పుట:AarogyaBhaskaramu.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
11
ఉ|| పిక్కపిఱుందులం దఱచుపీఁకుడుగానము మానవాళి. నా

ఒక్కనికోసమే ద్రుహిణుఁ డోపికతోడ సృజింపఁబోలు. అ

మ్మక్క! భిషక్కు లొక్కరును వ్యాధ్యభిధానము చెప్పలేకయే

ప్రక్కలుచూతురొక్కొ యిది ప్రాతయలంతయెయైన భాస్కరా!

ఉ|| దగ్గఱ వైద్యు లెవ్వరును దానిస్వరూప మెఱుంగరైరి. ఇం

కగ్గిరిరావొ రాను గబురంపుచునుండు ప్రసాదరావొ తా

మిగ్గదముం గుదుర్తురని యెంతయు నమ్మకముండె. వారల౯

డగ్గర నెంతకుం దెఱపి నాకుఁ దటస్థముగాదు భాస్కరా! ౭౧

ఉ|| చన్నవి రెణ్నెలల్. పనులు సాఁగ వొకించుకగూడ. అప్డునా

కున్నయసాధ్యమైనపని యొక్కఁడె. అయ్యది యెద్దియన్న నా

అన్నకొమాళ్ళపాలఁ గలయప్పుపరిష్కృతి. అద్ది యెన్నినా

ళ్ళున్నన్ను దీరదయ్యె. అదియు౯ మదదృష్టముకాదె భాస్కరా!

ఉ|| తీరియుఁ దీరకుండఁగ నె తిరిక యించుక నాకుఁజిక్కుడు౯

దూరగతామలాపురముత్రోవను బోవక యంతకన్నను౯

చెరువయైన బందరును జేరఁగఁబో గిరిరావుగారు న౯

గౌరవబుద్ధిఁ జూచి యొసఁగందగువాని నొసంగె భాస్కరా!

చం|| నలువది యేండ్లప్రాంతమున నాకుఁ దదర్పితముల్ సులోచనం

బులు. పదునాలుగేడు లవి పుస్తకము ల్చదివించె. వానితో

కలపని లేకపోయె నిఁక. గ్రంథము లెవియు లేకె చూడఁగ౯

కలిగితిఁగావి దూరగము గంగొనఁజాలఁగనైతి భాస్కరా!

ఉ|| తద్దయు దూరదృష్టి యటుతగ్గుతయు౯ గిరిరావునొద్ద నీ

అద్దములు౯ లభించుననునాస మఱెవ్వియుఁ బెట్టుకోకయే

ప్రొద్దులుపుచ్చఁబుచ్చ నటుపోవుట నాఁటికి సంభవించె నా.

కద్ది వచింప నాతఁ డపు డక్షుల నద్దము లుంచె భాస్కరా!

ఉ|| చెప్పితిఁ బిక్కలాగు. డది చిన్నయలంతయకాఁ దలంచుచు౯

చప్పున నెదొ యీఁగడఁగె. చన్నవి కొన్నిదినంబు. లెంతకు౯

నొప్పి శమింప.దస్మదురునోదన మూత్రపరీక్షచేసి తా

అప్పుడు ధాతుపాతమును నాతఁడెఱుంగఁగఁగల్గె భాస్కరా! ౭౬