పుట:AarogyaBhaskaramu.djvu/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
14
చ|| గదమును రూపుమాపుటకు గట్టిప్రయత్నము చేయకుండనే

అది యిది తించు మూఱడిల కట్టిటు బిట్టుభ్రమించుచుండుడు౯

మెదు కొకయింతయు౯ రసనమీఁదికిఁ బోబక మై యసారమై

పదిలముగాను లేచుటకె పాల్పడదయ్యె నిఁకేమి భాస్కరా!

మ|| అలగుంటూర్పురి నప్డె నాకుఁ గడువ్రేఁగౌ పత్రికాకాత్యమే

ఒలయంబోవుట సంభవించి ఘనవైద్యుం డ౯ యశశ్శ్రీకిఁ దా

పలమౌ సత్కవితాంవయాబ్ధిశశి సుబ్రగ్మణ్యులోగింటిలో

పలఁ గాల్వెట్టుడు నాతఁడాదృతి నిడెం బాద్యంబు ము౯ భాస్కరా!

శా|| హిందూవైద్యులఁ జూచుమూత్రమునఁ జేయింజూపునార్తప్రజా

బృందంబుంబలె వ్యాధిపీడితుఁడనౌ నే౯ నాదు చైఁజూపుడు౯

కందమ్ము ల్ముకుళించి యాతఁడు మదిం గావించి ధ్యానంబు నా

చందం బేరు వచింపకుండ నుడివె౯ సర్వంబును౯ భాస్కరా!

శా|| దత్తాతిథ్యత నింటనుంచుకొని యాతం డౌషధం బీయ న

ట్లాత్తం బగ్నికుమారము౯ మెసవి మధ్యాయాతమౌ వ్యాధి కిం

చిత్తు౯ లేక నశించినట్లగుడు దానింగూర్చి తర్వాత నే

ఎత్తు౯ లేక యథాప్రకారముగనే యేనుండితి౯ భాస్కరా!

శా|| జంఘాశ్రోణిశిరాళి గుంజు టది యీషన్మాత్రముం దగ్గ కిం

కం ఘీంకారముసేయుచున్నది కడు౯. కాయంబు నిస్సార. మీ

సంఘర్షంబుననుం జికిత్స కవకాశం బబ్బ దేమందు మ

జ్జంఘాలత్వవినాశ కాలమది సంప్రాప్తంబుకా భాస్కరా! ౯౫

ఉ|| కావున నన్న మిష్టమయి ఖాదితమైనది జీర్ణ మౌటకుం

జేవ యొకింత యేరుపడి చిన్నగఁ గుంటినడ౯ గమింప నే౯

త్రోవలు సాఁగుచుండుటకుఁ దుష్టిని జెందుచునుంటిఁగాని నా

భావిమహాపద౯ మదిని భావనసేయఁగనైతి భాస్కరా!

మ|| జ్వర మంతర్గతమౌ టెఱుంగ కెటొ కాల్సాఁగుంగదా యంచునే

మరలంబోతి నిజాముదేశమున కార్మాసంబు లౌమీఁదత౯.

తిరుగంజాలితి నొక్కమాస. మటుపై దేహస్థమైయున్న యా

జ్వరమే శ్రీముఖవత్సరాది సరిగం బైకుబ్బెఁ దా భాస్కరా! ౯౭