పుట:Abaddhala veta revised.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాగద్వేషాలను ఇడ్(ID) అనీ, స్వీయంను అహం (ego)అనీ, చైతన్యతను సూపర్ ఇగో అనీ ఫ్రాయిడ్ పేర్లుపెట్టి పిలిచి, ప్రచారం చేశాడు. సంఘర్షణలు, పరస్పర విరుద్ధ కోరికల బదులు ఫ్రాయిడ్, ధోరణులు (Complexes) అస్పష్టబావాలు (ambivalenses) అనీ చెప్పాడు. అన్నిరకాల లైంగికాలను లిబిడొ అని నామకరణం చేశాడు. ఇది ఈరోస్(eros)గా, జీవనప్రేరణ (Life Instinct)గా వెల్లడౌతుందన్నాడు. సైకోఎనాలసిస్ అంటే మాట్లాడటమే. ఏం మాట్లాడాలి? ఫ్రాయిడ్ చెప్పినట్లు మాట్లాడాలి. కాకుంటే తిట్లు!

మానవులలో సగం మంది స్త్రీలు. వారంతా లైంగికంగా అణగారిపోయారంటాడు. ఉపమానాలు చెప్పడంలో సిద్ధహస్తుడైన ఫ్రాయిడ్ రాస్తూ, పురుషుల లైంగికావయవం, వికలాంగం రూపంలో వుండటమే బాలికల పెరుగుదలలో ప్రధాన అంశం అంటాడు. వారికి మర్మావయవంలోవున్న కేంద్రిక కూడా (Clitoris) తక్కువ స్థాయిదనీ, లైంగిక లోపాన్ని సూచించే ధోరణి వున్నదనీ చెబుతూ, ఇతర విషయాలలో స్త్రీ కూడా ఒక వ్యక్తి అని విస్మరించరాదంటాడు. స్త్రీలకు వ్యతిరేకంగా ఫ్రాయిడ్ చేసిన భాష్యంవలన అతడికి సెక్స్ పట్ల సరైన అవగాహన లేదనేది స్పష్టం.

సెక్స్ (లైంగిక సంబంధం) వాంఛనీయమైన కామం అనీ, వ్యక్తిగత అభిరుచి అనీ, పరస్పర సన్నిహితత్వానికి పరాకాష్ట అనీ, స్త్రీ పురుషుల మధ్య పరస్పర గౌరవం సూచిస్తుందనీ ఫ్రాయిడ్ విస్మరించినట్లు థామస్ సాజ్ స్పష్టపరిచాడు.

ఫ్రాయిడ్ దృష్టిలో మానవజాతి అంతా మనోవైకల్యంతో వున్నవారే.

ఫ్రాయిడ్ లో యూదుజాతి లక్షణం:

ఫ్రాయిడ్ పూర్వీకులంతా యూదులే. అతడి ముత్తాత రాబి ఎఫిరం ఫ్రాయిడ్, తాత రాబి స్లోమొఫ్రాయిడ్. యూదుగా పుట్టిన ఫ్రాయిడ్ అసలు పేరు స్లోమో(Sclomo) యూనివర్శిటీలో 1873 చేరినప్పుడు తనను తక్కువగా చూడడంతో ఫ్రాయిడ్ ఇంకా యూదు స్వభావాన్ని గట్టి పరచుకున్నాడు. జీవితమంతా యూదుగా గడిపిన ఫ్రాయిడ్ తన లేఖల్లో యీ స్వభావాన్ని బాగా స్పష్టపరిచాడు. యవ్వనదశలో 1882లో తనకు కాబోయే భార్యకు వ్రాసిన జాబులో యూదులుగానే జీవితం ఆనందమయం చేసుకుందామని వ్రాశాడు. 1895లో యూదుల సంఘం బనాయ్ బ్రత్ సమాజంలో చేరి జీవితాంతం వున్నాడు. యూదుల సమావేశాల్లో ప్రతివారం పాల్గొని ఉపన్యాసాలిచ్చేవాడు. సైకో ఎనాలసిస్ సఫలం కావాలంటే ఆర్యుల్ని కలుపుకోవాలని వ్యూహంగా పేర్కొన్నాడు. 1908లో అబ్రహంకు వ్రాసిన లేఖలో ప్రాచీన యూదుల పట్టుదలే, చివరివరకూ కాపాడుతుందని ధైర్యం చెప్పాడు.

యూదులలో అబ్రహాం, ఫెరెంజోలను దగ్గరతీసి సైకో ఎనాలసిస్ ప్రోత్సహించిన ఫ్రాయిడ్, యెత్తుగడగా మాత్రమే యూంగ్ ను ప్రోత్సహించినట్లు పేర్కొన్నాడు లేఖల్లో. సైకో