పుట:Abaddhala veta revised.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గట్టిగా వేశారు. ఫ్రెంచి అకాడమీ ప్రత్యేక విచారణలు జరిపి ఫ్రాంజ్ మెస్మర్(1734-1815) యానిమల్ మాగ్నటిజపు బూటకాలను బట్టబయలు చేసింది. 19వ శతాబ్దం చివరలో 20వ శతాబ్దం ప్రారంభంలో అనేక అతీంద్రియ శక్తుల గురించి పరిశోధనలు జరిగాయి. ఏదీ శాస్త్రీయ పరిశీలనలో రుజువు కాలేదు. జె.బి.రైన్ వచ్చి అతీంద్రియ శక్తులకు శాస్త్ర గౌరవం కోసం అనేక పరీక్షలు జరిపాడు. సైకాలజిస్టు బి.ఎఫ్.స్కిన్నర్ యీ రంగంలో రైన్ వృధా ప్రయాసను తీవ్రంగా ఎదుర్కొన్నాడు. సైకొ కెనిసిస్ పై శాస్త్రీయ విమర్శలను ఎడ్వర్డ్ గిర్డెన్ (Edward Girden) ప్రచురించాడు.

1976లో అమెరికాలో అతీంద్రియ శక్తుల శాస్త్రీయ పరిశీలనకు ఒక నిపుణుల సంఘం ఏర్పడింది. దీనిని సికాప్(CSICOP) అని పొడిగా పిలుస్తారు. పాల్ కర్జ్ సంఘాధ్యక్షుడుగా ఇందులో అనేకులు పనిచేశారు. సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు కార్ల్ శాగన్,తాత్వికులు సిడ్నీహుక్, ఎర్నెస్ట్ నాగెల్, మార్టిన్ గార్డ్ నర్, జేమ్స్ రాండి, డబ్లు.వి.క్విన్,ఫిలిప్ క్లాజ్,మార్సిలో ట్రూజి, రేహైమన్ ప్రభృతులు బాగా లోతుపాతులు అధ్యయనం చేశారు.

సైకో కెనిసిస్ రంగంలో ప్రపంచ ప్రసిద్దుడుగా ఆవిర్భవించిన యూరిగెల్లర్ స్పూన్(చెంచాలు) వంచడం వంటి ఇంద్రియాతీతశక్తి వెనుక కిటుకులను బయటపెట్టి యీ సంఘం శాస్త్రీయంగా ముందుకు సాగింది. సంఘం పక్షాన స్కెప్టికల్ ఇంక్వ్తెరర్ అనె పత్రిక పెట్టి,ఎప్పటికప్పుడు అతీంద్రియ శక్తుల శాస్త్రీయ పరిశీలనా ఫలితాలు వెలికి తెస్తున్నాడు. కెండ్రిక్ ఫ్రేజర్ సంపాదకత్వాన యీ పత్రిక కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఇంద్రియాతీతశక్తి సంఘటన దృష్టికి వచ్చినా యీ సంఘంవారు పరిశీలిస్తున్నారు. ఎక్కడా రుజువుకు నిలబడిన సంఘటన కనిపించలేదు. Committee for the Scientific Investigation of Claims of the Paranormal(CSICOP) సంఘాన్ని చైనాకు ఆహ్వానించి, అక్కడ జరుగుతున్న అతీంద్రియశక్తుల వుదంతాలను పరిశీలించమన్నారు. పాల్ కర్జ్ ఆధ్వర్యాన 1988లో ఆరుగురితో కూడిన సంఘం చైనాలోని కొందరు అతీంద్రియ శక్తిపరుల్ని పరిశీలించింది. సైకిక్ శక్తులున్నాయన్న పిల్లల్ని కూడా టెస్ట్ కు గురిచేశారు. మోసాలు జరగకుండా జాగ్రత్తలు చేసేసరికి,పిల్లల్లో ఎలాంటి ఇంద్రియాతీతశక్తులు లేవని తేలింది. చైనాలో బాగా ప్రచారంలో వున్న కిగాంగ్(Qigong) శక్తిలో "శక్తి" ఏదీ లేదని రుజువుపరచారు.

ప్రతి సంవత్సరం యీ సంఘం వారు సమావేశాలు జరిపి అత్యంత ఆధునాతనంగా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నదీ వివరిస్తూ అతీంద్రియశక్తుల అధ్యయనం చేస్తున్నారు. ఈ విషయాలపై టేప్ లు సిద్ధం చేసి యిస్తున్నారు. యూరిగెల్లర్ యీ సంఘంపై కోర్టులో కేసులు పెట్టి ఓడిపోయి, ప్రస్తుతం అమెరికాలో అడుగుపెట్టకుండా ఇంగ్లండ్ కు పరిమితమయ్యాడు. కోర్టులో తన చెంచాలు వంచే శక్తి నిజమని రుజువు చేసుకోలేకపోయాడు.