పుట:Abaddhala veta revised.pdf/302

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఫ్రాయిడ్ తన సొంత వైద్యవృత్తికి 1886లో నాంది పలికాడు. అప్పటికి ఆయన వయస్సు 30 సంవత్సరాలు. వియన్నాలో నరాల జబ్బు నిపుణుడుగా ప్రారంభించాడు. వారానికి మూడు పర్యాయాలు కాసోవిట్జ్ సంస్థలో చిన్న పిల్లల నరాల జబ్బుకు వైద్యుడుగా వెళ్ళేవాడు. అప్పుడే తీరిక వుండేది గనుక అనువాదాలు చేయడం, పుస్తక రచనలో నిమగ్నుడయ్యాడు. నరాల జబ్బు నయం చేసుకోడానికి వచ్చిన రోగులనుండి ఫీజు వసూలుచేసేవాడు. అప్పట్లో ఎలక్ట్రోథెరపీ విరివిగా వినియోగించేవాడు. దీనితో పాటు మర్దన, స్నానాలు చేయించడం కూడా చికిత్సలో భాగంగా వుండేది. ఆరేళ్ళపాటు యీ విధానం సాగించిన తరువాత ఫ్రాయిడ్ దారి మళ్ళించాడు. నరాల్లో ఉత్తేజం కలిగించడానికి విద్యుత్ ప్రసరింపజేసే పద్ధతి ఆనాడు బహుళ ప్రచారంలో వుండేది.

తరువాత హిప్నాసిస్ విధానం చేబట్టిన ఫ్రాయిడ్,1889 వరకూ ఆ పద్ధతి అనుసరించాడు. నరాల జబ్బుకు అది ఉత్తమ చికిత్స అని అప్పట్లో నమ్మకం ప్రబలివుంది. ఇందులో కూడా వైద్యుడు రోగి మధ్య సంభాషణ ప్రధానం అని గుర్తించుకోవాలి. ఫ్రాయిడ్ తన రోగుల్ని పండుకోబెట్టి ఎదురుగా తానొక కుర్చీపై కూర్చొని మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. జీవితాంతం యీపద్ధతి ప్రయోగించాడు. కేంద్రికరించి మాట్లాడే పద్ధతిని రోగులపై ప్రయోగించి, రోగిని కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమని, ఒక రోగలక్షణంపై కేంద్రీకరించమని చెప్పి, జ్ఞాపకం వచ్చినంత వరకు రోగం ఎలా ఆరంభమైందో గుర్తు తెచ్చుకోమనేవాడు. రోగికి యిలాంటి చికిత్సా విధానాన్ని 1892లో ఆరంభించిన ఫ్రాయిడ్, ఎంతసేపూ ఏమీ గుర్తుకు రాని ఒకామెకు, నొసలు నొక్కి జ్ఞాపకం వస్తాయని చెబుతూ పోయాడు. రోగి తనతో మాట్లాడడానికి అయిష్టంగావున్నపుడు యిలాంటి పద్ధతిని ఫ్రాయిడ్ వాడేవాడు. 1895 వరకూ తన చికిత్సను కెథార్సిన్ విధానం అని స్టడీస్ ఇన్ హిస్టీరియాలో రాసుకున్నాడు.

సైకో ఎనాలసిస్:

మొట్టమొదటగా 1896లో సైకో ఎనాలసిస్ అనే మాటను ఫ్రాయిడ్ వాడాడు. జోసెఫ్ బ్రాయర్ విధానం వలన సైకో ఎనాలసిస్ పద్ధతికి తాను దారితీసినట్లు ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. జీవితమంతా ఆ మాటనే వాడాడు.

ఫ్రాయిడ్ నరాల జబ్బులకు చికిత్స చేసేవానిగా ఆరంభించి, కేవలం వైద్యం చేయడం గాక, జబ్బుకు మూలం ఏమిటో తెలుసుకోవాలనుకునేవాడు. విల్ హెల్ం ప్లయిస్ తో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా యీ విషయం వెల్లడైంది. శాస్త్రీయ మనోవిజ్ఞాన పధకం కూడా చేయాలని తలపెట్టాడు. వైజానిక స్థాయికి మానసిక రీతుల్ని తీసుకరావాలని ఆయన ఉద్దేశించాడు. వ్యక్తి మనస్సులో(మెదడులో?) రెండురకాల నరాలున్నాయని, ఒక విధమైనవి ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రత్యక్ష జ్ఞానాన్ని అట్టిపెట్టగా, రెండో రకమైనవి జ్ఞాపకాలను వుంచుతాయన్నాడు. మెదడులో జరిగే వాటికి ఉపమానాలతో వివరణ యివ్వడం 1895 నుండీ ఫ్రాయిడ్ చెసిన