పుట:AarogyaBhaskaramu.djvu/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
26
శా|| మేఘాచ్ఛాదనలేక తీక్ష్ణకరుఁడై మిన్వీది నీవుండఁగా

నౌ ఘస్రంబునఁ జేయఁగావలయునం టాచేయు నింజక్షనుల్.

మోఘంబౌనఁట యట్లకానియెడ. తన్మూలంబునంజేసి యా

ద్రాఘిష్టేక్షణుఁ డాచికిత్స యునిచెం దర్వాతికి౯ భాస్కరా!

శా|| వర్షం బించుక తగ్గి యాతపము నల్వంకల్ రహిం గ్రమ్ముడు౯

హర్షంబొంది ప్రసాదరావు మఱి నా హార్టుం బరీక్షించె. దు

ర్ధర్షంబై యట స్పంద మెక్కుడగుచుం దానుంట గన్పెట్టె. నా

శీర్షంబందలి వ్రాఁతకై మనములోఁ జింతించెఁదా భాస్కరా!

మ|| హృదయస్పందన మెక్కుడైనయపు డాయింజక్షను ల్సేయుచో

ఒదవంగాఁగలదంట ప్రాణములకే యోజ౯ మహోపద్రవం.

బదియోజించి ప్రసాదరావు మదిలో నద్దాని నట్లుంచి నా

హృదయస్పందము తగ్గుకై సలిపె ముం దేమేమియో భాస్కరా

శా|| భైషజ్యం బిడుచున్నవాఁడు. మఱి స్వల్పంభైన యింజక్షనుల్

భూషల్ చేయుచునున్న వాఁడు చెయికి౯. పోకాడ దింకద్ది. నా

వేషం బీగతినున్న. దేమియనదు౯? విశ్వాతిశాయి త్వదు

న్మేషద్వీక్షణ మించుకంత విడు నామీఁద౯ నడి౯ భాస్కరా!

ఉ|| ఈవిధ మాత్మవంచన మొకింతయు లేక ప్రసాదరావు న౯

కావ నొనర్చుచుండఁడొకొ గట్టిప్రయత్న? మిఁకేల దీనిదౌ

చేవ నశింపకుండవలె? చేకురఁగావలె నిన్నివిఘ్నముల్?

దైవబలప్రవృత్తమె యిదంగద. మేటికి శంక? భాస్కరా! ౧౭౯

ఉ|| దైవము నేనగాదు. మఱి స్థాణుజనార్దనముఖ్య ముఖ్యదే

వావళి యుండియున్నదని యడ్డముచెప్పకు. నిద్రలేచి నే

నావల కేగుదేరఁగనె యక్షులలోఁబడు దేవుఁ డీవె. ఏ

దేవులుఁ గానరారు ప్రయతించినయేనియు నాకు భాస్కరా!

ఉ|| స్థాణుజనార్దప్రముఖ తత్తదఖిఖ్యలె వారివారి వి

న్నాణముఁ జాటుచున్నతవి నాపద మీగతినుండ వారి మా

గాణముగూర్చియేగు టతికష్టముగావున దేవుఁడన్న దృ

క్కోణముల౯ సదా పడెడి కోణునితండ్రివి నీవె భాస్కరా!