పుట:AarogyaBhaskaramu.djvu/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
23
ఉ|| ఎన్నిదినంబులైనయది యే నమలాపుర మేగుదెంచి? ఇం

కెన్నిదినంబులీయఁగలఁ డిట్లు మహౌషధముల్ ప్రసాదరా?

వెన్నిదినంబులుంచి తనయింటఁ బ్రసాదము పెట్టనోపు? అ

న్నన్న! అనామయంబునిడి యన్నియుఁ దీర్పఁ గదయ్య భాస్కరా!

చం|| విలువగలట్టిమందులను వేళ కొసంగుటెకాక స్వీయమౌ

నిలయమునందె నిల్పుకొని నేఁటికి మాసయుగంబునుండి ని

ర్మలుఁడు ప్రసాదరావు తన మంచిని వెల్లడిచేయుచుండె. ఆ

వలఁతి సదుద్యమంబు ఫలవంతముఁ జేయఁ గదయ్య భాస్కరా!

ఉ|| రెండు నెల ల్గతించినను బ్రేముడి పెంచుచునున్న వాఁడిఁకా

తండు. రవంతయు౯ విసుకు తద్ధృదయంబునఁ గల్గ. దిక్షునం

దుండెడితీపి యగ్రముననుండి క్రమంబుగ హెచ్చునట్లు ప్రా

జ్ఞుండగువాని చెల్మియును క్షోణిఁ గ్రమంబుగ హెచ్చు భాస్కరా!

ఉ|| ఒక్కప్రసాదరావె కడుయోగ్యుఁడనం బనియేమి? తమ్ములు౯

మిక్కిలిమంచివారు. బుధమిత్రము తత్పిత. అట్టివారియిల్

చిక్కెను నన్నుఁజుట్టుకొను చిక్కులుదీఱఁగ. వేయునేల? నీ

యెక్కప్రసాదమే యటుల నుత్తమరూపముదాల్చె భాస్కరా!

చం|| తమిని బ్రసాదరావె యగదంబిడ నక్కఱలేదు. తమ్ములౌ

రమణయ రాజె యెక్కు డనురాగముతోడ నొసంగువార. లీ

క్రమమున మందులిచ్చుచును గమ్మనియోదన మింటఁ బెట్టుచు౯

తమ సుగుణాళిఁజూపు తదుదారులు ధన్యులుగాదె భాస్కరా!

శా|| సద్యస్స్ఫూర్తిగ వేదశాస్త్రములును౯ శ్రౌతంబు సాధించి యా

విద్యారణ్యులునా వశీకృతచతుర్వేదార్థుఁడై ధాత్రి స

త్పద్యల్ తీర్చిన బుల్సుపాపయసుధీపంచాస్యుదాయాదు లీ

విద్యావత్సుకుటుంబికుల్ పెరనుడుల్ వేయేటికి౯ భాస్కరా!

శా|| ధన్యంబైమను తత్కుటుంబ మిటు నం దన్పంగనే చూడు. నే

దైన్యంబూని యిఁ కెంతకాలమిటులం దత్రత్యుఁడం గావలె౯?

శూన్యాన్యవ్యవహారత౯ మనములో శోకించుచుండ౯వలె౯?

మాన్యత్వన్నుతిసేయుచుంటి నిఁకనే౯ మన్పంగదే భాస్కరా!