పుట:Abaddhala veta revised.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయితే రాష్ట్రంలో కీలకమైన పదవిని నిర్వహించే ముఖ్యమంత్రి మొదలుకొని, మంత్రులు, అధికారులు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడమే అభ్యంతరకమైన అంశం. తిరుపతి, భద్రాచలంలలో జరిగే హిందూమత ఉత్సవాలు, క్రైస్తవులు ప్రార్థన ద్వారా వ్యాధులు నయం చేస్తామని, కాళ్ళులేని వారికి నడిపిస్తాం అంటూ చేసే స్వస్థత సభలకు వెళ్ళడం,మొహరం వంటి ముస్లిం పండగల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమే కాక ఉన్నత పదవుల్లో ఉన్నవారే ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ప్రజలు తప్పుదోవపట్టే ప్రమాదం ఉంది. అంతేకాక మత గురువులు, బాబాల ఆశ్రమాలు, మిషనరీలకు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లడం వల్ల వాటిలో జరిగే అక్రమాలు,ఆర్థిక లావాదేవీలు, హత్యలు బహిర్గతం కావు. విదేశాల నుంచి నిధులను తెచ్చుకోవడానికి మతపరమైన సంస్థలకు మంత్రులు, అధికారుల సందర్శనలు పరోక్షంగా తోడ్పడతాయి. అంతేకాక ఇలాంటి సంస్థలు వాణిజ్య కార్యకలాపాలు సాగించినప్పటికీ పన్నుల సడలింపులు పొందుతున్నాయి. ఇవన్నీ పోను ప్రస్తుత ప్రభుత్వం సమ్మక్క-సారక్క వంటి పలు ఉత్సవాలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తూ ఒక మతాన్ని వెనకేసుకొస్తోంది.

? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మతాన్ని వెనకేసుకొస్తోందో వివరిస్తారా?

  • రాష్ట్ర మంత్రివర్గంలో ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండడమే హిందూమతాన్ని వెనుకేసుకురావడం అవుతుంది. హిందువులు విశ్వసించే దేవాలయాలకు సంబంధించి ప్రత్యేక శాఖ నెలకొల్పి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండడం వల్ల ఇతర మతాల నుంచి కూడా తమకు రాయితీలు కావాలన్న ఒత్తిడి వస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటున్న జ్యోతిష్యం వంటి అశాస్త్రీయమైన కోర్సులను తెలుగు విశ్వవిద్యాలయంలో ఎన్.టి.రామారావు ప్రారంభించారు. ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఆ కోర్సులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదికాక వాస్తుకు ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర రాజధానిలోని సచివాలయం మొదలుకొని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయడానికి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదికాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలకు వాస్తు ఎలా ఉందని టెలికాన్ఫరేన్ లలో అధికారులను విచారించిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనివల్ల అమాయక ప్రజల్లో వాస్తు పట్ల భ్రమలను పెంచినట్లే అవుతుంది.

? రాష్ట్రంలో అమలౌతున్న విద్యావిధానంలో ఏమైన లోపాలున్నాయా?

  • రాష్ట్రంలో అమలౌతున్న విద్యావిధానమ్లో బలవంతంగా పసిపిల్లలపై మతాచారాలను రుద్దుతున్నారు. క్రైస్తవ మిషనరీ స్కూళ్లలో క్రైస్తవ సంబంధ ప్రార్థనలు తప్పనిసరిగా అందరిచేత చేయిస్తుండగా, మదరసాల్లో, భజరంగ దళ్, ఆర్ ఎస్ ఎస్ నిర్వహించే