పుట:Abaddhala veta revised.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరువు జారిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని స్టాందింగ్ ఆర్డర్-నెంబరు 128 క్లాజు 2 అంటారు. రాష్ట్ర జనాభాలో 3.2 శాతం వున్న బ్రాహ్మణులు రెవిన్యూ శాఖలో ఆధిపత్యం వహించారు. ఉత్తరువు అమలుజరిగే తీరు ఆర్నెల్లకొకసారి పరిశీలించమన్నారు. ఈ స్థితి ఎందుకు వచ్చింది? అనంతపురంలో హుజూర్ తహసీల్ దారుగా వున్న కృష్ణారావు అనే బ్రాహ్మణాధికారి తన వారిని 108 మందిని వివిధ ఉద్యోగాలలో ప్రవేశపెట్టాడు. ఇందుకు శిక్షగా ఆయనను కడపకు బదిలి చేశారు. అక్కడ 117 మందిని తన కులంవారిని ఉద్యోగాలలో వేసుకున్నాడు. కేవలం తన కుటుంబాలకు చెందినవారే 80 మంది వున్నారు. కృష్ణారావును పోలిన సంఘటనలే గోదావరి, కృష్ణా జిల్లాలలోను బ్రిటీష్ వారు గమనించారు. బ్రిటీష్ వారి ఉత్తరువు కాగితాలపై వున్నదేగాని ఖచ్చితంగా అమలు జరగలేదు.

(ఆసక్తికరమైన వివరాలకు-ఆర్.ఇ.ఫ్రికన్ బర్గం పుస్తకం గుంటూరు డిస్ట్రిక్ట్-ఆక్స్ఫర్డ్ ప్రచురణ 1965 చూడండి.)

దేవాలయాలకు, మఠాలకు ఆస్తిపాస్తులుండేవి. వాటిపై స్థానిక అగ్రకులాల వారి ఆధిపత్యం వుండగా, ప్రతి సలహాకు పురోహితులపై ఆధారపడేవారు. ఆస్తుల విషయంలో యెన్నో కలహాలు వచ్చాయి. అయినా బ్రిటీష్ వారు దేవాలయాల జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. స్థానిక పరిపాలన బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. అప్పట్లో పన్నులు వసూలు చేసుకోవడంలోనే వారు ఆసక్తి చూపారు. ఈ రంగంలో కూడా వంశపారంపర్యంగా కులరీత్యా వున్న కరణాలు, మునసబులే గ్రామాలలో ఆధిపత్యం వహించారు. బ్రిటిష్ వారికి ఈ కులాధిపతులపై ఆధారపడడం తప్పనిసరైంది. బ్రిటిష్ వారిచ్చిన ఉత్తర్వులు అమలు జరగకుండా కులం అడుగడుగునా అడ్డుపడింది. నెల్లూరు జిల్లాలో జి.వెంకటరమణయ్య(నియోగి) తన కులం వారికి 49 మందికి రెవిన్యూశాఖలో ఉద్యోగాలిచ్చినట్లు తెలుసుకున్నారు. 1893-95 మధ్య ఉద్యోగాలలో బ్రాహ్మణులే అత్యధిక సంఖ్యలో వున్నారని గ్రహించారు. కనుక ప్రభుత్వమే చొరవ తీసుకొని 1896-1911 మధ్య బ్రాహ్మణేతర అగ్రకులాల వారికి ఉద్యోగాలిచ్చారు. 1851లో యిచ్చిన ఉత్తరువు 60 సంవత్సరాలు అమలు జరగకుండా వుండిపోగా, 1912లో మరొకసారి గట్టి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఉద్యోగాల పరీక్షకు పోటీలో 1892-1904 మధ్య 16 ఉద్యోగాలలో 15 బ్రాహ్మణులకే దక్కాయి. చదువులలోనూ, ఉద్యోగాలలోనూ బ్రాహ్మణులదే అగ్రస్థానం అయింది. కళాశాల హాస్టళ్ళలో బ్రాహ్మణ, బ్రాహ్మణేతర హాస్టళ్ళు పెట్టుకున్నారు. కాపు, రెడ్డి, కమ్మ, క్షత్రియ, రాజు, వైశ్య కులాలు వారు క్రమేణా తమ కులసంఘాలు పెట్టుకోనారంభించారు. మరోప్రక్క రాజకీయాల్లో కాంగ్రెసుపార్టీ కూడా బ్రాహ్మణాధిపత్య నాయకత్వంలో వుంది.

జస్టిస్ పార్టీ కుల రాజకీయాలు

కాంగ్రెసులో బ్రాహ్మణ నాయకత్వానికి వ్యతిరేకంగా బ్రిటీష్ వారికి అనుకూలమైన జస్టిస్ పార్టీ పుట్టడానికి పరిస్థితులు సానుకూలించాయి. మద్రాసు రాష్ట్రంలో వున్న ఆంధ్రులు