్సు గురించి. గోరాశాస్త్రి గారితో పరిచయం సన్నిహిత స్నేహంగా మారిన తరువాత, తరచు