Jump to content

పుట:AarogyaBhaskaramu.djvu/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
27
ఉ|| అల్పులఁజూడనేను. మహదాశ్రయమందె వసించువాఁడ. ము

వ్వేల్పులయిక్కవంచు నిను వేడుచునుండినవాఁడ. నాస్థితి౯

తెల్పుము నీవె వారలకు. తెల్పుదొ తెల్పకయుందొ మామకా

నల్పపదామయంబునకు హర్తవు కావలె నీవె భాస్కరా! ౧౮౨

ఉ|| చిన్నలె యా త్రిమూర్తులన? అఋష్టియు రక్ష లయంబె చేయువా

రన్ననుసృష్టియు౯ లయము నక్కఱెలే. దిఁక రక్షసేఁత కా

వెన్నుని వేడఁబోవ నల వెన్నువి కన్నె భవత్స్వరూప. మా

కన్ను ప్రసన్నమైనఁగద కాచెడి నాతఁడు నన్ను భాస్కరా! ౧౮౩

ఉ|| అల్ల త్రిమూర్తులు౯ లలిఁ ద్వదాశ్రయమందె వసించుచున్నవా.

రొల్ల నిఁకం దదాశ్రితుల యొద్దకెపోయి సమాశ్రయింపఁగ౯ .

త్వ ల్లలితాకృతి౯ మదిని దద్దయుఁ జేర్చి సమాశ్రయించెద౯ .

తెల్లము. నాదుపాదరుజ తీర్పకతప్పదు నీకు భాస్కరా!

చం|| ఇఁకనొక నేనె యెప్డు భవదీక్షణగోచరుఁ డౌటలేదు. పా

వకముఖ పంచభూతములు భప్రభు భౌమ బుధేజ్య శుక్ర మా

మకసుత ఋక్షముల్ నయనమార్గమునం బడుచుండునంచు వే

ఱొకనుడి యాడెదేని విను ముత్తరము౯ వచియింతు భాస్కరా!

శా|| భాగ్యంబాదిగఁ దత్తదర్థములనే భక్తాళికిం బ్రీతి నీ

యోగ్యుల్వారు. మదీఫ్స్యమానమును నం దొక్కండు నీలేఁడు. నే

రుగ్యుక్తుండ. ఆనామయార్థిని తదారోగ్యంబు నీద్రవ్య. మా

రోగ్యం భాస్కరయ౯ బుధోక్తి మనదే రూఢంబుగా భాస్కరా!

శా|| ఇట్లారోగ్యదుఁడన్న ఖ్యాతి భువి నీకే కల్గియుండంగ నిం

కెట్లర్థింతుఁ ద్రిమూర్తుల౯ మఱియుఁ జంద్రేంద్రాదులన్ దీనతన్?

పోట్లాడన్ గమకింతెకాని గదముం బోకార్పఁగం జూడ వె

ప్పట్లన్. నా గ్రహచారమా యిది? ఇఁకం బ్రారబ్ధమా భాస్కరా!

మ|| గ్రహనాథుండవు నీవె యౌదు. కనుకం గావింపఁగాలేవె ని

గ్రహమున్? తద్గ్రహచారముం గుదురుపంగాలేవె? అత్యంతదు

స్సహమైయుండెడి నాదు పాదరుజ యీషచ్ఛేషమున్ లేక యే

వహి నాశిల్లునొ యవహిన్ సలిపి ప్రోవన్ లేవె?యోభాస్కరా!