పుట:Abaddhala veta revised.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాటినందున గాంధీని, ఆయన్ను సాగనంపిన కుటుంబాన్ని వైశ్యకులం వెలివేసింది. అది లెక్కచేయకుండా గాంధి అడ్వొకేట్ వృత్తిని (కులవృత్తిని వదిలి) చేపట్టదలచాడు. ఇండియాకు వచ్చిన గాంధిపై రేచాంద్ భాయి మతపరంగా చాలా ప్రభావం చూపాడని చాలామందికి తెలియదు.

రేచాంద్ భాయి వలన గాంధీపై జైన సిద్ధాంతాల ప్రభావం బాగా నాటుకపోయింది. ఇతన్ని రాజ్ చంద్ర అని కూడా అంటారు. ఇతడిని గాంధీ గురువుగా భావించాడు. కాని 31 సంవత్సరాలకే ఆ గురువు చనిపోయాడు. వైష్ణవమతం, జైనమతం గాంధీజీలో కలిసిపోగా, యువకుడుగా కోర్టులో సత్యాన్ని పరిశోధించాలంటే వీలుకాలేదు. మరోవైపు అన్న వత్తిడిపై తనకు ఇంగ్లండ్ లో పరిచయమైన బ్రిటిష్ అధికారివద్దకు వెళ్ళి విఫలమయ్యాడు. కథియవార్ వదలాలనుకుంటుండగా, దక్షిణాఫ్రికా వెళ్ళే అవకాసం లభించింది. మరో 20 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో తన "సత్యాన్వేషణ"కై గాంధి 1893లో బయలుదేరాడు. దాదా అబ్దుల్లా కంపెనీ పక్షాన ట్రాన్స్ వాల్ వెళ్ళాడు. కోర్టులో కూలి బారిస్టర్ గా జడ్జిచే అగౌరవం పొందాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ రుచిచూచాడు. సంస్కరణ రంగంలోకి దిగాడు. భారతీయుల నందరినీ ప్రిటోరియాలో కలిశాడు. జాతి విచక్షణా బిల్లును వ్యతిరేకించడంలో ఇంగ్లండ్ రాణి బిల్లుకు ఆమోదముద్ర యివ్వకపోవడంలో గాంధిపాత్ర ప్రముఖంగా వుంది. దక్షిణాఫ్రికాలో తనకు చేదోడువాదోడుగా వుండడానికి షేక్ మెహతాబ్ ను అట్టిపెట్టుకున్నాడు. వ్యభిచారిణుల్ని ఇంటికే తెచ్చి అనుభవిస్తున్న మెహతాబ్ ను వదిలించుకొని, తన కుటుంబాన్ని తెచ్చుకోడానికొ ఇండియా వెళ్ళాడు.

కులం నుండి వెలివేసిన గాంధీకి, ఆయన భార్య కస్తూరిబాకు మంచినీళ్ళు కూడా యివ్వని వైశ్యులు, గాంధీకి కీర్తి ప్రతిష్టలు వచ్చిన తరువాత మా కులంవాడన్నారు. దక్షిణాఫ్రికానుండి పూర్తిగా ఇండియాకు వచ్చేసినప్పుడు ఘనంగా సన్మానాలు చేశారు. గాంధి మాత్రం వైశ్యుడుగా పూసుక తిరగలేదు. కులపట్టింపులు, విధులు పాటించలేదు. 1896లో దక్షిణాఫ్రికా నుండి గాంధి ఇండియా వచ్చారు. ఆయన పేరు కాంగ్రెసు పార్టీ ద్వారా ఇండియాలో కొంత వ్యాపించింది. ఆయనకు 27ఏళ్ళు. ఇండియాలో గోపాలకృష్ణ గోఖలేను తన గురువుగా గాంధి పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో భారతీయుల దారుణస్థితి, జాతి విచక్షణ గురించి గాంధీ ప్రచారం చేశాడు. తద్వారా ఆయన పేరు బాగా తెలియడమేగాక, జాతి విచక్షణ సమస్యకు యీసడింపు వచ్చింది. కుటుంబంతో తిరిగి వెళ్ళిన గాంధి దక్షిణాఫ్రికాలో తీవ్ర వ్యతిరేకతను చవిచూచారు. కాని బోయర్ యుద్ధంలో దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ సామ్రాజ్యం పక్షాన పోరాడారు. మొదటి ప్రపంచ యుద్ధంలోనూ ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యం పక్షాన గాంధి వున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో మాత్రం జపాన్ వారి సహాయంతోనైనాసరే బ్రిటిష్ వారిని తరిమేయాలని, క్విట్ ఇండియా పిలుపు యిచ్చారు.

1901లో దక్షిణాఫ్రికా నుండి కుటుంబ సమేతంగా ఇండియావచ్చిన గాంధి,వకీలుగా