పుట:Abaddhala veta revised.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మొట్టమొదటగా 1882లో సైకిక్ పరిశోధనాకేంద్రాన్ని లండన్ లో ప్రారంభించారు. వీరి పరిధిలో శక్తులు, ఆత్మలు, పూనకాలు, దయ్యాలు,భూతాలు,మనస్సుల మధ్య సంబంధాలు వుండేవి. కేంబ్రిడ్జి తాత్వికుడు హెన్రి సిడ్జిలిక్ యీ సైకిక్ రీసెర్చి సంఘానికి అధిపతిగా వ్యవహరించాడు. అందులో 13 మంది ఆధ్మాత్మిక వాదులు,ఆరుగురు పరిశోధకులు వుండేవారు. పరిశీలన అంతా ఆ ఆరుగురు మాత్రమే చేస్తుండగా ఆధ్మాత్మికవాదులు ఒక్కరొక్కరే తప్పుకున్నారు. 1887 నాటికి కొందరు సుప్రసిద్ధులు యీ సంఘంలో చేరారు. సర్ ఆలివర్ లాడ్జి, లార్డ్ రాలి,జె.జె.థాంసన్ లు సైకిక్ రీసెర్చి సంఘంలో ఆసక్తిగా పాల్గొన్నారు. ఆత్మకు శాస్త్రీయ గౌరవం ఆపాదించాలని యీ సంఘం ప్రయత్నించింది. వ్యక్తికి భౌతికేతర అంశం కూడా చాలా ప్రధానం అని వీరు తలచారు. అయితే వీరు,టెలిపతితో బాటు, దృశ్యాలు కనబడడంతో సహా అనేకాంశాలు పరిశీలనలోకి స్వీకరించారు. మనస్సును గ్రహించడం, టెలిపతి శక్తుల గురించి దృష్టి బాగా కేంద్రీకరించారు. అనేక శక్తులు సరైనవేనని వీరు నమ్మారు. సర్ ఆలివర్ లాడ్జి తన కీర్తిశేషుడైన కుమారునితో మాట్లాడినట్లు చెప్పుకున్నాడు.

ఈ సంఘం వారిలో కొందరు ఆత్మల పరిశీలనాంశాలలో మోసాలు జరిగినట్లు ఒప్పుకున్నారు.

చేతులు వాటంతట అవే రాస్తూ పోవడం ఒక శక్తిగా యీ సంఘం నమ్మింది. అవన్నీ ఆధ్యాత్మిక రంగానికి అంటగట్టారు.

ఇంగ్లండ్ లో సైకిక్ రీసెర్చి ప్రారంభించిన తరువాత, 1985లో అలాంటి సంఘాన్ని అమెరికాలోని బోస్టన్ లోనూ మొదలెట్టారు. సుప్రసిద్ధ సైకాలజిష్టు విలియం జేమ్స్ యిందులో పాల్గొన్నాడు. కాని ఆధ్యాత్మిక శక్తులలో వీరికి పూర్తి నమ్మకం లేక, కొన్ని కలహాలు తలెత్తాయి. సంఘం చీలింది. ఉత్తరోత్తరా సైకాలజిస్టు విలియం మెగ్డోగల్ మరికొందరు సంఘాన్ని పునరుద్ధరించారు.

సైకిక్ సంఘం కలగాపులగంగా మారడంతో,పేరా సైకాలజీని విడదీసి,శాస్త్రీయ గౌరవం ఆపాదించే నిమిత్తం జోసెఫ్ బాంక్స్ రైన్ ప్రయత్నించాడు.

సైకికల్ రీసెర్చి స్థానే పేరా సైకాలజీని 1930 నుండీ జె.బి.రైన్ ప్రచారంలోకి తెచ్చాడు. పరిశోధనాలయాలలో శాస్త్రీయ పరిశీలన చేసి పేరా సైకాలజీని సైన్స్ లో భాగంగా చేయాలని రైన్ కృషి చేశాడు. ది జర్నల్ ఆఫ్ పేరా సైకాలజీ అనే పత్రిక ప్రారంభించాడు. అంతకు ముందు జర్నల్ ఆఫ్ సైకికల్ రీసెర్చి పత్రిక ఇంగ్లండు నుండి వెలువడుతూ దయ్యాలు,పూనకాలతో సహా అన్ని అంశాలు ప్రచురించింది.

ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు పేరా సైకాలజీకి శాస్త్రీయ గౌరవం తెచ్చే ప్రయత్నంలో నిమగ్నులయ్యారు. అమెరికన్ సైంటిఫిక్ సొసైటీలో సభ్యులుగా పేరా సైకాలజిస్టులు చేరడం గమనార్హం. పరిశోధనాంశాలు ప్రమాణ పత్రికలో ప్రచురించారు. అయితే పేరా సైకాలజీ 4