పుట:Abaddhala veta revised.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రి మరణానంతరం ఎవిలిన్ తిరిగి తన రచనలు ప్రారంభించింది. శాన్ ఫ్రాన్ సిస్కో క్రానికల్ లో 1935 నవంబరు 3న కార్మికుల ఇళ్ళ సమస్యలు రాసింది.

ఎం.ఎన్ రాయ్ ఇండియాలో జైలు నుండి విడుదల సంవత్సరంలోనే అమెరికాలో ఎవిలిన్ రెండవ వివాహం చేసుకున్నది. 1936 అక్టోబరు 10న డెవిట్ జోన్స్, ఎవిలిన్ ల పెళ్ళి జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో రిచ్ మండ్ కు చెందిన డెవిట్ పెళ్ళి తరువాత ఓక్లాండ్ కు మారాడు. ఎవిలిన్ స్థానిక పత్రికలకు వ్యాసాలు రాస్తూ వివాహజీవితం ఆనందంగా గడిపింది. డెవిట్ జోన్స్ కూడా వ్యాపారాలు చేస్తూ పత్రికారచనలు సాగించాడు.

1938,39లో స్టేట్ ఎమర్జన్సీ రిలీఫ్ అడ్మినిస్ట్రేషన్ వారి బులిటెన్ కు ఎవిలిన్ రచనలు చేసింది. ఆ సంస్థ చరిత్రను డెవిట్ అజమాయిషీ చేసి రాయించాడు. కొన్నాళ్ళు శాక్రమెంటోలో దంపతులు నివశించగా, ఎవిలిన్ స్థానిక పత్రికలో రాసింది. ఆ ప్రాంతం ఆమెకు చిరపరిచితం కూడా.

ఆ విధంగా 15 సంవత్సరాలు ఎవిలిన్-డెవిట్ దంపతులు జీవించిన అనంతరం 1949 ఫిబ్రవరి 20న డెవిట్ చనిపోయాడు. మళ్ళీ ఎవిలిన్ ఆబర్న్ కు వచ్చి, అక్కడ స్థిరపడింది. 1949 ఏప్రిల్ 29న ఐన్ స్టీన్ ఆమెకు ఒక ధన్యవాదాల జాబు రాశాడు.

జైలునుండి విడుదల అయిన రాయ్ 1938లో, అంటే ఎవిలిన్ పెళ్ళి చేసుకొన్న రెండేళ్ళకు ఇండియాలో ఎలెన్ ను పెళ్ళిచేసుకున్నాడు. ఇండియాలో రాయ్ అరెస్టు అయినప్పుడు పట్టించుకోని అమెరికా పత్రికలు, విడుదల అయిన తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి తోడ్పడాలని రాయ్ ప్రకటించినప్పుడు అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. హిట్లరిజాన్ని ఎదుర్కోడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి తోడ్పడాలని రాయ్ చెప్పినట్లు ప్రకటించాయి.(1939 సెప్టెంబరు 9)

రాయ్ రాడికల్ డెమొక్రటిక్ పార్టీ స్థాపించినప్పుడు మళ్ళీ న్యూయార్క్ టైమ్స్ ఆ వార్తను ప్రచురించింది.

అదేమిటో గాని న్యూయార్క్ టైమ్స్ లో మొదటి నుండీ రాయ్ చనిపోయేవరకూ ముకేంద్రనాధ్ అనీ, మహేంద్రనాధ్ అనీ రాశారు. అమెరికాలో గూఢచారి సంస్థలు తొలుత అలాగే రాసినా,ఉత్తరోత్తరా దిద్దుకున్నారు. ఎం.ఎన్.రాయ్ చనిపోయిన వార్తను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.

ఎవిలిన్ ట్రెంట్ చినరి దశ

ఎం.ఎన్.రాయ్ చనిపోయిన అనంతరం భారతదేశంలో, అమెరికాలో కొందరి దృష్టి