పుట:Abaddhala veta revised.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందరు సలహా యిచ్చారు. తాను అమెరికా వెళ్ళేది వివేకానంద ప్రచారం కోసం కాదనీ, ఎవరైనా అదిగితే నిక్కచ్చిగా తన అభిప్రాయం చెబుతాననీ, వివేకానంద విషయంలో హ్యూమనిస్టులకు స్పష్టమైన అవగాహన వున్నదనీ అన్నారు. ఆ వార్త ఆంధ్రప్రభలో ప్రచురించారు. నీలంరాజు వెంకటశేషయ్య ఆనాడు ఆంధ్రప్రభకు ఏడిటర్ గా వుంటూ, గోపాలకృష్ణ మూర్తిపై అనేక లేఖల విమర్శలు చేయించారు. ఆయన్ను అమెరికా నుండి వెనక్కు పిలిపించాలన్నారు. ముదిగొండ శివప్రసాద్ వంటి తిరోగమన ఛాందసులు అదే అవకాశంగా తీసుకొని తిట్టారు.

ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో నిరంజనధర్ హ్యూమనిస్టుగా పరిశోధన చేసి, వివేకానందపై విపులంగా రాస్తే, పెద్ద స్పందన వచ్చింది. కాని ఆయన రాసిందాన్లో ఫలానా దోషం వుందని యెవరూ చూపలేకపోయారు.

అగేహానందభారతి చేసిన విమర్శల దృష్ట్యా ఆయన పుస్తకాన్ని (ఆకర్ రోబ్) రామకృష్ణ మిషన్ వారు భారతదేశంలో నిషేధించేటట్లు భారత ప్రభుత్వంపై వత్తిడి తీసుకరాగలిగారు. అది వారి మత సహనానికి గీటురాయి! ముస్లింలు సాల్మన్ రష్దీ గ్రంథాన్ని నిషేధించినట్లే యిదీ జరిగింది. క్రైస్తవులు యెన్నో గ్రంథాలు నిషేధించారు. మతానన్నిటికీ అంతటి సహనంవుంది మరి!

ఉదయం దినపత్రికలో ఎ.బి.కె. ప్రసాద్ ఎడిటర్ గా నా వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఒక ఎడిటోరియల్ నోట్ రాస్తూ "మహాత్ములను కేవలం భజిస్తూ వుండడం మన ధ్యేయం కారాదు, మానవుడే ఒక తప్పొప్పుల పట్టిక, ఇందుకెవరూ మినహాయింపు కాకపోవచ్చు. నిజానిజాల గురించిన అన్వేషణా దృష్టి ఆరోగ్యమనే భావన ఒక్కటే ఇక్కడ ప్రధానమని గమనించ ప్రార్థన" అన్నారు. 1985లో యీ వ్యాసం జనవరి 27 ప్రచురితమైంది. మరునాడే లాఠీలు పట్టుకొని వీరహిందూ యువకులు ఉదయం ఆఫీసుకు వచ్చారు. సమాధానం రాయండి, వేస్తాం అని సంపాదకులు అన్నా, వారు పట్టించుకోలేదు. అలాంటి వ్యాసం ప్రచురించరాదన్నారు. ఆ మరునాడు వివేకానందను ఆకాశానికెత్తుతూ ఎడిటోరియల్ రాయాల్సిన దుస్థితి కల్పించి జర్మనీలో హిట్లర్ రాజ్య లక్షణాలను గుర్తుకు తెచ్చారు. అదీ వివేకానంద భక్తుల విచక్షణా జ్ఞానం.

వివేకానంద గురించి అబద్ధాలు రాయడం లేదు. దుష్టప్రచారం చేయడం లేదు. ఉన్నది ఉన్నట్లు తెలియపరుస్తూ, హేతువాద దృష్టిలో మా పరిశీలనాభిప్రాయాల్ని, భవిష్యత్తు దృష్ట్యా చెబుతున్నాం.

వివేకానందగా మారిన నరేంద్ర

కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తా బ్రహ్మ సమాజంలో వుండేవాడు. చదువుకునే రోజులలో ఆయనపై కొంతమేరకు క్రైస్తవ మిషనరీల ప్రభావం పడింది. రామకృష్ణ అప్పటికే దక్షిణేశ్వర్ లో పరమహంసగా ప్రచారం పొందినా, నరేన్ ను ఆకర్షించలేదు. 1863లో పుట్టిన నరేన్ ఒక