పుట:AarogyaBhaskaramu.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
40
శా|| మూడబ్దంబులనుండి న౯ గలఁచు పెన్భూతంబు పోతంబుల౯

కూడ౯ నేఁడు సమాక్రమించినది. ఆకువ్యాధియే వేఁడి. తా

పాడైపోవనె యద్ది పొంగినదిపో పామాకృతిం బైకి. నీ

వేఁడి౯ సైఁపఁగలేక యీవల కిటుల్ వెళ్ళంగనౌ భాస్కరా!

మ|| అల వడ్డించుచునున్న వాఁడు తనవాఁడైయుండ నేబంతిలో

వలఁగూర్చుండిన నేమితక్కువ? జగద్బంధుండవైనట్టి నీ

అలఘుప్రేమము మాపయిం గలుగ మాయారోగ్యభాగ్యంబు ల

గ్గలమే యయ్యెడిఁగాని యున్నె కొద నిక్కంబారయ౯ భాస్కరా!

మ|| కృప యుత్పన్నముకానియంతవఱకే కీర్తించియో కొల్చియో

ఉపచారంబులు చేయఁగావలయు. నిం కుత్పన్నసౌహార్దులై

నపయిం గైతవ మౌపచారికము. కాన౯ సుప్రసన్నాత్ము నీ

ఉపచారంబులు కట్తిపెట్టుదును నేనుచ్చైఃకరా! భాస్కరా! ౨౭౫

ఉ|| మిత్రుఁడటంచు ని౯ శ్రుతియె మిక్కిలి పేర్కొనుచుండెఁగాన స

ర్వత్ర స్వమిత్రభావమును వారక చూపనె చూపుచుందు. వే

స్తోత్రముతోడి యక్కఱయు సుంత కనంబడ. దందు రోగము

గ్గాత్రునిపట్ల మిత్రుఁడధికంబుగఁజూపఁడె మైత్రి భాస్కరా! ౨౭౬

మ|| అతి సర్వత్ర వివర్జయేత్తనెడి యయ్యార్యోక్తి పాటించి యీ

స్తుతి సంపూర్ణముసేయుచుంటి. ఇఁక నా సూనుత్రయం బేను నా

సతి నీయగ్గము. మత్కుటుంబమునకు౯ సంరక్షకుం డీవె. క

ల్గుత మారోగ్యము తీఱుత౯వ్యధులు. శ్రీలుం గూడుత౯ భాస్కరా! ౨౭౭


గద్య|| ఇది శ్రీమ జ్జగద్గురు గురుకరుణాకటాక్ష సంప్రాప్తోభయభాషా
పాండిత్య రసవత్కవిత్వనిధాన హరితసగోత్రోద్వ
లక్ష్మీనారాయణ పేరమాంబికా గర్భశు క్తిముక్తా
యమాన విద్వత్సభావిషృతావధాన
విధాన జానపాటి పట్టాభిరామాభి
ధాన విలిఖితంబగు నారోగ్య
భాస్కరము.
--------------

చంద్రికా ముద్రాశాల - గుంటూరు.