పుట:Abaddhala veta revised.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పారిస్ లో ప్రొ ఇండియా కమిటి పేరిట రాయ్ దంపతులు సాగించిన కార్యకలాపాలకు రాయ్ దేశ బహిష్కరణకు గురైనాడు. ఎవిలిన్ ఆ పని సాగించింది. ప్రవాస భారతీయ కమ్యూనిస్టుల స్థితిగతుల గురించి రాసింది. హెన్రిబార్బుసా తోడ్పాటు కూడా యిందులో వున్నది. 1925 జులై 11,12 తేదీలలో ఆంస్టర్డాంలో కలోనియల్ సభలలో ఎవిలిన్ ప్రముఖ పాత్ర వహించింది. యూరప్ లో ఆమె చివరి కార్యకలాపాలు అవే. పారిస్ లో జోషిని కలిసిన ఎవిలిన్, తాను చమన్ లాల్ ను కలుసుకోగోరుతున్నానని చెప్పింది. అతడు షక్లావత్, స్నేహితుడు. ఎవిలిన్ కు వ్యతిరేకంగా షక్లావత్ వున్నందున చమన్ లాల్ కూడా ఎవిలిన్ ను కలవదలచలేదు. ఈ విషయం లోతుగా పరిశీలించాలని ఎవిలిన్ తలపెట్టింది.

భారతదేశ కమ్యూనిస్టులకు సాహిత్యాన్ని ఓడలలో నావికుల ద్వారా పంపే ఏర్పాట్లు చేయాలని ఎవిలిన్ వ్యూహం చెప్పింది. బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక వ్యూహంలో బలంగా ఒక సంఘాన్ని ఏర్పరచాలని కూడా ఆమె సూచించింది. అందులో భారత సానుభూతిపరులను ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఇతర చోట్ల నుండి చేర్చుకోవాలని చెప్పింది. ఇంగ్లండ్ లోని భారతీయులకు సాహిత్యాన్ని చేరవేసేటందుకు వెళ్ళమని ఆర్.డబ్ల్యు రాబ్బన్ ను కోరింది.

ఎవిలిన్ రాయ్ ఎడబాటు

ఎవిలిన్ 1925 జులై 30న పారిస్ నుండి అమెరికా బయలుదేరింది. అంటే ఆంస్టర్ డాం కలోనియల్ సభల అనంతరం, ప్రొఇండియా కమిటి నిషేధానికి గురి అయిన తరువాత స్వదేశానికి వెళ్ళిందన్నమాట. తన తల్లిని చూడాలనే కోరిక వెలిబుచ్చినట్లు చెబుతారు.

అమెరికాలో ఎవిలిన్ ప్రవేశించినట్లు తెలుసుకున్న పోలీసులు ఆమెను పట్టుకొని, వెనక్కు పంపాలని అనుకున్నారు. ఆమె ఎలా దేశంలో ప్రవేశించిందో ఆరాతీసారు. ఎవిలిన్ తన సోదరి మేరిడిత్ వద్ద శాక్రమెంటో (కాలిఫోర్నియా)లో వున్నట్లు కనుగొన్నారు. కాని ఆమెను దేశం నుండి పంపించివేసే ప్రయత్నాలు నిరసించారు. ఎవిలిన్ శాక్రమెంటో శాన్ హోక్విన్ లోయ ప్రాంతాల్లో పర్యటించి,ఇండియన్ల మధ్య ఆందోళన కొనసాగించింది.

స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డేవిడ్ జోర్డన్ స్టార్ తో ఎవిలిన్ ఉత్తర ప్రత్యుత్తరాలు మళ్ళీ ప్రారంభించింది. ఎవిలిన్ ప్రతిభను గుర్తించిన జోర్డన్, తన పుస్తకం "ది హయ్యర్ పూలిష్ నెస్" రివ్యూ చెయ్యమని ఆమెకు పంపాడు. అయితే అప్పటికే శాన్ ఫ్రాన్ సిస్కో క్రానికల్ ఎడిటర్ టఫ్ ట్స్ మరొకరికి ఆ పని పురమాయించినందున ఎవిలిన్ చేయలేకపోయింది. డచ్ అమెరికన్ ఆర్టిస్టు పీటర్ వాన్ వాలీస్ బర్గ్ ను జోర్డన్ కు పరిచయం చేసిన ఎవిలిన్ అతడి చిత్రపటిమను శ్లాఘించింది. ఆ తరువాత జోర్డన్ ఆరోగ్యం క్షీణించడం పట్ల ఆందోళన వెలిబుచ్చి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించింది. 1931లో జోర్డన్ చనిపోయాడు.

న్యూయార్క్ హెరాల్ట్ ట్రిబ్యున్ పత్రికలో ఎవిలిన్ వ్యాసాలు రాసింది. శాన్ ఫ్రాన్ సిస్కోలో