పుట:Abaddhala veta revised.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొక్మా అని, చైనాలో గైయీ అనీ నానుడిగా చెబుతారు. మన దగ్గర భూతాలు, శక్తులు, అమ్మవారు, పిశాచాలు పట్టి పీడించడం, అని సాధారణంగా పేర్లు పెడతారు. ఇవి నిద్రలోనే జరుగుతాయని విస్మరించరాదు. అయితే నిద్రపక్షపాతం అనేది ఒకటుంటుందని చాలామందికి తెలియదు.

- హేతువాది, అక్టోబర్ 1999
ఇస్లాం(అరబ్)సామ్రాజ్యవాదం

అన్వర్ షేక్ పాకిస్తాన్ నుండి ఇంగ్లండ్ వచ్చి స్థిరపడి సొంతంగా ఇస్లాం, కొరాన్, సంప్రదాయాలు బాగా చదివాడు. అతడిని దిగ్భ్రాంతిపరచిన విషయాలు బయటపెట్టాడు. అడుగడుగునా మానవహక్కుల్ని వ్యతిరేకిస్తూ, సామ్రాజ్యవాదం స్థాపించే ఇస్లాం ప్రయత్నం అతడికి జుగుస్స కలిగించింది. జీవితమంతా ఇస్లాంలొ కాచివడపోసి గ్రంథస్థం చెయడానికి పూనుకున్నాడు. అతడు కవి కూడా. సొంత ఖర్చులతో పుస్తకాలు వేసి భావప్రచారం సాగిస్తున్నాడు. తాను మానవవాదిని అని సగర్వంగా ప్రకటించుకున్నాడు.

అన్వర్ షేక్ అభిప్రాయాలను తట్టుకోలేని ఇంగ్లండు ఛాందస ముస్లింలు ఫత్వా జారీచేశారు. సమాధానం చెప్పలేక, వాదించలేక బలప్రదర్శనకు దిగడమే ఫత్వా సారాంశం. తస్లీమా నస్రీన్ కు బంగ్లాదేశ్ లో, సాల్మన్ రష్దీపై ఇరాన్ లో ఫత్వాల సారాంశం యిదీ. ముస్లిం ఛాందసులు తమపై వచ్చే విమర్శకు హేతుబద్దంగా ఏమీ చెప్పలేరు. మతాన్ని అడ్డం పెట్టుకొని చంపుతామంటారు. అందుకు నిరసనగా అన్వర్ షేక్ నిలుస్తున్నాడు.

అన్వర్ షేక్ సిద్దాంతం

యూరపు పార్లమెంటులో ఓసోస్టాండ్లర్ నివేదిక చర్చకు వచ్చింది. పాశ్చాత్య ప్రపంచం ఇస్లాం గురించి విపరీత భయాందోళన చెందుతున్నదనడానికి ఆ నివేదిక నిదర్శనం. పెరిగిపోతున్న మతమౌఢ్యం పట్ల ప్రజాస్వామికవాదులు హెచ్చరికలు చేస్తున్నారు.

ముస్లింలలో టెర్రరిస్టులు పెరిగిపోవడం, ముస్లిమేతరుల పట్ల వ్యతిరేకత, అసహనం అధికంగావడం, ఇదంతా ఇస్లాం పేరిట వ్యాపించడం నిత్యకృత్యంగా మారింది.

ఇస్లాం ప్రకారం ముస్లింలందరూ ప్రపంచమంతటా తమ మతాన్ని వ్యాపించేటంత వరకూ వూరుకోరాదు. ముస్లింలు వున్న దేశంలో అధికారం ముస్లిమేతరుల చేతుల్లో వుంటే, ఆ దేశాన్ని దారుల్ హర్బ్ అంటారు. ఆ దేశం ముస్లిం దేశంగా మారేటంతవరకూ నయాన భయాన కృషి సాగించాలి. ఒకసారి ఇస్లాం దేశంగా మారిన తరువాత దారుసలాం అవుతుంది. అంటే శాంతిదేశమన్న మాట.