పుట:Abaddhala veta revised.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కులాన్ని అధ్యయనం చేసి,విశ్లేషించి, విడమరచి చెప్పిన ఆధునికులలో యం.యన్.రాయ్, అంబేద్కర్, లోహియాలు పెర్కొనదగినవారు. వీరు మూలానికి పోయారు. మతం పోవాలన్నారు, అంటే హిందుమతం పాటించి నన్నాళ్లు కులం వుంటుందని సారాంశం. ఈ ధోరణికి భిన్నంగా మత సనాతనులు కులాన్ని సమర్ధిస్తున్నారు. ఇందులో శంకరమఠాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఈ శతాబ్దంలోనే కంచి శంకరాచార్య వాయిస్ డివైన్ వ్రాసి కులాన్ని హిందూమత ధర్మంగా సమర్ధించారు. కులాన్ని పోగొట్టలేనివారు అంటరానితనాన్ని రూపుమాపుతారనుకోవడం భ్రమ.

అంటరానితనం పాటించరాదని, అలా చేస్తే శిక్షార్హమని రాజ్యాంగంలో రాసుకున్నారు. అందుకు విరుద్ధంగా హిందూమతధర్మాల్ని పాటించే చట్టాలు చేశారు. ఆవును చంపరాదని ఆందోళనలు చెసి సాధించుకున్నారు. సతిని సమర్ధించే పూరి శంకరాచార్యుల్ని ఏమీ చేయలేకపోయారు. దేవాలయ ప్రవేశాన్ని అంటరానివారికి లేకుండా చేస్తున్న పురోహితుల్ని ఆపలేకపోయారు. కులాన్ని పాటిస్తున్న శంకరాచార్యుల మఠాల చుట్టూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పెళ్ళిళ్ళల్లో కులం పాటిస్తున్నారు. మళ్ళీ కులసంఘాలు విజృంభించాయి.

కులం రాజకీయాల్లో, పరిపాలనలో ప్రవేశిస్తే కీలక స్థానాలల్లో కుల ప్రాధాన్యత వుంటే అనేక ప్రమాదకర పరిణామాలు వస్తాయని బ్రిటిష్ పాలకులు గ్రహించారు. కనుక కుల ప్రాధాన్యత తగ్గించాలనుకున్నారు. ఈ ప్రయత్నం 19వ శతాబ్దంలోనే బ్రిటిష్ వారు ఇండియాలో ఆరంభించారు. అయినా విఫలమయ్యారు. అదెలా జరిగిందో పరిశీలిద్దాం.

బ్రిటిష్ వారు నిరోధక ప్రయత్నాలు

బ్రిటిష్ పాలకులు వచ్చేనాటికి దేశంలో మతంపై పట్టు వున్నది బ్రాహ్మణులకే. మతానికి ఆయువుపట్టుగా వున్న దేవాలయాల్లో పురోహిత వర్గం బ్రాహ్మణులే. సమాజం మత ప్రభావంతో వుండేది. ఇది గ్రహించిన బ్రిటిష్ వారు, మతం జోలికి పోకుండా, పాలనారంగంలో జాగ్రత్తపడదలచారు. ఆనాటి పాలనలో కీలకస్థానం రెవిన్యూశాఖదే. గ్రామస్థాయిలో కరణాలు, మునసబ్ లు ప్రధానపాత్ర వహించారు. బ్రిటిష్ వారు ప్రతి వివరానికి కరణాలపై ఆధారపడవలసి వచ్చేది. మతరీత్యా చదువుకున్న వర్గం బ్రాహ్మణులే. మిగిలిన కులాల వృత్తులు వేరు. ఇది పరంపరగా వచ్చింది. బ్రిటిష్ వారి రాకతో బ్రాహ్మణులు ఉద్యోగాల్లో ప్రవేశించారు. మన రాష్ట్రంలోకి తొలుత తమిళనాడు, మహారాష్ట్ర బ్రాహ్మణులు ఉద్యోగరీత్యా వచ్చారు. వారి ప్రాబల్యం చూచి బ్రిటిష్ వారు ఉత్తరువులు జారిచేయాల్సిన స్థితి ఏర్పడింది.

కమ్యూనల్ జి.ఓ.1851లోనే

వివిధ కులాలకు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం వుండాలంటూ 1851లోనే బ్రిటిష్ పాలకులు