పుట:Abaddhala veta revised.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
రాముడు కావాలా? అంబేద్కర్ కావాలా? తేల్చండి

రాముడిని దేవుడిగా పరిగణిస్తూ వుండేవారు,అతడు సీత శీలాన్ని శంకించి ప్రవర్తించిన తీరుకు అసహ్యపడాలి. ఈ విషయంలో రాముడి చర్య నేరంతో కూడింది. రాజుగా రాముడు, తపస్సుచేస్తున్న శూద్రుడు శంబుకుడిని చంపడం, అతడు ధర్మాన్ని అతిక్రమించాడనడం, ఇదంతా ఒక చనిపోయిన బ్రాహ్మణ యువకుడి నిమిత్తం చేశాడనడం తప్పు.

రాముడి పుట్టుక వ్యవహారమంతా వ్యభిచారంతో కూడినదే. బుద్ధ రామాయణం ప్రకారం సీత రాముడి సోదరి. కనుక యీ యిరువురి పెళ్ళి ఆదర్శం కాదు. రాముడు ఏకపత్నీవ్రతుడూ కాదు. వాల్మీకి రామాయణాన్ని బట్టి కూడా రాముడికి చాలామంది భార్యలున్నారు. (అయోధ్యకాండ 8వ సర్గ 12వ శ్లోకం)ఇంకా ఉంపుడుకత్తెలు కూడా రాముడికి వున్నారు. రాముడిని దేవుడిగా చూచేవారు ఈ విషయాలు పరిగణలోకి తీసుకోవాలని అంబేద్కర్ అన్నారు. సమాధానం చెప్పజాలని భక్తులు కర్రలు తీసుకొని వీధిన పడ్డారేగాని సహనంతో చర్చించలేకపోయారు. అదీ "రామ" సంస్కృతి.

మనం కోరుకునే మానవ హక్కుల్ని హిందూమత సమాజంలో సాధించడం సాధ్యంకాదని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సమానత్వం లేదు. స్వేచ్ఛకు గుర్తింపు లేదు. జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో వుంచే అవకాశం లేదు. సౌభ్రాతృత్వం అసలే లేదు. కనుక హిందూమతం ప్రజాస్వామిక విలువలకు చోటు పెట్టడం లేదని అంబేద్కర్ స్పష్టం చేశాడు(ఫిలాసఫి ఆఫ్ హిందూయిజం). హిందూ ధర్మాలు, పవిత్ర గ్రంథాల ఆధారంగానూ, ఆచరణరీత్యానూ జరుగుతున్న తంతును అంబేద్కర్ విశదీకరించాడు. సాంఘిక న్యాయానికి తోడ్పడని హిందూమతాన్ని అమానుషమైనదిగా సహజంగానే అంబేద్కర్ నిర్ధారించాడు.

బి.జె.పి. వారు అంబేద్కర్ తత్వాన్ని, వాదనల్ని ఏ మేరకు అంగీకరిస్తున్నారో,ఎక్కడ ఎందుకు నిరాకరిస్తున్నారో తెలపాలి. అంటరానితనం పోవాలి అని చిలుకపలుకులు ఉచ్ఛరిస్తే సరిపోదు. అది ఎలా సృష్టి అయిందీ, మూలస్థంభాలుగా నిలచి దీనిని ఎవరు పోషిస్తున్నదీ, అది పోవాలంటే ఏం చేయాల్సిందీ అంబేద్కర్ చెప్పారు. హిందూ సమాజం పాటిస్తున్న యీ మహానేరం ప్రపంచ చరిత్రలోనే మచ్చగా నిలచింది. అంబేద్కర్ ను వాడుకుని ఓట్లు తెచ్చుకుందామనే బి.జె.పి. తప్పు త్రోవలో పయనిస్తున్నదేమో చూచుకోవాలి. బుద్ధుడిని చంపేసినట్లే, అంబేద్కర్ ని కూడా నాశనం చేయాలనే పెద్ద కుట్రలో భాగస్వామిగా బి.జె.పి. వ్యవహరిస్తున్నదా? కాదంటే, అందుకు భిన్నంగా ఆచరణలో కనిపించాలి.

జనతాదళ్ కూడా అంబేద్కర్ ను గౌరవిస్తున్నది. పార్లమెంటు హాలులో నిలువెత్తు ఫోటో పెట్టమన్నారు. హరిజనులపై అత్యాచారాల్ని అందరూ ఖండిస్తున్నారు. కాని వాటికి మూలంగా నిలచిన మతం, ధర్మశాస్త్రాలు, ఆశ్రమాలు, హిందూ దురభ్యాసాలు రూపుమాపకుండా, అంబేద్కర్ ను