పుట:Abaddhala veta revised.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేథలిక్కులు స్త్రీలను ద్వితీయ పౌరులుగా,బానిసలుగా చూస్తారు. పోప్ పయస్ 12 దీనికి ఆమోదముద్ర వేశాడు.

అలాంటి పోప్, రండవ ప్రపంచ యుద్ధానంతరం, తనకు పడకగదిలో జీసస్ క్రీస్తు కనిపించాడని చెప్పడం మొదలెట్టాడు. ఇందుకు రుజువులు సాక్ష్యాలు అక్కరలేదుకదా. సాక్షాత్తు పోప్ చెబుతుంది భక్తులు నమ్మక ఏంచేస్తారు?

ఉద్యానవనంలో సూర్యుడు రంగురంగులుగా తిరుగుతున్నట్లు కనిపించాడని పోప్ మరొక విడ్డూరాన్ని ప్రచారం చేశాడు. అప్పుడు పక్కనే వున్న అతని డ్రైవర్ జవాని స్టెఫనోరి తనకు అలాంటి రంగులు కనిపించలేదన్నాడు.

అలాంటి పోప్ ఆధునిక వైద్యం బదులు, స్విట్జర్లాండ్ లో నాటు వైద్యం అనుసరించి బాధకు గురైనాడు. చివరకు ఆ చికిత్సలో చనిపోయాడు. స్విస్ ప్రాక్టీషనర్ పాల్ నెహాస్ పోప్ కు సెల్యుథెరపి పేరిట చర్మం అడుగున గొర్రె,కోతి పిండాలనుండి జీవకణాలను ఇంజక్షన్ల ద్వారా ఎక్కించారు. అది సర్వరోగనివారిణి అనేవాడు. అందుకు రుజువులు, ఆధారాలు లేవు.

1958 అక్టోబరు 9న యూజినో పచెలి పోప్ పయస్ 12 చనిపోయాడు.

ఇప్పుడు ఆ పోప్ గొప్ప రుషి అని ప్రస్తుత పోప్ ప్రకటించాలనుకుంటున్నాడు. ఇందుకు పోప్ అద్భుతాలు కొన్ని, రుజువు అయినట్లు చూపాలి. వాటి పరిశీలనకు ఒక సంఘం నియమించాడు. అలాంటి రుషి పట్టా మదర్ థెరిసాకు సైతం అంటగట్టాలని ప్రయత్నాలు మెదలయ్యాయి.

- హేతువాది, డిశంబరు 1999
పునర్వికాస పరిణామం
డిరోజియో ఉజ్వల ఆరంభం

భారతదేశంలో పునర్వికాసం 19వ శతాబ్దం ఆరంభంలో మొదలయింది. మానవ హక్కులకు, విలువలకూ వ్యతిరేకంగా వున్న మత ఆచారాలూ, సంప్రదాయాలూ పరిశీలించి ప్రశ్నించడం ప్రారంభమైంది. మత గ్రంథాల ఆధారంతో కొందరు ఆచారాలను సంస్కరించాలని తలపెట్టగా, మరికొందరు తృణీకరించాలన్నారు. మొత్తం మీద సమాజంలో ఉన్న దోషాలను ఉభయులూ గుర్తించారు, మార్పు కోరారు. పాత పద్ధతులను గ్రుడ్డిగా అనుసరించరాదనే ధోరణి వ్యక్తమైంది. ఇది దేశంలో పునర్వికాసానికి నాంది. బెంగాల్, బొంబాయిలలో ఈ ఆలోచన మొదలైంది. అప్పట్లో ఆంగ్లేయులు పాలిస్తున్న భారతదేశానికి కలకత్తా రాజధాని. ఇంగ్లీషు విద్య కొత్తగా ప్రారంభించగా చదువుకున్నవారి సంఖ్య వేళ్ళపై లెక్కించటానికి వీలుగా ఉండేది. కలకత్తా జనాభా 2.5 లక్షలున్న రోజులలో కొత్తగా ఇంగ్లీషు బోధనా బాషగా హిందూ కళాశాలను 1817లో