పుట:Abaddhala veta revised.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనం పీల్చే ప్రాణవాయువులొ 20 శాతం మెదడుకు కావాలి. గుండె కొట్టుకుంటూ శరీరంలో ప్రసరింపజెసే రక్తంలో 5వ వంతు మెదడుకు అవసరం. ఇందులో ఏదీ తగ్గినా మెదడు మామూలుగా పనిచేయదు. మతపరంగా ఆధ్యాత్మికం పేరిట చేసే ఉపవాసాలు, శరీరాన్ని శుష్కింపజేయడమ్, పోషకాహారం తినకపోవడం, శరీరాన్ని బాదుకోవడం, వూపిరి తగినంతగా పీల్చుకోకపోవడం, పీల్చినా ఎక్కువసేపు బలవంతంగా అట్టిపెట్టి బొగ్గుపులుసు వాయువును పెంచడం యివన్నీ ఉన్మాద చెష్టలే.ఇందులో తరతమ భేదాలున్నాయి. కాని మతం పేరిట చలామణి అవుతున్నాయి గనుక వాటిని ఖండించడానికి వెనుకాడతాం.

ఆల్డన్ హక్స్ లీ ప్రయోగాలు

మధురానుభూతుల్ని మరోవిధంగా సృష్టించవచ్చు. ఆల్దన్ హక్స్ లి యీ పరిశోధన చేసి మెస్కలిన్ అనే మత్తుపదార్థాని స్వీకరించాడు. తద్వారా కలిగిన అనుభూతుల్ని, అనుభవాన్ని రికార్డు చేయించాడు. మెస్కలిన్ లో వ్యసనంగా అలవాటుపడే లక్షణాలు లేవు. కనుక పరిశోధనకు అనుకూలంగా వుంది. అనుభూతులు, దివ్యదృష్టి సహజంగా రావాలి గాని, మందులు మింగి తెప్పిస్తే అది కృత్రిమం అని విమర్శించారు. ఇంతవరకు చర్చించిన అంశాల్ని బట్టి శరీరాన్ని కృత్రిమంగా హింసించిన ఫలితంగానే అనుభూతులు వస్తాయని నిర్ధారణ అయిందిగదా. పైగా శరీరం రసాయనిక, భౌతిక, విద్యుత్ పద్ధతులలో పనిచెస్తున్నది. కనుక మెస్కలిన్ ప్రయోగం తప్పు లేదు.

మెస్కలిన్ అనేది ఎడారులలో లభించే జెముడునుంచి తయారుచేస్తారు. మన వూళ్ళల్లో నాగజెముడు, బ్రహ్మజెముడు అనే కోవలోనికే యిది చెందుతుంది. ప్రస్తుతం శస్త్ర చికిత్సలలో మెస్కలిన్ వాడుతున్నారు. కండరాలు సడలటానికి, మధురానుభుతులకు యిది ప్రసిద్ధి. ఇది అలవాటుకాని మత్తుపదార్ధం. స్వీకరించిన అనంతరం, దీని ప్రభావం తగ్గిపోయిన తరువాత మరే అవలక్షణాలు కనిపించడంలేదు. అందువలన ఆల్డస్ హక్స్ లీ తనమీద మెస్కలిన్ ప్రయోగం చేసుకున్నాడు. ఒక గ్రాములో నాలుగోవంతును అరగ్లాసు నీళ్ళలో కలిపి తాగాడు.

మనం ఇతరులను ఎలా చూస్తున్నాం? అలాగే మనల్ని ఇతరులు ఎలా గమనిస్తున్నారు? వారు చెబితే తప్ప తెలియదు పూర్తిగా చెప్పరు కూడా.

సాధారణ మానవుడిగావున్న నేను పిచ్చివాడిగా ఎలా ప్రవర్తిస్తాను? అది నాకు నేనుగా తెలుసుకోగలగడం అరుదు, విడేషం. మెస్కలిన్ వేసుకొని ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకునే ప్రయత్నం అల్డస్ హెక్స్ లీ చేశాడు. ఎవరి పిచ్చివారికి ఆనందం అంటామే గాని, పరిశోధన చేసి చూడం. రుషులు, యోగులు, బాబాలు యీ పనిచేశారు. అదే పని ఆల్డస్ హక్స్ లీ చేశాడు.

మెస్కలిన్ ప్రభావం కొన్ని గంటలపాటు వుంటుంది. అర్ధగంట తరువాత యీ ప్రభావ లక్షణాలు మొదలౌతాయి. ఉదయం 11 గంటలకు మెస్కలిన్ స్వీకరించిన ఆల్డస్ హక్స్ లీకి