పుట:Abaddhala veta revised.pdf/234

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆశించారు. అలాంటివారిలో శైలేన్ ఘోష్ ఒకరు. సమయానికి జర్మనీ నిధులు అందక, రాయ్ మాట నిలబెట్టుకోలేక యిబ్బందుల పాలయ్యాడు. శైలేన్ ఘోష్ స్టాన్ ఫర్డ్ నుండి నిష్టూరంగా టెలిగ్రాంలు యిస్తుండేవాడు. కొంచెం ఓపిక పట్టమని రాయ్ కోరుతుండేవాడు.

ఆర్థిక యిబ్బందులు తట్టుకోడానికి ఎవిలిన్ రకరకాల ఉద్యోగాలు చేసింది. న్యూయార్క్ లోని అమెరికన్ సొసైటి,131ఇ, 23వ వీథిలో రాయ్ కొన్నాళ్ళు, 6728వ ఎవెన్యూలోని సిలోన్ రెస్టరెంట్ అడ్రస్ సహచరులకు యిచ్చాడు.

న్యూయార్క్ లో మూడు మాసాల పాటు లజపతి రాయ్ తో ఎం.ఎన్.రాయ్ గడపగలిగాడు. ఎవిలిన్ ఆయన వద్ద పని చేయగా కొంత ఆర్థిక సహాయం చేయగలిగాడు. భారతీయ ఉగ్ర జాతీయవాదులలో కల్లా ఎం.ఎన్.రాయ్, ఎవిలిన్ లలో ఆయన శీలం,ప్రతిభ చూచి మెచ్చుకున్నాడు. అయితే అభిప్రాయ భేదాలు వున్నాయి.

చంద్రకాంత చక్రవర్తి మొదలు అనేక మంది భారతీయ జాతీయవాదులు రాయ్, ఎవిలిన్ ల పట్ల ఈర్ష్య అసూయా ద్వేషాలు చూపారు. దుష్ప్రచారాలు చేశారు. ఈ లోగా రాయ్ ను అమెరికన్ పొలీసులు వెంటాడి పట్టుకోగా అటార్ని ఆయన్ను ప్రశ్నించాడు. సాక్ష్యాధారాలు సరిగా దొరకలేదు. అరెస్టు అయిన రాయ్ వెంటనే ఎవిలిన్ ను పెళ్ళి చేసుకొన్నాడు. జైలులో వారు పెళ్ళి చేసుకోలేదని చంద్రకాంత్ చక్రవర్తి చేసిన ప్రచారాన్ని ఎవిలిన్ ఖండించింది. (రిచర్డ్ పార్క్ అనే పరిశోధకుడికి రాసిన లేఖ) డేనియల్ జేకబ్ అనే రాజకీయ శాస్త్రజ్ఞుడు కూడా జైలులోనే పెళ్ళి జరిగిందని రాశాడు. (బరోడిన్, స్టాలిన్స్ మేన్ చూడు, 1981 ప్రచురణ-హార్వర్ట్ యూనివర్శిటీ ప్రచురణ) రాయ్-ఎవిలిన్ పెళ్ళి జరిగినట్లు ఆ తరువాత ఎవిలిన్ తన దగ్గర పనిచేసినట్లు లజపతి రాయ్ రాశాడు. ఈ లోగా 1917 జూన్ లో అమెరికాలో దేశద్రోహ నేరం కింద భారతీయ ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. రాయ్ అలా అరెస్ట్ కాదలచుకోలేదు.

స్నేహితుల ద్వారా పుట్టినతేది,సర్టిఫికెట్,పాస్ పోర్టు మరొకరిది తెప్పించుకున్నాడు. రైల్లో ఇరువురూ ప్రయాణం చేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని లారెడో మీదగా జోస్,ఎలెన్ పేరుతో అమెరికా నుండి సరిహద్దులు దాటి మెక్సికో చేరుకున్నారు. ఆ తరువాత రాయ్ పాస్ పోర్టును,సర్టిఫికెట్ ను తిప్పి స్నేహితుడికి పంపేశాడు. (భిల్స్ కు ఎలెన్ లేఖ 1920 మే3న అఫ్.బి.ఐ. 9771-బి.41.

రాయ్ మెక్సికో పారిపోయాడని తెలియక న్యూయార్క్ లో పోలీసులు గాలించారు. సాటర్ డే పోస్టు పత్రిక విలేఖరిగా ఒక గూఢచారి శ్రీమతి బ్లాక్ షార్డ్ కు ఫోనుచేసి రాయ్ ను గురించి,ఆరాతీస్తూ, రాయ్ ఒక కథ ప్రచురణ నిమిత్తం పంపాడనీ కొన్ని సందేహాలుండి ఫోను చేస్తున్నాననీ చెప్పాడు. రాయ్ తన దగ్గర వుండడం లేదని ఆమె చెప్పింది.

అరెస్టు అయిన వారితోబాటు భారతీయ ఉగ్రవాదులపై ఫిర్యాదులు విచారించి, శాన్ ఫ్రాన్సిస్కోలో శిక్షలు విధించారు. పరోక్షంలో రాయ్ ను శిక్షించామన్నారు. లజపతిరాయ్ కూడా