పుట:Abaddhala veta revised.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భార్య కస్తూరి అన్ని విధాలా గాంధి చెప్పినట్లు వినేది. కాని చదువుకోమంటే ససేమిరా అని మొండికెత్తింది. ఆ విషయంలో గాంధీ ఓడిపోయాడు. షేక్ మెహతాబ్ మాత్రమే లండన్ నుండి గాంధి రాసిన ఉత్తరాలు చదివి కుటుంబ సభ్యులకు వినిపిస్తుండేవాడు. తరువాత గాంధి అతడిని దక్షిణాఫ్రికా పిలిపించుకున్నాడు. అక్కడ మెహతాబ్ ధోరణి, వ్యభిచారం భరించలేక, బలవంతంగా వదిలించుకున్నాడు. చిన్నప్పటినుండే ముస్లిం స్నేహితుడి ప్రభావంలోవున్న గాంధీ, హిందూ-ముస్లిం భాయి భాయి అని నినదించాడు. కుటుంబమంతా యీసడించుకుంటున్నా గాంధీ తన స్నేహితుడు మెహతాబ్ ను ఒక పట్టాన వదలుకోలేకపోయాడు. గాంధీ పెద్ద కుమారుడు హరిలాల్ ముస్లింగా మారడానికి షేక్ మెహతాబ్ ప్రభావం పరోక్షంగా వున్నది.

గాంధి తన జీవితచరిత్రను సత్య పరిశోధనగా పేర్కొన్నారు. తన తండ్రి, ముగ్గురు భార్యలు చనిపోగా, 4వ ఆమెకు, అనగా తన తల్లి పుత్లిబాయిని చేసుకున్నాడని రాశాడు. కాని మూడోభార్య బ్రతికుండగానే (ఆమె బాగా అనారోగ్యంగా వుండగా) పుత్లిబాయ్ ని చేసుకున్నారు. అలాగే షేక్ మెహతాబ్ ను సంస్కరించడానికే అతడితో స్నేహం చేశానన్నారు. కాని వాస్తవానికి గాంధీని అతడే చిన్నతనంలో ఎక్కడబడితే అక్కదతిప్పి, అన్నీ తినిపించి, త్రాగించి, సిగరెట్లు పీల్చేటట్లు చేశాడు. మెహతాబ్ గురించి చాలా వాస్తవాలు వదిలేదసి స్వీయచరిత్ర రాసినట్లు గాంధి ఒప్పేసుకున్నారు. వీరిద్దరికీ లైంగిక సంబంధాలుండేవని అనడానికి ఆధారాలు లేవు. వున్నవన్నీ వదంతులే. సూచనప్రాయమైన సంఘటనలు మాత్రం వున్నాయి. అలాంటి షేక్ మెహతాబ్ ప్రభావం గాంధీపై కనిపిస్తుంది. వ్యభిచార గృహాలకు వెళ్ళినప్పుడు విఫలమైన సంఘటన ఒక్కటే గాంధి పేర్కొన్నాడుగాని, సఫలమైన వాటి జోలికి పోలేదు. తన పరిశోధనకు అవి అనవసరమనుకోవచ్చు. వాస్తవాలు చెప్పకపోవడం సత్యాన్వేషణలో భాగమేమో తెలియదు. తొలిసారి ఆఫ్రికాకు వెడుతున్నప్పుడు కూడా గాంధి నిజాలు దాచినట్లు ప్రమాణపూర్వకంగా ఆధారాలున్నాయి. (చూడు.మహదేవన్ రాసిన ది లేయర్ ఆఫ్ ది ఫీనిక్స్)

ఇంగ్లండులో చదువుకోడానికి సముద్రం దాటిన గాంధి, 1888 సెప్టెంబరులో 50 రోజులు ప్రయాణంచేసి, ఇంట్లో వాళ్ళకు అనేక ఒట్లు వేసి, గమ్యం చేరుకున్నాడు. ఇంగ్లండ్ లో చదువుకుంటూనే కొన్ని అసత్య సత్య పరిశోధనలు చేసిచూచాడు. శాకాహారం, సంగీతం, వ్యభిచారగృహాల సందర్శన ఇందులో భాగమే. తనకు పెళ్ళి అయిందని చెప్పకుండా సాగిపోయిన గాంధి, ఒక పెళ్ళి ప్రతిపాదన వచ్చేసరికి నగ్నసత్యాన్ని బయటపెట్టక తప్పిందికాదు! ఇంకా ఆశ్చర్యమేమంటే భగవద్గీత, బైబిలు, ఖురాన్ వంటి గ్రంథాలు గాంధి ఇంగ్లండ్ లో చదివి ప్రభావితుడైనాడు.

ఇంగ్లండ్ లో చదువు పూర్తి చేసుకొని గాంధి ఇంటికొచ్చేసరికి తల్లి పుత్లిబాయి చనిపోయింది. ఆ తరువాత బ్రతుకుతెరువు నిమిత్తం దక్షిణాఫ్రికా ప్రయాణం కట్టాడు. అప్పటికే గాంధీపై టాల్ స్టాయ్, రస్కిన్, థోరో ప్రభావం పడింది. ఇంగ్లండ్ పోడానికి మ్లేచ్ఛుడుగా సముద్రం