పుట:Abaddhala veta revised.pdf/312

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలిసిందని ఫ్రాయిడ్ గొప్పలు చెప్పాడు. లైంగికం(సెక్స్)అంటే వక్రభాష్యం చెప్పి, హస్తప్రయోగం, సుఖవ్యాదులు తప్పుడు పద్ధతి అని ప్రచారం చేశాడు. హాస్యం ఆనందించాలి, కాని సైకో ఎనలిస్ట్ విశ్లేషించి, అందులోని మజాను పోగొడతాడు. ఫ్రాయిడ్ తన విశ్లేషణ సూత్రాల్ని తానే ఉల్లంఘించాడు అచేతనం అనేది సైకో ఎనాలసిస్ పేరిట ప్రచారంలోవున్న మాఫియా మాత్రమే. ఈతరానివాడు నీళ్ళలో పడినవాడిని కాపాడడం వంటిదే. మానసిక రోగులకు సైకో ఎనాలసిస్ చికిత్స! మతాన్ని సైన్స్ గా ఒప్పించడం ఫ్రాయిడ్ గొప్పతనం.

- హేతువాది, మార్చి,ఏప్రిల్,మే 1992
ఫ్రాయిడ్ విశ్లేషణలపై సరికొత్త శోధన!

ఇరవయ్యో శతాబ్దంలో కొత్త ఆలోచనలు పాదుకున్నాయి. మానసిక ప్రపంచంలోని అంశాల గురించి శోధించడానికి తగిన భూమిక అంతకుముందే ఏర్పడింది. ఇందుకు సిగ్మండ్ ఫ్రాయిడ్ చేసిన పరిశోధనలే మూలంగా ప్రచారమొందాయి. ఫ్రాయిడ్ పరిశోధనలు విభిన్నరంగాలపై, ప్రాంతాలపై ప్రసరించాయి. తెలుగునేల కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఆయన పరిశోధనల ప్రామాణికతపై ఇదివరలోనే ప్రశ్నలు తలెత్తాయి. సాహిత్య కళారంగాలకి సైతం ఫ్రాయిడ్ ఆలోచనల్ని అనుసంధానించి వ్యాఖ్యానించే పద్ధతి ఉంది. ఈ దృష్ట్యా ఫ్రాయిడ్ నేపధ్యాన్ని,ఆయన పరిశోధనల తీరును, వాటి ఫలితాల్ని గురించి తెలుసుకోవడం అవసరం. ఆయన ఆలోచనల్ని ఎంతవరకు ఆమోదించగలమన్న విషయాలపై సరైన అంచనాలకు రావడం తప్పనిసరి. ఇందుకు ఉపకరించే వ్యాసమిది.

జగమంతా సెక్స్ మయంగా చూసిన ఫ్రాయిడ్ ఒక శతాబ్దం పాటు ప్రపంచంలో ఎన్నో రంగాల్ని ప్రభావితం చేశాడు. ఐన్ స్టీన్, మార్క్స్, డార్విన్ కోవలో ఫ్రాయిడ్ ను చేర్చిన సందర్భాలు లేకపోలేదు. రానురాను ఫ్రాయిడ్ ను బాగా అధ్యయనం చేసి, ఆయన చెప్పినవి, చేసినవి ఎంతవరకు నిలుస్తాయో పరిశీలించారు. ఆయన శిష్యులే గురువును కొంతవరకు నిరాకరించి, పనికొచ్చేవి ఏమిటో బేరీజు వేస్తున్నారు.

సిగ్మండ్ ఫ్రాయిడ్(1856-1939) నాస్తికుడు,హేతువాది,యూదు డాక్టరుగా ఆరంభమైన ఫ్రాయిడ్ ఈల్ లో గోనడ్స్ గురించి పరిశోధనతో రంగప్రవేశం చేశాడు. ఫ్రాయిడ్ పై గ్రీక్ సాహిత్య ప్రభావం అధికం. ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్ లలో జీవించిన ఫ్రాయిడ్, తన చివరి రోజులలో హిట్లర్ నాజీ నియంతృత్వ ధోరణుల వల్ల ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడే గడిపి కేన్సర్ తో చనిపోయాడు.

మతాన్ని ఆద్యంతాలు వ్యతిరేకించిన ఫ్రాయిడ్,మన చుట్టూ వున్న ప్రపంచంలో మనం సృష్టించుకున్న కోర్కెల లోకంపై, అదుపుపెట్టే యత్నమే మతం అన్నాడు. మతం అనేది ఒక భ్రమ అనీ, అయితే ఓదార్పు యిచ్చే విషయంగా అది పరిణమించిందనీ ఫ్రాయిడ్ అన్నాడు. మతం