పుట:Abaddhala veta revised.pdf/313

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నుండి బయటపడినవారు, స్వేచ్ఛగా సంపూర్ణ జీవనం సాగించగలరని కూడా ఫ్రాయిడ్ చెప్పాడు. దీనితో మతస్తులు ఆయనపై విరుచుకపడ్డారు. క్రైస్తవ మతం, అందులోనూ కేథలిక్ శాఖ మానవ శత్రువు అని కూడా స్పష్టం చేశాడు. ది ఫ్యూచర్ ఆఫ్ ఇల్యూజన్ లో ఫ్రాయిడ్ మత విమర్శ చేశాడు(1927) విశ్వవ్యాప్తంగా వున్న మానసిక రుగ్మతగా మతాన్ని చిత్రించిన ఫ్రాయిడ్, దాన్నుండి బయటపడాలన్నాడు.

సృష్టి, ఊహ అనేవి ఫ్రాయిడ్ మూలాధారాలు. వాటిని జనం మధ్యకు తెచ్చి చర్చలో పెట్టాడు. ప్రతి వ్యక్తికీ కొద్దోగొప్పో యీ సృష్టి లక్షణాలుంటాయి. అందరూ వూహిస్తారు. సంకేతాలు వాడతారు. మనోవిశ్లేషణ సిద్ధాంతసారంగా ఫ్రాయిడ్ యీ సంగతి నొక్కి చెబుతాడు. ఫ్రాయిడ్ డాక్టరు. కాని అతని చికిత్సలో నయమైన రోగుల దాఖలాలు తక్కువ. అతని సిద్ధాంతాలు ప్రజాబాహుళ్యంలో తగ్గిపోతున్నా, కొన్ని మూలసూత్రాలు మాత్రం చర్చలో మిగిలాయి. బాధాకరమైన కోర్కెల్ని, వూహల్ని బలవంతంగా అణచివేస్తామనేది అందులో పేర్కొనదగింది. నోరుజారి మాట అనడంపై ఫ్రాయిడ్ వివరణ ఆకర్షణీయంగా మారింది. యుంగ్ వంటి శాస్త్రపరుల పట్ల ఫ్రాయిడ్ రాగద్వేషాలు, సిద్ధాంత ప్రచారాలు సైకో ఎనాలసిస్ ఒక చికిత్సగా వ్యాప్తికి తేవడం, స్వప్నాలకు అర్థం చెప్పడం, యివన్నీ అతని ప్రజ్ఞకు నిదర్శనాలు. సనాతన మత నమ్మకాలు గల కుటుంబంలో పుట్టిన ఫ్రాయిడ్ తనకు నాస్తికుడుగా, అజ్ఞేయవాదిగా పేర్కొన్నాడు. కాని జీవితమంతా యూదుగానే వున్నాడు. యూదు సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లు ఫ్రాయిడ్ పాటించాడు.

వైద్యునిగా ఆరంభం

వియన్నా యూనివర్సిటీలో 1881లో ఫ్రాయిడ్ మెడిసిన్ డిగ్రీ పుచ్చుకున్నాడు. వియన్నా జనరల్ ఆస్పత్రిలోనే పనిచేశాడు. తరువాత 1883 నుంచీ నరాలపై దృష్టి పెట్టి అధ్యయనం చేస్తూ నిపుణుడుగా తేలాడు. పారిస్ లో అప్పటికే జీమార్టిన్ చార్కాట్ సుప్రసిద్ధుడుగా వున్నాడు. ఫ్రాయిడ్ 1885లో చార్కాట్ వద్ద అధ్యయనం చేశాడు. (1885-1886) తరువాత మెదడుపై ప్రత్యేక పరిశీలన మొదలెట్టి, రచనకు పూనుకున్నాడు. కాని అది ఎన్నడూ పూర్తిచేయలేదు ఎందుకోమరి! నరాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఫ్రాయిడ్ తన తొలి రచన 1891లో వెలువరించాడు. నరాల విషయంలో అది గొప్ప గ్రంథంగా పేరొందింది. 1883లో నరాల పరిశీలన ఆరంభించిన ఫ్రాయిడ్ 1897 వరకూ అందులో నిమగ్నుడయ్యాడు. అది అతడి పరిశోధనా దృష్టికి పరీక్షా సమయం. ఫ్రాయిడ్ కొత్తగా వైద్యం ప్రాక్టీసు చేస్తున్న రోజులలో ఎలక్ట్రో థెరపీ వుండేది. స్టడీస్ ఇన్ హిస్టీరియా అనే రచనలో ఫ్రాయిడ్ ఎలక్ట్రో థెరపీ ప్రస్తావన తెచ్చాడు.

ఫ్రాయిడ్ యిష్టపడిందీ,అసలు చికిత్సగా నమ్మిందీ మనోవిశ్లేషణ (సైకో ఎనాలసిస్) దీనివల్ల అతనికి పేరు, ప్రపంచ ఖ్యాతి వచ్చాయి. కొత్తపేర్లు ప్రచారంలోకి తేవడంలో, ఉపమానాలు వాదడంలో, గ్రీక్ రోమన్ గాథల నుండి ఉదాహరణల స్వీకరించడంలో ఫ్రాయిడ్