పుట:Abaddhala veta revised.pdf/261

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

క్రైస్తవులు అరిస్టోటిల్ దగ్గరే ఆగి, భూమి చుట్టు సూర్యుడు తిరుగుతాడని, బల్లపరుపుగా భూమి వుంటుందని, భూమి కదలదనీ నమ్మారు. అది తప్పనే సరికి తలక్రిందులై, అన్నవారిని చంపడం మొదలెట్టారు. అదీ వారి మతసహనం. క్రైస్తవుల క్రూరత్వానికి బలి అయిన గెలీలియో 1642లో నిర్బంధవాసంలో గ్రుడ్డివానిగా అస్తమించాడు. ఆ తరువాత ఎప్పుడో క్రైస్తవులు తప్పు చేశామని చెంపలేసుకుంటే ఏం ప్రయోజనం!

- నాస్తికయుగం, జూలై 2000
హిందూ నెపోలియన్ గా వివేకానంద

వివేకానందను తమ గురువుగా స్వికరిస్తున్నట్లు యిటీవల ఆర్.ఎస్.ఎన్. నాయకులు ప్రకటించారు. అది సరైన నిర్ణయం. వివేకానంద స్థానాన్ని సక్రమంగా గుర్తించారనడానికి యిదొక నిదర్శనం.

హేతువాదులు, మానవవాదులు యిదే విషయాన్ని అనేక సంవత్సరాలుగా చాటి చెబుతున్నారు. అయినా జనం అంతగా పట్టించుకొలేదు. వివేకానంద ఆర్.యస్.యస్. తత్వానికి, ధోరణికి ఆద్యుడు. కనుక వారాయన్ను గురువుగా భావించడం సముచితం. అయితే కమ్యూనిస్టులు సైతం యిటీవల వివేకానంద సూక్తులు పుస్తకాలుగా ప్రచురించారు. ఆయన ఫోటోలు పెట్టి సభలు జరిపారు. వివేకానంద ఆ విధంగా అటు ఆర్.యస్.యస్. వారికీ, యిటు కమ్యూనిస్టులకు గౌరవ ప్రదముడుగావడం, ఆయన వ్యక్తిత్వ విశేషమా? పరిశీలించాలి. హేతువాదులు, మానవవాదులు కోరుతున్న దేమంటే, వివేకానందను చదివి, అర్థం చేసుకొని, తరువాత అంచనా వేయమని! అలా జరగడం లేదు. ఏవో కొన్ని సూక్తులు, యెక్కడో ఒక ఉపన్యాస భాగాన్ని ఉదహరించి, పొగిడేస్తున్నారు. వీరారాధన చేస్తున్నారు. ఆవేశపూరిత వాతావరణం సృష్టిస్తున్నారు. వివేకానందను నిశితంగా పరిశీలించడం, విమర్శించడం మహా తప్పిదంగా, భారత వ్యతిరేకతగా చూస్తున్నారు. అది ఫాసిస్టు లక్షణం.

మానవవాదులపై ఇదేమీ కొత్తగా వచ్చిన అపనింద కాదు. 1920లో యం.యన్.రాయ్ వివేకానందను విమర్శించారు. ఆ తరువాత హ్యూమనిస్టులు వివేకానందపై పరిశోధన, పరిశీలన చేసి, విమర్శించారు. అగేహానంద భారతి ప్రత్యక్షంగా రామకృష్ణ మఠంలో చేరి, లోన ఏం జరుగుతుందో గుట్టు రట్టు చేశాడు.

ఆంధ్రలో హ్యూమనిస్టు ఉద్యమ నాయకుడు ఆవుల గోపాలకృష్ణమూర్తిని అమెరికా ప్రభుత్వం 1964లో ఆహ్వానించినప్పుడు తెనాలిలో వీడ్కోలి సభ జరిగింది. గుంటూరు రాజేశ్వరరావు అనే ఆయన వ్యంగ్యంగా ఆవుల గోపాలకృష్ణమూర్తిపై విమర్శల వర్షం కురిపించారు. వివేకానంద ప్రస్తావన తెచ్చి, ఆయన గొప్పతనం చాటమనీ, ఆయన అడుగుజాడల్లో నడవమని