పుట:Abaddhala veta revised.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. విద్యార్థిగా సహజ ధోరణిలో ప్రశ్నిస్తుండేవారు. తొలుత రామకృష్ణను చూచినప్పుడు నరేన్ ఆకర్షితుడు కాలేదు. కాని రామకృష్ణ మాత్రం నరేన్ పట్ల విపరీత యిష్టత పెంచుకొని, ఎలాగైనా అతడ్ని తన శిష్యునిగా చేసుకోవాలని పదే పదే కబురు చేస్తుండేవాడు. ఈ విషయం పాఠకులు గ్రహించాలి.

నరేన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో పెళ్ళి సంబంధాలు చూచారు. పెళ్ళి కుదరడానికి ఏవో చిన్న పేచీలు అడ్డం రాగా, ఆలశ్యం జరిగింది. పెళ్ళి ప్రయత్నం తెలిసిన రామకృష్ణ, నరేన్ కు నచ్చజెప్పి, పెళ్ళి ప్రయత్నం విరమింపజేయడానికి చాలా కృషి చేశారు. కాని ఫలితం రాలేదు. నరేన్ పెళ్ళికి విముఖత చూపలేదు. ఆ దశలో నరేన్ తండ్రి చనిపోయాడు. ఇంటి యజమాని హఠాత్తుగా లేకుండా పోవడం, నరేన్ పెద్ద కుమారుడుగా బరువు బాధ్యతలు మోయాల్సి వచ్చింది. ఏదైనా ఉద్యోగం చేద్దామని విఫల ప్రయత్నం చేసిన నరేన్, తప్పనిసరిగా దక్షిణేశ్వర్ వెళ్ళాడు. అది పెద్ద మలుపు. ఆకలితో, అప్పులతో, సంసార భారంతో ఏం చేయాలో దిక్కుతోచక, ఉద్యోగం రాక, అలమటిస్తూ రామకృష్ణ దగ్గరకు వెళ్ళిన నరేన్ స్థితి ఊహించుకోవచ్చు. ఆశ్రమంలో చేరితే సంసార బాధ్యతలు ఉండవు. అడిగేవారు లేరు. ఆకలి బాధ వుండదు. నరేన్ వెళ్ళిన స్థితి అలాంటిది రామకృష్ణకు ఎలాగూ నరేన్ కావాలి. అలాంటి శిష్యుని కోసం రామకృష్ణ కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాంగదా. యెవరి అవసరం వారిది. పరస్పర అనుకూల స్థితి ఏర్పడింది. సన్యాసి కావడానికి నరేన్ సిద్ధపడ్డాడు. సన్యాసిగా చేసుకోవడమే గాక ప్రియశిష్యుడిగా స్వీకరించడానికి రామకృష్ణ ఆసక్తి కనబరచాడు. సన్యాసిగా మారిన నరేన్, ఇల్లు వదలి ఆశ్రమానికి మారాడు. సన్యాసి తన ఇంటిని, ఆస్తిపాస్తుల్ని, పూర్వాశ్రమాన్ని పూర్తిగా వదలేయాలి. పేరు మార్చుకోవాలి నరేన్ పేరు వివేకానంద అని మారలేదు. "వివిశానంద" అని మారింది. ఆ తరువాత "సచితానంద" అని 1892 వరకూ వుండేది. ఇది కూడా పాఠకులు గుర్తుపెట్టుకోవాలి. సన్యాసి మనస్తత్వం గురించి చాలా విపులంగా, నిశితంగా, అన్ని కోణాల నుంచి యం.యన్.రాయ్ వివరించి, 1936లోనే ప్రచురించారు. పాఠకులు అది చదవాలి. నరేన్ సన్యాసి అయి, వివేకానందగా మారిన తరువాత, తిండికీ, బట్టకూ, నివాసానికి గతుల్ని ఒక్కసారి ఆయన మరచిపొలేకపోయాడు, అందుకు తోడు, అతని తల్లి అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి కష్టనిష్ఠూరాలు చెప్పుకునేది. వివేకానంద కూడా తరచు ఇంటికివెళ్ళి కుటుంబ కలహాలు పట్టించుకుంటుండేవాడు.

నరేన్ సన్యాసి అయిన తరువాత, 5 సంవత్సరాలకే, 1886లో రామకృష్ణ పరమహంస కేన్సర్ తో చనిపోయారు. రామకృష్ణకు ప్రియశిష్యుడిగా నరేన్ బాగా సన్నిహితుదయ్యాడు.

రామకృష్ణ పరమహంస అద్వైత వేదాంతాన్ని చెప్పేవాడని కాసేపు గుర్తుంచుకోవాలి. ఆయన శిష్యుడుగా చేరిన నరేన్ వేదాంతాన్ని, మాయావాదాన్ని తృణీకరించలేదు, పైగా ప్రచారం చేయడానికి పూనుకున్నాడు. రామకృష్ణ చివరి దశలో మాత్రమే నరేన్ సన్నిహితంగా మెలగగలిగాడు. అయినపుడు యోగాభ్యాసం యెవరి వద్ద నేర్చుకున్నాడని పరిశీలిస్తే "పౌజార్జీ" వద్ద అనేది