పుట:Abaddhala veta revised.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మానవేంద్రనాధ్ రాయ్ ప్రాచ్యబ్యూరో డైరెక్టర్ గా, అంతర్జాతీయ కమ్యూనిస్టు అధినేతగా భారత కమ్యూనిస్టుల్ని నడిపిస్తున్నాడని బెనర్జి పేర్కొన్నాడు.

రాయ్ శిష్యుడుగా కె.సి.బెనర్జి విచారణ సాగించి కల్పించిన కట్టుకథ, రాయ్ ను గురించి ఏం చెప్పిందీ చూద్దాం.

రాయ్ అసలు పేరు భట్టాచార్య. అతడు పుట్టింది 1885లో బర్మాలో. 10 ఏళ్ళ వయస్సులో అతడిని కెనడా మీదుగా కలకత్తా తీసుకువచ్చారు. 1920లో మెక్సికో నుండి రాయ్ ఇండియా వచ్చాడు. 1922లో భారత సమాఖ్య ఏర్పాటుపై నివేదిక సమర్పించాడు. గయ కాంగ్రెసు సమావేశంలో అది ప్రస్తావనకు వచ్చింది.

ఈజిప్టులో జనరల్ సర్ లీస్టాకిను హత్యచేయమని రాయ్ ఆదేశించాడట. అతడు వలస రాజ్యాలలో సైనికాధిపతి అట.

రాయ్ లేఖ తనకు లభించినదనీ, 15 వందల మాటలు గల యీ లేఖ వలన పై విషయాలు తెలిసినట్లు కె.సి. బెనర్జి చెప్పాడు. రాయ్ డైరీ కూడా దొరికినట్లు వెల్లడించాడు. అన్ని అబద్ధాలు ఒక గూఢాచారి ద్వారా పత్రికలకు చెప్పే పథకం వేశారు.

ఇలాంటి కథను పై అధికారులకు చెప్పకుండానే కె.సి.బెనర్జీ బయటపెట్టాడని కూడా రాశారు. భారతదేశంలో వెల్లడించిన యీ విషయాలకు అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక (1928 సెప్టెంబరు 16న (పేజి 7 కాలమ్ 7 సెక్షన్ మూడు) ప్రచురించడం ఆశ్చర్యకరం. రాయ్ కు వ్యతిరేకంగానూ, కమ్యూనిజానికి విరుద్ధంగానూ వున్న కథలకు అమెరికా అలాంటి ప్రాధాన్యత యిచ్చింది.

రాయ్ అరెస్ట్-అమెరికా రియాక్షన్

1931 జులైలో ఎం.ఎన్.రాయ్ ను,ఆయనకు ఆసరా యిచ్చినందుకుగాను మరో యిరువురు విప్లవకారులను బొంబాయిలో అరెస్టు చేసినట్లు బెర్లిన్ నుండి ఇంప్రెకార్ కేబుల్ పంపింది. ఈ వార్తను అమెరికా కమ్యూనిస్టు వారపత్రిక రివల్యూషన్ ఏజ్ మొదటి పేజీలో ప్రచురించింది. దీనితో పాటు రాయ్ ఇండియాలో ఉగ్రజాతీయవాదిగా జీవితం ప్రారంభించి, కమ్యూనిస్టుగా చేబట్టిన విషయాలు కూడా పాఠకులకు అందించారు.

అమెరికాలో అత్యధిక సంఖ్యాక కమ్యూనిస్టు పక్షం న్యూయార్క్ నుండి నడిపిన రివల్యూషనరీ ఏజ్ పత్రిక రాయ్ అరెస్టు మొదలు శిక్షపడే వరకూ చాలా వార్తలు ప్రకటించింది. రాయ్ విడుదలకు తీవ్ర ఆందోళన సాగించింది. రాయ్ డిటెన్షన్ నుండి పంపిన వ్యాసం కూడా ప్రచురించింది.

జె లవ్ స్టోన్ సంపాదకుడిగా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికగా వెలువడుతుండేది