పుట:Abaddhala veta revised.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులకు విద్యుత్ షాక్ యిచ్చి చికిత్స చేసి చిత్రహింసకు గురిచేసిన పద్ధతులను చాలామంది తీవ్రంగా విమర్శించారు.1927లో నోబెల్ బహుమతి అందుకున్న జూలియస్ వాగ్నర్ జారెగ్(1857-1940) చిత్రహింసల చికిత్సను ఫ్రాయిడ్ వెనకేసుకొచ్చాడు. అతడి పద్దతిలో ఆస్ట్రియా సైకియాట్రిస్టులు చిత్రహింస షాక్ వైద్యం పాటించారు. ఆస్ట్రియా యుద్ధ మంత్రిత్వశాఖ ఒక విచారణ సంఘాన్ని నియమించింది. వారు ఫ్రాయిడ్ అభిప్రాయమడిగితే వాగ్నర్ జారెగ్ (Wagner-Jauregg) పద్ధతిని ఆయన సమర్ధించాడు. వాగ్నర్ తన స్వీయచరిత్రలో యుద్ధ ఖైదీలలో నరాల జబ్బు పేరిట నటించిన సైనికులకు యిచ్చిన చికిత్స క్రూరమైనదేననై ఒప్పుకునాడు. యుద్ధం వలన వచ్చే నరాల మనోరుగ్మతకు సైకో ఎనాలసిస్ చికిత్స పనిచేస్తుందని ఫ్రాయిడ్ గొప్పలు చాటుకున్నాడు. యుద్ధం నుండి తప్పించుకోడానికి జబ్బువచ్చినట్లు నటించే సైనికుల లక్షణాలను, ఫ్రాయిడ్ తన గంభీర పదజాలంతో, అందులో అచేతన వుద్దేశాలే సిద్ధాంతీకరించాడు. సైనికుడు అబద్ధం ఆడటంకాదనీ, చేతన అచేతన ఉద్దేశాలు గుర్తించకపోవడం తప్పు అనీ ఫ్రాయిడ్ అన్నాడు. కావాలని ఫ్రాయిడ్ అబద్ధాలు అల్లినట్లు సాజ్ విమర్శించాడు. అబద్ధాలు ఆడి నటించేవారికీ,నరాల మనోబలహీనతలు వున్నవారికీ పోలికలు తేడాలు వున్నాయని ఫ్రాయిడ్ తన పదజాలంతో పాఠకులను గందరగోళపరచాడు.

విద్యుత్ షాక్ వైద్యం, హిప్నాసిస్ దశ నుండి విడివడి, సైకో ఎనాలసిస్ పెరిగింది. దీనికి ఒక శాస్త్రీయస్థాయి సమకూర్చడానికి ఫ్రాయిడ్ తన ప్రభావాన్ని పదజాలాన్ని ప్రయోగించాడు. వైద్య అవసరం దృష్ట్యా యిది ఆవిర్భవించిందన్నాడు. ఫ్రాయిడ్ మొదట్లో ఎలక్ట్రోథెరపి వాడాడు. తర్వాత హిప్నాసిస్ కు మారాడు. ఉత్తరోత్తరా సైకో ఎనాలసిస్ అనే తొడుగుతో జనాన్ని ఆకర్షించాడు.

సైకో ఎనాలసిస్ లో శాస్త్రీయం ఏదీ లేదు. ఫ్రాయిడ్ సృష్టించిన కొత్త మతం అది.

ముగింపు

నేను సైన్సు మనిషిని కాదు సాహసిని మాత్రమే అని ఫ్రాయిడ్ 1890 ఫిబ్రవరి 1న విల్ హెల్ం ప్లెస్ కు వ్రాశాడు. సైకో ఎనాలసిస్ అనేది, కోకకోలా వలె ఒక ట్రేడ్ మార్కు. అదొక ఉపమానం. మాట్లాడటం ఇందులో ముఖ్యం. దీనిని ఫ్రీ అసోసియేషన్ పద్ధతి ద్వారా విశ్లేషించవచ్చని ఫ్రాయిడ్ తన విధానంగా పేర్కొన్నాడు. డాక్టరు కావాలనుకున్నదే రోగి నుండి రాబట్టడానికి యిందులో ప్రయత్నిస్తారు. మాట్లాడే పద్ధతికి వైద్యం తొడుగుతెచ్చిపెట్టిన ఫ్రాయిడ్ యూదుల మతరీతులకు ఆధునిక ముసుగువేశాడు. జీవితానికి అర్థం, జీవిత విలువ ప్రశ్నించేవారంతా రోగులే అని ఫ్రాయిడ్ అన్నాడు. సంభాషణను చికిత్సగా మార్చిన ఫ్రాయిడ్ గొప్ప సాధకుడే! సైన్స్ ముసుగులో వున్న మతమే సైకో ఎనాలసిస్. అచేతనం అనేది తనకే తొలుత