పుట:Abaddhala veta revised.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయరాదని ఆయన అన్నారు. ప్రభుత్వ సహాయంతో కొనసాగే మతం వలన చాలా బాధలకు గురైనాం. ప్రభుత్వ నిధులపై ఆధారపడే మతం, మతమే కాదు అన్నారు గాంధీ (చూడు హరిజన్ 1948 మార్చి 23) అందుకు భిన్నంగా నేడు ప్రభుత్వ సంస్థగా మతం మారింది.

గాంధి సాధించిందేమిటి?

స్వాతంత్ర్యోద్యమంలో సామాన్యుల్ని చైతన్యవంతుల్ని చేయడంలో మతాన్ని ఆయుధంగా వాడి, గాంధి కొంతవరకు సాధించారు. ఆయన పిలుపు యిస్తే చాలు, జనం రంగంలోకి దూకారు. అయితే అటు హిందూ సనాతనులు, ఇటు ముస్లిం చాదస్తులు గాంధీ విధానాలను వ్యతిరేకించారు. రాజకీయ ప్రయోజనాల నిమిత్తం, వేదికలపై ఈశ్వర-అల్లా తేరేనాం అని పాడినా, ఉభయ మతాల వారు, ఎవరి గొప్పదనం వారిదే అనుకున్నారు. హిందూమతాన్ని ధ్వంసం చేస్తున్నాడని హిందూ కరడుగట్టిన తీవ్రవాదులు గాంధీపై కన్నెర్ర చేశారు. ముస్లింలు గాంధీని నమ్మకుండా, తమ పొయ్యి తామే ఏర్పరచుకుంటామన్నారు.

స్వాతంత్ర్యం వచ్చే నాటికి మతం నిర్వహిస్తున్న పాత్ర ప్రభుత్వం దాని పట్ల అనుసరించాల్సిన విధానం గాంధీకి స్పష్టమైంది. కాని అప్పటికే చాలా ఆలశ్యమైపోయింది. ఏ మత సామరస్యత కోసం గాంధీ పోరాడాడో ఆ మత ఛాందసం, అసహనం, హింసకే గాంధి ఆహుతయ్యాడు.

మతాన్ని అవగహన చేసుకోవడంలో గాంధి సామాన్య లౌకిక ధోరణి ప్రదర్శించారు. శాస్త్రీయ పంథా ఏనాడూ ఆయన చేబట్టలేదు. అందువలన గాంధీ విఫలం గాక తప్పలేదు. అయితే రాజకీయ రంగంలో మత విధానాలు వాడడానికి బ్రిటీష్ వారి పాలనలో సరిపోయింది. కాని, ఫాసిజం, కమ్యూనిజం, ముస్లిం ఇస్లాం రాజ్యాలలో ఇది సాధ్యమయ్యేదా? అని ప్రశ్నిస్తే, సాధ్యం కాకపోయేదే అనుకోవలసివస్తుంది. 20వ శతాబ్దంలో గాంధేయ అహింసా విధానాలతో స్వాతంత్ర్యోద్యమాలు జరగడం గొప్ప విశేషం. భవిష్యత్తు తరాల వారు ఆదర్శంగా తీసుకోగలిగిన అహింసాయుత పద్ధతులు గాంధీ అవలంబించారు. మతపరంగా ఆయన విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి. సెక్యులర్ పద్ధతులకు దేశంలో గట్టి పునాదులు వేయలేని గాంధి మత అసహనానికి గురయ్యారు.

- హేతువాది, డిసెంబరు 1989; జనవరి 1990
పునర్వికాస పరిణామం
క్రైస్తవులు పునర్వికాసానికి దోహదం చేశారా?

భారతదేశంలో క్రైస్తవులు మైనారిటీ వర్గంగా మూడోస్థానాన్ని ఆక్రమిస్తున్నారు. రెండోస్థానం ముస్లింలది. మెట్టమెదట కేరళలో అడుగుపెట్టిన క్రైస్తవులు, చాలా నెమ్మదిగా దేశంలో ప్రాకారు. యూరోప్ నుండి వచ్చిన వలస - సామ్రాజ్యవాదులంతా క్రైస్తవులే. ఆ విధంగా పోర్చుగీస్,