పుట:Abaddhala veta revised.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోగొట్టుకోగా, ఆ విషయం తెలిసి, తామస్ కుక్ అండ్ సన్స్ ద్వారా మహారాజా మళ్ళీ డబ్బు సమకూర్చారు. ఈలోగా వాంకోవర్ నుండి రైల్లో షికాగో జులై 30న చేరారు. సెప్టెంబరులో గాని మత మహాసభ జరగదు. అందువలన షికాగో నుండి బోస్టన్ వెడుతుండగా మిస్ కేట్ శాన్ బార్న్ అనే వృద్ధురాలు తటస్తపడి, ఆదరించింది. వివేకానందను తన అతిథిగా అట్టిపెట్టి, గుర్రపు బుగ్గీపై తిప్పి జనానికి ప్రదర్శించింది. హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జాన్ హెన్రీరైట్ కు పరిచయం చేసింది. అతడు వివేకానందకు మత మహాసభ ప్రతినిధిగా వెళ్ళమని మళ్ళీ షికాగో పంపాడు. ఆయన యిచ్చిన అడ్రసు పారేసుకున్న వివేకానందకు జార్జీ హేల్ అనే స్త్రీ తటస్తపడి, ఆదరించి, మత మహాసభ ప్రతినిధిగా వెళ్ళే ఏర్పాట్లు చేసింది.

వివేకానందపై అమెరికాలో అనేక దుష్టప్రచారాలు ప్రచారంలోకి రాగా ఇండియా నుండి ఖెత్రి, జునాగడ్ మహారాజాలు ఆయనకు ఉత్తరాలిచ్చి పరువు నిలబెట్టారు.

షికాగోలో ప్రపంచ మత మహాసభలు 1893 సెప్టెంబరు 11న ప్రారంభమై సెప్టెంబరు 27న ముగిసాయి. వివేకానంద తొలిరోజున సంక్షిప్త ప్రసంగం చేశారు. మళ్ళీ సెప్టెంబరు 15న మాట్లాడారు. సెప్టెంబరు 19న వివేకానంద హిందూమతంపై వ్యాసం చదివారు. సమావేశం చివరినాడుకూడా వివేకానంద క్లుప్తంగా మాట్లాడారు. మొత్తం 10 మతాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కొలంబస్ ఆర్ట్ పాలెస్ లో జరిగిన యీ సమావేశాలలో 7 వేల మంది వరకూ హాజరయ్యారు. షికాగో సమావేశాలు వివేకానందకు పేరు తెచ్చిపెట్టాయి. భారత జమిందార్లు తాము చేసిన ఖర్చు వృధా కాలేదని సంతోషించారు.

షికాగో మత సమావేశం వలన వివేకానందకు ఇండియాలో విపరీత ప్రచారం లభించింది. వివేకానంద ఉపన్యాసాలు మత సమావేశంలో ఆకర్షణీయమైనాయి. ఆయన వాగ్దోరణి కొందరికి బాగా నచ్చింది. షికాగో ఉపన్యాసాలు మతపరంగా అమెరికావారు గ్రహిస్తే, జాతీయ హైందవవాదంగా భారతీయులు స్వీకరించారు. షికాగోలో చేరినవారంతా మతపరమైన విశ్వాసులే. ఎవరి మతం వారికి గొప్ప. అలాగే చాటుకున్నారు. వివేకానంద హిందూ మత ఔన్నత్యాన్ని చాటడమే గాక, పాశ్చాత్యం భౌతికవాదమయమనీ, భారతదేశం ఆధ్యాత్మికమనీ, కనుక ప్రపంచానికి హైందవాన్ని ఎగుమతి చేయాలనే ధోరణి కనబరచాడు. ఇదే భారతీయులలో మతవాదుల్ని ఆకట్టుకున్నది.

ముస్లింలు ఇస్లాంను, క్రైస్తవులు బైబిల్ ఆధారంగా క్రైస్తవాన్ని ప్రపంచ మతాలుగా చాటి, తమకు తిరుగులేదని ఎవరికి వారు చెప్పుకుంటూ, ఇతరుల పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తుండగా వివేకానంద అడ్డుతగిలాడు. ఉగ్ర హైందవవాదిగా మాట్లాడాడు. ఇది వీరి హిందువులకు నచ్చింది. వివేకానంద షికాగో విజయం పట్ల అసూయపడిన కొన్ని మతవర్గాలు ఆయనపై విషప్రచారాలు చేయకపోలేదు. అవి తట్టుకొని, ఎదురీది, అమెరికాలో పర్యటించి డబ్బు వసూలు