పుట:Abaddhala veta revised.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శక్తి ప్రదర్శన వేరే దేశాలలో జరగవలసివస్తే, జేమ్స్ రాండి ఒక నిష్పాక్షిక ప్రతినిధిని పేర్కొంటాడు. వారి ఎదుట ప్రదర్శన జరపాలి. ఇందులో దారిఖర్చుల చెల్లింపు వుండదు. ప్రదర్శన వలన జరిగే నష్టాలకు రాండి బాధ్యుడు కాదు కనుక నష్టపరిహార చెల్లింపు వుండదు.

జేమ్స్ రాండి తన తదనంతరం ఛాలెంజ్ ధనాన్ని అతీంద్రియ శక్తుల శాస్త్రీయ పరిశోధనా సంస్థకు యివాలని రాశారు. ఇది అమెరికాలోని నయగారా వద్ద బఫెలో నగర శివార్లలో వుంది.

(Committee for the Scientific Investigation of Claims of the paranormal)

ప్రదర్శనలో పేర్కొన్న ప్రకారం అతీంద్రియ శక్తి చూపలేకపోతే, తనకు అలాంటి శక్తి లేదని ప్రదర్శకుడు స్పష్టంగా ప్రకటించాలి.

web address:

http://www.randi.org

Phone:954-467-1112

Fax:954 467 1660

ప్రార్థనలతో రోగాలు మటుమాయం

భక్తికూటాలు ఏర్పరచి, భజనలతో,ప్రార్థనలతో, బోధనలతో రోగాలు నయం చేస్తామని, వికలాంగులను బాగుచేస్తామని ప్రపంచ వ్యాప్తంగా మోసాలు చేస్తున్నారు. దీనిని చాలెంజ్ చేసి అదంతా బూటకమని జేమ్స్ రాండి రుజువు చేశాడు. అయినా వెర్రి భక్తితో జనం కొత్త బాబాల చుట్టూ ఆశగా డబ్బు వదిలించుకుంటూనే వున్నారు.

తన అనుభవాలను జేమ్స్ రాండి ఒక పుస్తకంలో రాశాడు. అది బాగా ప్రచారంలోకి వచ్చిన గ్రంథం.

The Faith Healers (Prometheus Books, 3/4 pages, 700 East Amherst Street, Buffalo New York 14215 USA)

అమెరికాలో క్రైస్తవ ప్రచారకులు చేసిన విపరీత మోసాలు బయట పెట్టిన పుస్తకం యిది. అమెరికా అధ్యక్షపదవిని ఆశించిన క్రైస్తవ ప్రచారకుడు పాట్ రాబర్డ్‌సన్ మొదలు, ఎ.ఎ.ఎలెన్, ఓరల్ రాబర్డ్స్, డబ్ల్యు.వి. గ్రాంట్ ప్రభృతులను ఎండగట్టిన గ్రంథం యిది. టెలివిజన్ ప్రచారంలో భక్తి పేరిట చాలా డబ్బు వసూలు చేసిన సంఘటనలున్నాయి. రష్యాలో కమ్యూనిజం అరికట్టమని దేవుడు ఆదేశించాడు. గనుక అర్జెంటుగా డబ్బివ్వమని టెలివిజన్ ద్వారా విజ్ఞప్తి చేసి, కాజేసిన వారి సంగతి బయటపెట్టాడు.

కుంటి, గుడ్డి వాళ్లను స్వస్థత కూటాలలో బాగుచేస్తున్నట్లు చేసిన మోసాలను వెల్లిడించాడు.