పుట:Abaddhala veta revised.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవిలిన్ పై మళ్ళింది. ఎవిలిన్ చివరిలో తన రెండవ భర్త పేరు రాస్తుండేది. ఆమెకు రెండవ భర్తతో కూడా సంతానం లేదు. ఆమె అక్క మెరిడిత్ కుమారుడు డివెన్, అతడి యిరువులు సోదరీమణులు ఎవిలిన్ కు సన్నిహితంగా వుండేవారు.

ఎం.ఎన్.రాయ్ చనిపోకముందు చివరిదశలో ఆయన తన జీవితగాధాస్మృతులను చెబుతుంటే ఎలెన్ వ్రాసుకున్నది. అవి రాడికల్ హ్యూమనిస్టు వారపత్రికలో వరుసగా వచ్చేవి. అందులో ఎవిలిన్ ట్రెంట్ గురించి రాయ్ ఎక్కడా ప్రసావించలేదు. ఎవిలిన్ ఆ ప్రచురణ పట్ల ఆసక్తి కనబరచింది.

ఆబర్న్ లో సొంత ఆస్తిపాస్తులు చూచుకుంటూ, స్థానికంగా చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎవిలిన్ కాలం గడిపింది. ఎం.ఎన్.రాయ్ చైనా పాత్ర గురించి సమగ్రంగా పరిశోధించిన రాబర్ట్ సి.నార్త్ తొలుత ఎవిలిన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపి,ఆమె ఇంటికి వెళ్ళి మాట్లాడాడు. తన పుస్తకం ఆమెకు పంపించి, పరిశీలించమన్నాడు అచ్చుకాక ముందే, ఇంచుమించు అదే సమయంలో రిచర్డ్ సి.పార్క్ రచనల్లో ఎం.ఎన్.రాయ్ పట్ల దొర్లిన దోషాలను ఆమె ఎత్తిచూపింది. నార్త్ రచనల్లో తన పేరు తొలిగించమని ఎవిలిన్ కోరింది. ఇతరులు తనను గురించి అడిగినప్పుడు, విచక్షణ ఉపయోగించమని కోరింది. ఇండియా నుండి ముజఫర్ అహమ్మద్ ఉత్తరం రాయగా, నార్త్ ఆ లేఖను ఎవిలిన్ కు పంపాడు.

ఎలెన్ కూడా ఎవిలిన్ కు ఉత్తరాలు రాసి,శిబ్ నారాయణ్ రే వస్తున్నట్లు, కలుసుకొని మాట్లాడతాడని తెలిపింది. శిబ్ నారాయణ్ రే కూడా ఎవిలిన్ ను స్మృతులు రాయమని కోరాడు. నాథనైల్ వైల్ కూడా మెక్సికో కమ్యూనిస్టు పార్టీలో వీరి పాత్ర గురించి అడిగాడు.

ఎం.ఎన్.రాయ్ కమ్యూనిస్టు ఉద్యమంలో, ఇండియాలో నిర్వహించిన పాత్రను అభినందించాలని ఎవిలిన్ తన వ్యాఖ్యానాలలో రిచర్డ్ పార్క్ కు రాసింది. పార్క్ దోషాలను ఎత్తి చూపింది. అలాగే యితరులు కమ్యూనిస్టు ఉద్యమంలో రాయ్ పాత్రను,లెనిన్ సిద్ధాంతానికి అనుబంధంగా వలస విధానంపై రాయ్ సమర్పించిన సిద్ధాంతం పట్ల అవగాహన లోపాలను దోషాలను చూపింది. ఛటోపాధ్యాయతో రాయ్ సంబంధాల విషయమై అవగాహన లోపాలను దోషాలను చూపింది. భారత విప్లవోద్యమానికి రాయ్ సమకూర్చిన మేధాసంపన్నతను అర్థం చేసుకోవాలన్నది. తాత్విక పునాదులు తొలుత కల్పించింది రాయ్ మాత్రమే. అందుకు తగిన సాహిత్యాన్ని సమకూర్చిందీ రాయ్ ఒక్కడే.

ఆ విషయం భారతదేశంలో గుర్తింపు పొందినట్లు ఎవిలిన్ చెప్పింది. ఇలాంటి ఘనతకు నిందించడంగాక, రాయ్ ను అభినందించాలని ఎవిలిన్ కోరింది. రాయ్ తన పరిణామ దశలో ఎన్నో మార్పులకు లోనయ్యాడని, అయితే అతనికి నేర్చుకునే శక్తి సామర్థ్యాలున్నాయని ఎవిలిన్