పుట:Abaddhala veta revised.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరంజన్ ధర్ తన వేదాంత అండ్ బెంగాల్ రినైజన్స్ లో వివేకానంద గురించి హేతు దృక్పధంతో పరిశోధన చేశారు. అగేహానంద భారతి స్వయంగా రామకృష్ణ మిషన్ లో పనిచేసి, 8వ సంపుటాన్ని పరిష్కరించడంలో తోడ్పడిన వ్యక్తి. ఆయన తన రచనలలో వివేకానంద గురించి నిశిత పరిశీలన చేశారు. అవన్నీ ఈ రచనకు ఆధారాలు కూడా.

దేశం వెనక్కు నడుస్తున్నది. ఈ ప్రయాణం వివేకానంద వేదాంతంతో ఆరంభమై యిప్పుడు వేగం పుంజుకున్నది. యువత ఇది గ్రహించి తిరోగమనాన్ని ఆపి, శాస్త్రీయ పద్ధతి వైపు మళ్ళితేనే పురోగమనం, పునర్వికాసం సాధ్యం. వివేకానందను చరిత్రలో భాగంగా పరిగణిస్తేనే యిది సాధ్యం. మధ్య తరగతివారు వివేకానందను చదవకుండానే, ఏవో కొన్ని సూక్తులు ముక్కున పెట్టుకొని ఆరాధిస్తున్నారు. వివేకానంద రచనలు చదివితే, విచక్షణకు వివేచనకు నిలబడవని రుజువు కాగలదు.

- హేతువాది,డిశంబర్ 1993
మూర్ఛ రోగులకు మొక్కితే మోక్షం వస్తుందా?

రామకృష్ణ పరమహంసగా మారిన గదాధర్

యువకులు ఉద్రేకంగా వుండడం సహజం. వయోధర్మం కూడా. కొన్ని ఆదర్శాలతో ఉత్తేజితులు కావడం, వాటిని సాధించడానికి హింసకు సైతం వెనుదీయకపోవడం యువకులలో చూస్తాం. వివిధ రాజకీయ పార్టీలు యువకులను వాడుకోవడం కూడా గమనిస్తున్నాం. కాని యువతరం భక్తిమార్గంలో పడినా,భజనలు మొదలెట్టినా, పూజా పునస్కారాలలో మునిగిపోయినా ఆశ్చర్యపడాలి. ఇటీవల కొందరు యువతీయువకులు రామకృష్ణ ఆశ్రమాలకు, శభరిమలైకు, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆకర్షితులౌతున్నారు. అంటే యీ జాతిలో ఏదో పెద్ద లోపం వున్నదన్నమాట. ఈ లోపాలలో ఒకటి ఉపన్యాసాల వాగ్ధోరణిలో కొట్తుకుపోతూ, వాస్తవాలు తెలుసుకోకపోవడం. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస, వివేకానంద గురించి ఎంతమందికి నిజాలు తెలుసు? అవి గ్రహించకుండా గుడ్డిగా పెద్దల్ని అనుకరించడం, ఆలోచనను చంపుకోవడం యువతరంలో రుగ్మతను సూచిస్తుంది. ఆ దృష్టితో రామకృష్ణ, వివేకానందలను గురించి కేవలము వాస్తవాలు దృష్టికి తెస్తాను.

రామకృష్ణ పరమహంస

రామకృష్ణకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధర్. తండ్రి క్షుధీరాం మధ్యతరగతి పురోహితుడు. గదాధర్ కు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి తండ్రి చనిపోయాడు. పెద్దన్న రాంకుమార్ కూడా పౌరోహిత్యం చేసినా,కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది. గదాధర్ గ్రామంలోని పాఠశాలకు వెడుతుండేవాడు. ఇది హుగ్లీ జిల్లాలో వున్నది. కామార్జుకర్ గ్రామం సన్యాసులకు