పుట:Abaddhala veta revised.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుడిలో నమ్మకం కోల్పోతేనైతికంగా అరాచకత్వం వస్తుందనే వాదన పూర్వం నుండే వస్తున్నాయి టీవలీ టైం పత్రిక ఎడిటర్ సైతం యిలాంటి విమర్శలు చేశాడు. హెన్రీ గ్రున్ వాల్క్ తన విమర్శలలో,మానవుడికి దేనిపైనా నమ్మకం,గురి లేకుంటే,నీతి నిలబడదని వాదించాడు. సృష్టివాదులు కూడా అలాంటి వాదనే చేస్తునారు. మానవవాదంపై తీవ్ర విమర్శలు చేసిన వారిలో రష్యా రచయిత అలెగ్జాండర్ సోల్జినిట్సిన్, ఇర్వింగ్ క్రిష్టల్, రిచర్డ్ జాన్, న్యూహాస్ మొదలైన ప్రముఖులు వున్నారు.

మానవవాదంపై మతం విమర్శిస్తే అర్థం చేసుకోవచ్చు. కాని తాత్వికులు, చింతనాపరులు విమర్శలు చేసినప్పుడు జాగ్రత్తగా పరిశీలించవలసి వుంటుంది.

మానవవాదాన్ని సమర్థించడంలోనూ,విమర్శల్ని పట్టించుకోవడంలోనూ యూరోప్,అమెరికా,ఆస్ట్రేలియాలు బాగా శ్రద్ధ వహిస్తున్నాయి. ఇండియాలో ఇంకా ఈ విమర్శలకు ప్రాధాన్యత యివ్వడం లేదు. అలాంటి విమర్శలు వున్నాయని కూడా ఏ కొద్దిమందికో తప్పతెలియదు.

డేవిడ్ విల్సన్ ,జాన్ డ్యూయీ, కార్ల్ లెమాంట్, కార్ల్ వాగన్, ఇజక్ అసిమోవ్, పాల్ కర్జ్,అడాల్ఫ్ గ్రున్ బాం, బార్పరాస్మోకర్ మొదలైనవారు విమర్శల్ని శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఎదుర్కొన్నారు.

1980 ప్రాంతాల నుండీ మానవవాదానికి వచ్చిన అపఖ్యాతి తొలగుతూ పోయింది. మానవవాదం అంటేనే ఒక తిట్టుగా 1950-80 మధ్య ప్రచారం సాగింది. ఆ ధోరణి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది.

సంఖ్య రీత్యా మానవవాదులు ప్రపంచవ్యాప్తంగా అల్పసంఖ్యాకులే. కాని వారి వాదబలం నిలబడడానికి ప్రధాన కారణం వారు స్వీకరించిన ఆయుధమే. అదే శాస్త్రీయపద్దతి. సామాజిక,మానసిక శాస్త్రాలలో సైతం వివేచనాత్మకంగా సాగాలని మానవవాదులు కోరుతున్నారు. థామస్ సాజ్(THOMAS SZASZ) వంటివారు యిటీవల చేసిన విమర్శలే మానవవాదాన్ని మళ్ళీ పట్టాలపై నిలబెట్టడానికి ఉపకరించాయి.

ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న అతిప్రధాన సమస్యల్ని గుర్తిస్తే, ఒకటి జనాభా పెరుగుదలగానూ,రెండవది ప్రకృతిలో కాలుష్యవ్యాప్తిగానూ తేలాయి. మానవవాదులు యీ రెండింటినీ పట్టించుకుంటున్నారు. మతవాదులలో కొందరు మానవ నియంత్రణను వ్యతిరేకిస్తున్నారు. సోషియో బయాలజీ తత్వానికి పితామహుడైన ఎడ్వర్డ్ ఈ సమస్యలపట్ల అటు మతవాదుల్ని ఇటు మానవవాదుల్ని కలిపి చర్చలు సాగించే కృషిని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేస్తున్నారు. తాత్వికంగా చూస్తే,పరిణామవాదాన్ని అంగీకరించిన మానవవాదులు ప్రకృతిని కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారని విల్సన్ అంటారు. (ఫ్రీ ఇన్ క్వైరీ 1993 స్ప్రింగ్, బఫెలో,అమెరికా)