పుట:Abaddhala veta revised.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

Articles :

Ethics : Encyclopedia Britannica 1996 edition

Co-Editor : Bio Ethics Journal

- మిసిమి మాసపత్రిక, జనవరి-2000
రామమోహన్ రాయ్ పునర్వికాసానికి తోడ్పడ్డాడా?

భారతదేశంలో పునర్వికాసానికి నాందిపలికిన వ్యక్తిగా రామమోహన్ రాయ్ ను పేర్కొంటాం. ఆయనతోనే అది ఆగిందని కూడా అంటుంటాం. అలాంటి వ్యక్తి జీవితాన్ని గురించి చాలా పరిశోధనలు జరిగిన తరువాత బయటపడిన విషయాలు గమనిస్తే ఆశ్చర్యపడక మానం. ఆ దృష్టితో కొన్ని పరిశీలనాంశాలు యిక్కడ ఉదహరిస్తున్నాను :

బెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లా సంస్థ గ్రామానికి చెందిన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో రామమోహన్ జన్మించాడు. పౌరోహిత్యం వంశపారంపర్యంగా వారి వృత్తి. రామమోహన్ ముత్తాత మొగలాయిల క్రింద రెవిన్యూశాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేశాడు. కృష్ణచంద్రబందోపాధ్యాయ ఆయన పూర్తి పేరు. ఆయన చేసిన ఉద్యోగాన్ని రాయ్-రాయన్ అనేవారు. అది క్రమేణా రాయ్ గా మారింది. బందోపాధ్యాయ స్థానంలో రాయ్ వచ్చి అదే యింటి పేరైంది. ఉద్యోగరీత్యా కృష్ణచంద్ర వెళ్ళి రాధానగర్ లో వున్నారు.

రామమోహన్ తాత ప్రజవినోద్, తండ్రి రమాకాంత్ లు బాగా ఆస్తులు సంపాదించారు. ఆ సంప్రదాయంలో రామమోహన్ పుట్టాడు. రమాకాంత్ తన ముగ్గురు పుత్రులకు 1796లోనే ఆస్తుల్ని పంచేశాడు. పన్ను చెల్లింపు తప్పించుకోడానికి యీ పనిచేశాడు. ఆ పంపకాలలో రామమోహన్ కు 50 బిగాల వ్యవసాయక్షేత్రం, జొరశాంకోలో కలకత్తా గృహం సంక్రమించాయి. దీనితోబాటు డబ్బు కూడా లభించింది. పంపకాలు జరిగిన 9 మాసాలకే రామమోహన్ కలకత్తా వచ్చి వడ్డీవ్యాపారంలో దిగాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులకు పెద్ద వడ్డీలతో డబ్బిచ్చేవాడు. (కలకత్తా రివ్యూ 1933 Vol. 49 నెం. 3,పుట 238)

1797లో అండ్రూరాంసేకు 5 వేల రూపాయలు, థామస్ ఉడ్రోఫ్ కు 5 వేలు అప్పిచ్చాడు రామమోహన్. వందరూపాయలు నెలకు జీతం తెచ్చుకునే ఉద్యోగిగా బెనారస్ లో రామమోహన్ జీవితం ప్రారంభించాడు. అక్కడ కొద్దికాలమే వున్నాడు. తిరిగివచ్చి వుడ్రోఫ్ కింద దివాన్ అయ్యాడు. తరువాత జాన్ డిగ్బే కింద చేరాడు. దివాన్ గా యితడికి మంచి పేరు లేదు.

దివాన్ గా ఉద్యోగం చేస్తున్నా, వడ్డీవ్యాపారం మానలేదు. తన బంధువు గోపీమోహన్ ఛటర్జీని కలకత్తాలో యీ పనికి వియోగించాడు. రంగపూర్ లో కూడా యిదే వడ్డీవ్యాపారం సాగించాడు. తరచు రంగపూర్ నుండి కలకత్తాకు డబ్బు చేరవేస్తుండేవాడు. ఈ విధంగా వడ్డీలతో