పుట:Abaddhala veta revised.pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రాసింది. బ్రిటిష్ పోలీసులు రాసింది తు.చ.తప్పకుండా ఆమోదించే ధోరణి, ముఖ్యంగా లెప్టినెంట్ కాయ్ వంటివారు నిష్పాక్షికంగా వుండలేనివారు రాసింది అట్టే నమ్మరాదని, రాయ్ ను గురించి పార్క్ కు రాసింది.

భారత విప్లవోద్యమంలో రాయ్ నిర్వహించిన పాత్ర, అతడి చిత్తశిద్ధికి అన్యాయం చేయవద్దని పార్క్ ను ఎవిలిన్ కోరింది. రాయ్ పట్ల కొన్ని వ్యాఖ్యలు ఆయన అభిమానుల్ని దిగ్ర్భాంతి చేసేవిగా వున్నాయని ఎవిలిన్ హెచ్చరించింది.

చంద్రకాంత చక్రవర్తి దోషాల్ని ప్రస్తావించి, రాయ్ భార్య కలోనియల్ కమిషన్ లో లేదని అతడు రాయడం, జైలులో మా పెళ్ళి జరగలేదనడం, స్టాన్ ఫర్డ్ లో మేం కలుసుకోలేదని, న్యూయార్క్ కలిసి వెళ్ళలేదని అనడం కేవలం అతడి వూహలు,భ్రమలు మాత్రమేనని ఎవిలిన్ తన వ్యాఖ్యలలో పార్క్ కు రాసింది. 1956 జూన్ 8న అబర్న్ నుండి రిచర్డ్ పార్క్ కు ఎవిలిన్ యీ విషయాలు రాసింది.

భారత కమ్యూనిజాన్ని గురించి పెద్ద గ్రంథం రాసిన విండ్ మిల్లర్ ఉపన్యాసం స్వయంగా ఒక చోట విన్న ఎవిలిన్ అతడిని పరిచయం చేసుకోవడం మంచిదని రాబర్ట్ నార్త్ కు రాసింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో కమ్యూనిస్టు పార్టీపై పరిశోధన చేసిన పి.సి.జోషి కూడా 1969లో ఎవిలిన్ ను కలుసుకోవడానికి ఉత్తరాల ద్వారా ప్రయత్నించాడు. ఆమె జవాబు రాసినట్లు లేదు.

1966లో నార్త్ కు రాసిన లేఖ ప్రకారం ఎవిలిన్ యింట్లో 1963లో అగ్నిప్రమాదం సంభవించి, రికార్డులు తగులబడిపోయాయి. అందులో ముఖ్యమైన కాగితాలు వుండి వుండవచ్చు. 1970 నవంబరు 21న ఎవిలిన్ ఆబర్న్ లో చనిపోయింది. స్థానిక పత్రికలు అప్పుడు కూడా రాయ్ ప్రస్తావన తీసుకరాలేదు.

ఆమె మరణానంతరం, ఎవిలిన్ అక్క కుమారుడు డివెన్ మెరిడిత్ మిగిలిన కొన్ని కాగితాలు,ఉత్తరాలను, ఫోటోలను కాలిఫోర్నియా స్టేట్ లోని స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వున్న హూవర్ వార్, పీస్ రివల్యూషన్ అనే సంస్థకు యిచ్చాడు. ఆ కాగితాలలో నార్త్, పార్క్ శిబ్ రే, ఎలెన్ ఉత్తరాలు తప్ప, పాత రికార్డు ఏదీ లేదు.

రాయ్ ఫోటోలు కొన్ని వున్నాయి. ఒక ఫోటో క్రింద 'నన్ను ఆరాధించే నా యిష్టదేవతకు' అని ఎం.ఎన్.రాయ్ రాసినట్లున్నది.

'- హేతువాది,ఫిబ్రవరి,మార్చి,ఏప్రిల్ 1995