పుట:Abaddhala veta revised.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొత్తరంగం అని నేడు సగర్వంగా చెప్పదగింది జన్యుశాస్త్రం. మెండల్ గ్రెగోర్ 1850 ప్రాంతాలకే మొక్కల పారంపర్యత చూచాడు. కాని అదెలా పనిచేస్తుందో, సూక్ష్మరసాయనిక చర్య ఏమిటో ఆనాడు తెలియదు. అందుకోసం 1953 వరకూ పరిశోధనలు జరిగాయి. ఫ్రాన్సిస్ క్రిక్, జేమ్స్ వాట్సన్ అనే శాస్త్రజ్ఞుల కృషివల్ల పెనవేసుకుపోయినట్లుండే (డబుల్ హెలిక్స్) రెండు తీగల రూపం చూచారు. ఇది చాలా పెద్ద జీవకణం. అదే డిఎన్ఎలో నాలుగు రసాయనిక మూలకాలు వున్నాయి. పొడి అక్షరాలలో ఎ, టి, జి, సి అన్నారు. ఎ అంటే అడిలైన్, టి అంటే థైమన్, జి అనగా గానైన్, సి అంటే సైటోసిస్. ఈ నాలుగింటిల్లో ఏ మూడు కలిసిన ప్రొటీన్లు వస్తాయి. అవే జీవానికి మూలం.

ఒక్కొక్కజీవకణం ఒక విజ్ఞాన సర్వస్వ నిఘంటువు వంటిదే. ప్రతి జీవకణంలో 23 జతల క్రోమోజోములుంటాయి. ఇందులో పెనవేసుకుపోయిన డిఎన్ఎ లుంటాయి. ఇలాంటి విజ్ఞాన సర్వస్వాలు 46 సంపుటాలమయంగా మానవుడిలో వుండగా, ఒక్కొక్క సంపుటి అనేక విషయాలను చూస్తుంది. నిఘంటువులో ఒక పదం ఒక డిఎన్ఎ పోల్చి చెప్పవచ్చు. ప్రతి వ్యక్తిలో రెండు జన్యు జంట (అలెక్స్) సంక్రమిస్తుంది. తల్లిదండ్రుల నుండి యీ జంట వస్తుంది. తండ్రి లక్షణాలు తల్లి లక్షణాలు పిల్లలకు యిలా వస్తాయి. అలా వచ్చేటప్పుడు కొంచెం చెదిరినా, మార్పు జరుగుతుంది. దీనికి పెడదారి (మ్యూటేషన్) అని పేరు పెట్టారు. మనం అచ్చుగుద్దినట్టు కార్బన్ కాపీ తీస్తుంటే, కొంచెం జరగడం, ముద్ర సరిగా పడకపోవడం, అక్షరం చెదరడం చూస్తాం. అలాగే పోలికలతోబాటు మార్పులు చూస్తాం. జన్యుకణాలలో మూలంగా వున్న నాలుగు రసాయనికాలలో ఏ మూడైన కలుస్తూపోతాయని గమనించాలి. ఇది జరిగే తీరు ఒక్కొక్క కణంలో విప్పి చూస్తే ఏమి వుంటుంది అని తెలుసుకోడానికి పరిశోధన 1980 ప్రాంతాలలో మొదలెట్టి 1990 ప్రాంతాలకు ఒక దారినపడింది. ఈ బృహత్తర పధకానికి జెనోం ప్రాజెక్టు అని పేరు పెట్టారు.

ఈ పథకం వల్ల గొప్ప ఉపయోగం ఏమంటే రోగాలకు మూలం జీవకణాలేమిటి, వాటిని తొలగించడం ఎలా అనేది సాధ్యపడుతుంది.

సుమారు 5వేల రోగాలు వివిధ జన్యుకణాల మూలంగా వున్నాయని జేనోం ప్రాజెక్టు వల్ల తేలింది. అంటురోగాలు జన్యుకణాల వల్ల రావడమనేది కూడా గ్రహించాలి. కాగా నిరోధకశక్తి జన్యుకణాల వల్లే వివధ దశలలో వుంటుంది. కొన్ని జన్యుకణాలు బాగా పెత్తనం చేస్తాయి. తండ్రి నుండి వచ్చిన కణం ఊదా రంగు (బ్రౌన్)లో వుండొచ్చు. తల్లి నుండి వచ్చిన కణం నీలం (బ్లూ) రంగులో వుండొచ్చు. అయినా సంతానంలో కనుపాపల రంగు బ్రౌన్ అధిక్యతనే చూపుతుంది. ఇదే కణాధిక్యత అంటారు. అలాగే ఒక్కొక్క కణం రోగానికి దారితీసేదిగా వుంటుంది. అలాంటి జీవకణాలను తెలుసుకుంటున్నారు. తరువాత వాటికి చికిత్స, ఎలా తొలగించిడం అనేది