పుట:Abaddhala veta revised.pdf/315

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టుకొని ఫ్రాయిడ్ తన సెక్స్ సిద్ధాంతంలో వివరణ యిచ్చాడు. క్రమేణా సైకో ఎనాలసిస్ అనే ఫ్రాయిడ్ సిద్ధాంతం పుంజుకున్నది. హిస్టీరియా, కలలు,కోర్కెల్ని అణచుకోవడం, చిన్నతనంలో సెక్స్, అచేతనం అనేవాటిని ఫ్రాయిడ్ ప్రచారంలోకి తెచ్చాడు. ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలోనే ఫ్రాయిడ్ తన సిద్ధాంత రచనలు లోకానికి చాటాడు. దీని ఆచరణకు ఉపక్రమించినవారు సైకో ఎనాలసిస్ ను ఒక ఉద్యమంగా స్వీకరించారు. ఎదురు చెప్పడానికి భయపడ్డారు. ఫ్రాయిడ్ పలుకుబడి అలా వుండేది.

మనోవిశ్లేషణ (సైకో ఎనాలసిస్)

ఫ్రాయిడ్ కనుగొన్నట్లు ప్రసిద్ధిచెందిన సిద్ధాంతం పేరు సైకో ఎనాలసిస్. అంటే మనోవిశ్లేషణ. అదొక ప్రపంచ ఉద్యమంగా వ్యాపించి, సంఘాలు వెలిశాయి. అంతర్జాతీయ సంఘాధ్యక్షులుగా సుప్రసిద్ధ మనోవైజ్ఞానికుడు కార్ల్ యుంఘ్ ను పెట్టి ఫ్రాయిడ్ ప్రచారం చేశాడు. వియన్నా సంఘాధ్యక్షుడుగా మరో మనోవైజ్ఞానికుడు యాడ్లర్ వున్నాడు. 1906 నాటికే ఫ్రాయిడ్ తన వినూత్న సిద్ధాంతాలు రాసి, ప్రచారంలో పెట్టాడు. వాటిని అమలులోకి తెచ్చాడు. ఎదురులేని విధంగా యీ సిద్ధాంతాలు అతిత్వరగా అల్లుకుపోయాయి. వైజ్ఞానిక దృక్పధంతో పరీక్షకు నిలుస్తాయా లేదా అని చూడదలచినవారు మైనారిటీ అయ్యారు. అలాంటివారు విమర్శలు ఆనాటి ప్రచారంలో కొద్ది మందికే చేరాయి.

హిస్టీరియా అంటే ఏమిటి, అణచివేతకు అర్థం ఎలా చెప్పాలి, కలలు వాటి స్వభావం, చిన్నప్పటి సెక్స్ ప్రవృత్తి, అచేతనం బలం గురించి ఫ్రాయిడ్ చెప్పినవి ఆకర్షణీయంగా అంటుకుపోయాయి. సైకో ఎనాలసిస్ రంగంలో ఫ్రాయిడ్ సిద్ధాంతాలు ప్రచారంలో పెట్టాడానికి యూంగ్ యాడ్లర్ కు తోడు, కార్ల్ అబ్రహం, విల్ హెల్ం స్టెకల్ వంటివారు బాగా కృషిచేశారు. ఫ్రాయిడ్ అనంతరం కారన్ హార్నే, హారీస్టాక్ సల్లివన్, ఎరిక్ ఫ్రాంలు యీ రంగంలో నిలిచి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి గాంధి ఎలా వుండేవారో, సైకో ఎనాలసిస్ సంఘానికి ఫ్రాయిడ్ అలా నిలిచాడు. పదవులు నిర్వహించకపోయినా, పెత్తనం చేశాడు. ఆయన మాట చెల్లింది. వ్యతిరేకుల్ని చిత్తుచేసి నెగ్గుకురావడంలో ఫ్రాయిడ్ ఆరితేరాడు, యూంగ్, యాడ్లర్ క్రమేణా తమ సొంత వ్యాఖ్యానాలతో ఫ్రాయిడ్ కు దూరం అయ్యారు. అయినా ఫ్రాయిడ్ పలుకుబడి తగగ్లేదు. సైకో ఎనాలసిస్ పై సర్వహక్కులూ తనకే వున్నాయని,అందులో అక్షరం మార్చాలన్న తన అనుమతి కావాలనంట్లు ఫ్రాయిడ్ ప్రవర్తించాడు. మార్పులు చేసే హక్కు తన ఒక్కడికే వునందని చూపాడు. ఈ నేపధ్యంలో సైకో ఎనాలసిస్ సిద్ధాంతం ఆచరణ ఎలా సాగిందో గమనిద్దాం.

ఇది 20వ శతాబ్దపు విచిత్ర కథనం. ఫ్రాయిడ్ గొప్పతనం గమనార్హం. సైకో ఎనాలసిస్ లో మాట్లాడడమే ముఖ్యం. అటు వైద్యుడు, ఇటు రోగి ఇద్దరే వుంటారు. ఒకరు మాట్లాడుతుంటే మరొకరు వింటారు. రోగిని మాట్లాడనిచ్చి, అతని పదాలలో అర్థాన్ని గూఢార్థాన్ని సంకేతాలను విప్పి చెప్పడం సైకో ఎనాలసిస్ చికిత్స. ఈ విద్యలో ఫ్రాయిడ్ ఆరితేరినవాడు. గ్రీకు, రోమన్ గాథల నుండి ఎంతో అరువుతెచ్చి ఫ్రాయిడ్ తన రచనల్లో వాడాడు.