పుట:Abaddhala veta revised.pdf/338

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చింతామణి అలవాట్లలో శాకాహారి అయినా, నిరంతరం సిగరెట్లు తాగి, కిల్లీలు నమిలేవాడు. అవి రెండూ ఆరోగ్యానికి చెరుపుగా మారాయి. అనారోగ్యం దాపురించి ఆయన పడుతున్నప్పుడు చింతామణి నేలమీద పడి దొర్లేవాడని ఆయన కుమారుడు గణేష్ విశ్వనాధ్ చెప్పారు. చనిపోయినప్పుడు మంచంమీద వుండరాదని నమ్మకం అట. అంతేగాక, నమ్మకాలు లేకుండా జీవితాన్ని ఆరంభించిన చింతామణి, రానురాను పూజాపునస్కారాలతో బాగా నమ్మకాలలో మునిగిపోవడానికి కారణం తెలియదని గణేష్ విశ్వనాధ్ అంటారు. చింతామణిచే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చక్కని ఉపన్యాసాలు యిప్పించిన ఘనత నాటి వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దే. అలహాబాద్, బెనారస్ విశ్వవిద్యాలయాలు గౌరవ పట్టాలిచ్చాయి. నేటివలె సంతర్పణగాక, నాడు గౌరవ పట్టాలకు గౌరవం వుండేది.

అన్నట్లు చింతామణి చదువుకున్నది విజయనగరం మహారాజా కాలేజీలో కేవలం ఇంటర్ మాత్రమే!

ఆయన రచనలలో పుస్తక రూపం దాల్చినవి బహుకొద్ది. ఇండియన్ పాలిటిక్స్ అండ్ ది మ్యూటినీ; ఇండియన్ సోషల్ రిఫాం, స్పీచెస్ అండ్ రైటింగ్స్ ఆఫ్ సర్ ఫిరోజ్ షా మెహతా అనే పుస్తకాలున్నాయి. చింతామణి లేఖలు, పత్రాలు, పుస్తకాలు, డైరీలు అన్నీ ఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ లో భద్రపరిచారు. బ్రిటిష్ ప్రభుత్వం చింతామణికి 1939 జూన్ లో సర్ బిరుదు యిచ్చింది. బ్రిటిష్ వారిని తగిన సందర్భాలలో విమర్శించడానికి ఆయన వెనుకాడలేదు. ఎం.ఆర్.మసానితో కలసి భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానాలు రాశారు.

1941 జులై 1న చింతామణి మరణించారు. భారత జర్నలిజానికి గొప్ప నష్టం అని గాంధీజీ వ్యాఖ్యానించారు. అలహాబాద్ లో నేడు చింతామణి రోడ్ ఒకటి వున్నది. సుప్రీంకోర్టు తొలి రిజిస్ట్రార్ పి.నరసింహమూర్తితో వియ్యమందిన చింతామణి అద్యంతాలు జర్నలిస్ట్ కుటుంబాలతో సంబంధం పెట్టుకున్నారు. చింతామణి మనమడు రామకృష్ణ, సుప్రసిద్ధ జర్నలిస్ట్ జి.ఎస్.భార్గవ కుమార్తె ప్రొఫెసర్ పుష్పను వివాహమాడారు. వారంతా చింతామణి కీర్తి యినుమడింపజేసే ప్రయత్నాలలో వున్నారు.

- వార్త, 28 అక్టోబరు,2001
సెక్యులర్ జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు

ఆంధ్రలో పుట్టి పెరిగినా ఆంజనేయులు కేవలం ఇంగ్లీషులోనే రాసి పెద్ద జర్నలిస్టుగా ఖ్యాతి చెందారు. గోపాలశాస్త్రి ఆయన్ను డాంజనేయులు అని పిలవగా డి.ఎ.అని పాఠకలోకానికి పరిచితులు. ఆయన ఏది రాసినా,చెప్పినా స్పష్టంగా, మృదువుగా, మర్యాదగా వుండేది.

కోటంరాజు రామారావు నడిపిన "ఇండియన్ రిపబ్లిక్" లో తొలుత జర్నలిజానికి అక్షరాభ్యాసం