Jump to content

పుట:AarogyaBhaskaramu.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
10
ఉ|| స్వవ్యధ సైపత్తన మదిసమ్మతిఁజేసి మదీయభ్రాతృపు

త్రవ్యవహారనిర్వహనతత్పరచిత్తత నిల్లు చేరుడు౯

నవ్యముగా బయల్వెడలె నాదుపిఱుందున2ం బిక్కనొప్పి పూ

ర్వవ్యధ యాఁగె. దీనఁగలవాస్తవికార్థ మదేమొ భాస్కరా!

చ|| వడవడిఁ గూరుచుండఁగను వంగను లేవను జేతఁగాక పె

ల్లుడికెడినాకు నాదునొడ లోలి నధీనముకా2ందొడంగిన౯

నడిచిన శ్రోణిజంఘఁ గలనాడులు లాగుటఁజేసి తుంగఁబో

విడుచుచు మొద్దు నెత్తుకొనువీఁక ఘటించె నిఁకేమి భాస్కరా!

ఉ|| రాకకుఁబోకకుం బిడుగురాళ్ళ సమీపము జానపాటి. కే

వీఁకనొ స్త్రీలు బాలకులు వృద్ధులునుం జరియించుచుందు రా

ఏకపది౯ సదా. అచటి కేగను రా నసమర్థమౌటయే

కాక మదంగ మన్నిటికిఁ గానిదియయ్యెఁ గదయ్య భాస్కరా!

ఉ|| గ్రామబహిస్థ్సలంబునకె గ్రక్కున నేగ నశక్యమౌట నె

న్నో మజిలీలు వేయుచు నెటోచని రావలసె౯. బజారులో

ఏమియొనర్స నేగినను నెన్నియు తిన్నెల విశ్రమించుచు౯

ధామముఁ జేరఁగావలసె. తాల్మిచెడ౯ వలసెంగ భాస్కరా!

చ|| కదలి పదైదుహజ్జలను గట్టిగఁ బెట్టుటతోనె లాగఁగ ౯

మొదలిడుఁ బిక్కలోనినరముల్. మఱికొంచెముదూర మేగ నా

ఒదవిననొప్పి పెద్దయగు. ఓరుచుకొంచు నటే చనంజన౯

తుద కడు గెత్తరాక భువిఁదొట్రిలుచుం బడుచుండు భాస్కరా!

చం|| విసికి ధరిత్రిఁ గూలఁబడి వేమఱుఁ గేల్గవఁబట్టి జంఘ వే

పిసికి యొకించుకంతశ్రమ పెద్దయుఁ బ్రొద్దునకు౯ శమించుడు౯

మసలక లేచి వెండియుఁ గ్రమంబుగఁ గొంతగమించి వెండియు౯

పిసుకుచు లేచి నడ్చుచును బిట్టుశ్రమం పడుచుంటి భాస్కరా!

ఉ|| పిక్కకునుం బిఱుందునకుఁ బేరిమినుండినసూత్ర మేమొ యం

దొక్కటి నొవ్వ రెండవదియుం గడునొచ్చెడి నప్డె. ఒక్కచో

ఎక్కువయైన వేఱొకట నెక్కువయౌ. ఇటు రెంటిసందున౯

చిక్కితి. చిక్కుచుంటి,బలుచిక్కిది. ఏగతిఁదీర్తొ భాస్కరా! ౬౯