పుట:Abaddhala veta revised.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణేశ్వర్‌లో తొలిపర్యాయం రామకృష్ణను చూచినప్పుడు, వివేకానంద పట్ల రామకృష్ణకే ఎక్కువ ఆకర్షణ ఏర్పడింది. ఒకనెల తరువాత రెండోపర్యాయం వివేకానంద వచ్చినప్పుడు ఆయనమీద రామకృష్ణ కాలు పెట్టాడు. "నాకు తల్లిదండ్రులున్నారు. వారిని చూడవలసిన భాద్యత నాది. మీరు ఏంపని చేశారని" వివేకానందుడు వాపోయాడు. తల్లిదండ్రులు వివేకానందకు పెళ్ళి సంబంధాలు చూస్తుండగా రామకృష్ణ ఆయనింటికి వెళ్ళి బ్రహ్మచారిగా వుండమని, దైవచింతనలో నిమగ్నం కమ్మని తరచు బోధించేవాడు. పెళ్ళికి వివేకానందుడు విముఖుడు గాకపోయినా, అతని తండ్రి మరణించడంతో ఆ సమస్య వాయిదా పడింది. పెళ్ళి అంతకుముందు కుదరబోయి కూడా చిన్న విషయాలువద్ద తేడాలు రాగా తాత్కాలికంగా ఆగింది. ఇంటికి పెద్దకుమారుడైన నరేంద్రనాధ్ (వివేకానంద) సంపాదించి, పోషించవలసి వచ్చింది. ఉద్యోగాన్వేషణ చేశాడు. వివేకానందకు కొందరు రౌడీ మిత్రులుండేవారు. రౌడీపనులకు వారు పురమాయించారు. కాని వివేకానంద తమాయించుకొని రామకృష్ణ వద్దకు వెళ్ళి తన దుస్థితి చెప్పగా, ఆయన కాళికామాతను వేడుకోమన్నాడు. ప్రయోజనం లేకపోయింది. ఇక ముందు తినడానికి, కట్టుకోడానికి లోపం వుండబోదని రామకృష్ణ హామీయిచ్చి వివేకానందను ఓదార్చాడు.(చూడు:లీలాప్రసంగం)

ఉద్యోగాన్వేషణలో ఒకనాడు అలసి సొలసి రోడ్డుపక్క అడ్డం పడ్డ వివేకానంద, ఇక ప్రయోజనం లేదని సంసార పక్షాన్ని వదలేశాడు. దక్షిణేశ్వరాలయానికి తరచు వెడుతుండేవాడు. రామకృష్ణ ప్రభావంలో నరేంద్ర సన్యాసిగా మారి, నిరాజహోమం జరిపి, సంసారలోకంతో సంబంధం తెంచుకున్నాడు. సంసార బాధ్యతల్ని ఆ విధంగా తప్పించుకొని ఆశ్రమానికి చేరిన వివేకానంద తన వారిని విస్మరించలేకపోయాడు. తల్లి అప్పుడప్పుడూ మఠానికి వచ్చి కుటుంబవిషయాలు చెప్పి సంప్రదించి వెడుతుండేది. పూర్వీకుల ఆస్తిపాస్తుల విషయమై తన కుటుంబానికి తన మేనత్తకూ వచ్చిన తగాదా కోర్టు వరకూ వెళ్ళగా, వివేకానంద ఆ విషయమై శ్రద్ధ కనబరచాడు.

వివేకానంద చాలావరకు జమిందార్ల సహవాసంతోనే గడిపాడు. బాగా సుఖాలు కోరుకునేవాడు. అమెరికా వెళ్ళబోయేముందు తన తల్లికి సోదరులకు నెలకు 100 రూపాయల చొప్పున డబ్బు పంపించేటట్లు ఖేత్రి మహారాజా ద్వారా ఏర్పాట్లు చేశాడు. ఆ తరువాత 'స్వామిజీ' కోరికపై మహారాజా ఆయనకు కూడా వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం నెలకు వంద రూపాయల చొప్పున మంజూరు చేశాడు. (చూడు ఫర్‌గాటెన్ ఛాప్టర్స్, వేణి శంకర్, పుట 146-191) తాను "రిటైర్" అయిన తరువాత నివసించడానికి అనువుగా తన తల్లి పేరిట గంగానది ఒడ్డున ఒక యిల్లును నిర్మించవలసిందని, అందుకుగాను 10 వేల రూపాయలు యివ్వమని మహారాజును వివేకానందుడు కోరాడు. తన పేరిట స్థలం కొనమని 1895లో రామకృష్ణానందకు వివేకానంద వ్రాశాడు. వివేకానందుడి పేరిట కొన్న మఠం భూమిపై బెల్లి మునిసిపాలిటీకి ఆయనకూ దావాలు నడిచాయికూడా. (ప్రబుద్ధ భారత, 1901 ఆగస్టు) స్వామిజీ కోర్కె ననుసరించి తొలుత 500