పుట:Abaddhala veta revised.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘటన వలన పత్రికల సర్కులేషన్ పెరుగుతుంది. పత్రికలలో అతీంద్రియ శక్తుల వార్తలు వేసినంతగా వాటి వ్యతిరేక వార్తలు,ప్రధానంగా చోటుచేసుకోవు. సంపాదకులు, రిపోర్టర్లు, అతీంద్రియ శక్తుల్ని నమ్మడం,లేదా ఆసక్తి కనబరచడం వలన ప్రసారాలు, ప్రచారంలో అవి ప్రాధాన్యత పొందుతాయి. అలాగే ప్రసార సాధనాల యాజమాన్యం కూడా ఆసక్తి కనబరచి తమ వ్యాపార లాభాలకై ఏ స్థాయికైనా వెడుతున్నారు. ఈ దోరణివలన వాస్తవాలు దెబ్బతింటున్నాయి. వార్త నిజం కాదని తెలిసినా అతీంద్రియశక్తుల వార్తకు తాము బాధ్యులం కాదని ప్రచురించరు.

అతీంద్రియ శక్తుల వార్తలు ప్రచురించడంలో, ప్రసారం చేయడంలో కొన్ని నియమాలు పాటించడం అవసరం. అతీంద్రియ శక్తులున్నాయని బాబా,మాత, లేదా మారుమూల వ్యక్తులు చెబుతున్నప్పుడు, మూలాధారాల కోసం రిపోర్టర్లు అన్వేషించాలి. చెప్పుడు మాటల్నిగాక,ఆధారాలే ప్రమాణంగా స్వీకరించాలి. ఇంద్రియాతీత శక్తుల పరిమితులు-శాస్త్రీయ పంథాలు పోల్చి చూచుకోవాలి. లోగడ అలాంటి అతీంద్రియ శక్తుల విషయమై జరిగిన పరిశోధనల్ని దృష్టిలో పెట్టుకొని వార్తలు ప్రచురించాలి.అతీంద్రియ శక్తుల వెనుక వున్న సాధారణ పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. విమర్శల్ని పక్కనబెట్టరాదు. అతీంద్రియ శక్తులున్నాయన్నప్పుడు బహిరంగ ప్రదర్శనకై వత్తిడి చేయాలి. ఆ సంఘటనను పరిశీలనకు పెట్టాలి. సంఘటనలో కప్పిపుచ్చి, మోసపూరితంగా వ్యవహరించే ధోరణిని అరికట్టాలి. సంఘటనపై చిలవలు పలవలుగా ప్రచురించే కరపత్రాలు, అభిప్రాయాలు ప్రమాణంగా తీసుకోరాదు. ఇలాంటి నియమాలు ప్రసార సాధనాలు,పత్రికలు పాటించగనిగితే,మూఢ నమ్మకాలు జనాన్ని మోసంచేయజాలవు. ఒకానొక అతీంద్రియ సంఘటనకు మీడియా యిస్తున్న విపరీత ప్రాధాన్యత వలన ప్రజలలో ఆసక్తి పెరగడమేగాక, మూఢ నమ్మకాలు ధృవపడుతున్నాయి. దీనికి తగ్గట్టుగా అతీంద్రియ శక్తిని బట్ట బయలుచేస్తూ వచ్చిన నివేదికను,వార్తను చాలా అప్రధానంగా ప్రచురించడం వలన ఎంతో హాని జరుగుతున్నది. ఇలాంటి ధోరణిపత్రికా రంగంలో సర్వసాధారణంగా కనిపిస్తున్నది. బొత్తిగా బాధ్యత లేని అశాస్త్రీయ ధోరణి అటు రిపోర్టర్లలోనూ, యిటు సంపాదకులలోనూ సర్వత్రా కనిపిస్తున్నది. ప్రజలకు శాస్త్రీయంగా నిజాలుచెప్పాలనే ధోరణి రానంత వరకూ అతీంద్రియ శక్తుల పట్ల నమ్మకం సడలదు.

అతీంద్రియ శక్తుల పట్ల సందేహాలు

ప్రాచీనకాలం నుండీ చెదురు మదురుగా ఇంద్రియాతీతశక్తుల పట్ల సందేహాలు, ఖండన మండనలు వ్యక్తమౌతూనేవున్నాయి. గ్రీస్-రోమన్ ప్రాంతాలలో సందేహ వాదిపితామహుడుగా ఇలిస్ కు చెందిన పైరొ(Pyrrho)ను చెప్పవచ్చు-360-270 క్రీ.పూ. ఆ తరువాత అకడమిక్ సందేహవాదం ప్లేటో అకాడమీ నుండి పుట్టింది. ఆర్సిలాస్(Arcesilaws) ,కార్నిడాస్(Cameades) యీ రంగంలో పేర్కొనదగినవారు. ఆధునికయుగాలలో పైర్ బేల్(1647-1706),రేనడెకార్ట్(1596-1650),డేవిడ్ హ్యూం(1711-1776) సందేహవాదానికి పునాదులు