పుట:Abaddhala veta revised.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖురాన్ ప్రతిపాదించి, అమలుపరచిన శిక్షలు తు.చ. తప్పకుండా అమలు జరగాలని భారతదేశంలో ముస్లింలు అనగలరా? భారత శిక్షాస్మృతి అందుకు ఒప్పుకోలేదు గదా? ఆ విషయమై నేరస్తులనును శిక్షించడంలో ఒకే రీతి చట్టాన్ని ముస్లింలు,హిందువులు పాటిస్తున్నారు. పౌరసంబంధమైన విషయాలలో కూడా ఇలాగే వుంటే గొడవేలేదు.

నేడు ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులు కోరుకుంటున్నారు. స్వేచ్ఛ సమానత్వం అనేవి మానవ విలువలుగా గుర్తించారు. కాని,మానవహక్కుల్ని ఖురాన్ గుర్తించకపోతే ఏం చేయాలని ముస్లింలు ఆలోచించుకోవాలి. పురుషులకంటె స్త్రీలు తక్కువ అనడం,బానిసత్వాన్ని సమర్ధించడం,ముస్లిమేతరులు అందరూ కాఫిర్లు అనడం అనేవి,నేడు సమర్ధనీయాలా? ముస్లిం యువతరం వీటిని పరిశీలిస్తే గాని, పునర్వికాసానికి చోటు వుండదు. అలాగే వివాహం విషయంలోనూ, విడాకుల విషయంలోనూ స్త్రీ పురుష సమాన హక్కుల సంగతి వారు పరిశీలించాలి. ముస్లింలలో సమానత్వం అనేది ప్రార్థనల సమయంలో పాటిస్తున్నారు. తరువాత అసమానతలు బాగా ఆచరిస్తున్నారు. సంపన్నులు పేదవారిని సమానంగా చూడలేకపోతున్నారు. ఇతర మతాలవారి సంగతి ఇక చెప్పనక్కరలేదు. వారంతా ధిమ్మీలు, లేదా కాఫిర్లు!

విచిత్రమేమంటే,అనేక ముస్లిం దేశాలు ఇస్లాం పేరెత్తకుండానే చాలా సంస్కరణలు అమలు చేశాయి. ట్యునీషియా ముస్లిం దేశమే. అక్కడ బహుభార్యత్వాన్ని నిషేధించారు. అందుకు ఖురాన్ అడ్డుపడలేదు ఈజిప్టులో ముస్లిం వక్ఫ్ బోర్డులలో వ్యక్తిగత పెత్తనం తొలగిస్తే, మతగురువులు మాట్లాడలేదు!

ముస్లిం మత చట్టాలను (షరియా) చాలా ముస్లిందేశాలు పాటించకుండా ఆధునీకరణకు పూనుకున్నాయి. ముఖ్యంగా నేరాలు చేసినవారి చేతులు, కాళ్ళు నరకడం వంటి క్రూర హింసల్ని అనేక ముస్లిందేశాలు వదలివేశాయి. ఇంకా సౌదీ అరేబియా,పాకిస్తాన్,లిబియాలలో ఇలాంటి దారుణాలు అమలుపరుస్తున్నారు. అయితే ఆ దేశాలలో ముస్లింలు పరిపాలిస్తున్నారు గనుక సరిపోయింది. ముస్లింలు పరిపాలనలో లేని చోట్ల ముస్లింలు తమ చట్టం ప్రకారం అమలు జరగాలని పట్టుబట్టడం లేదు, అమెరికా, యూరోప్, కెనడాలలో ముస్లింలు తగిన సంఖ్యలోవున్నా ముస్లించట్టం కావాలని కోరలేదు.

భారతదేశానికి ఒక లిఖిత పూర్వక రాజ్యాంగం వుంది. సాంఘిక సంస్కరణలు చేయాలని,ఒకే పౌరస్మృతి కావాలని, సెక్యులర్ సైంటిఫిక్ ధోరణులు అమలుపరచాలని రాజ్యాంగం స్పష్టంచేసింది. ముస్లింలు వీటినుండి తమను మినహాయించాలంటే, పునర్వికాసం వారిలో రాజాలదు.

టర్కీలో కెమాల్ పాషా ఆధ్వర్యాన చాలా సంస్కరణలు జరిగాయి. ముస్లింలు ఆధునికీకరణ మార్గంలో పయనించారు. ఇరాన్ లో షా ముస్లింలు పాశ్చాత్యులతో దీటుగా అనేక