పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"మిష్టర్ స్టోల్స్, మేము నీబోటి వ్యక్తులను ఆరు వారాలల్లో వురితీయబోతున్నాము>" అని ఆండ్రూ విరుచుకు పడ్డాడు.

మిష్టర్ స్టోల్స్ ఈ పరాభవానికి ఏమీ చెయ్యలేక పెద్దపెట్టున నవ్వాడు. 'నాన్సీ' అని ప్రక్కగదిలో వున్న భార్యను పిలిచాడు. "నాన్సీ, ఈ యువస్కాబ్ పిశాచం ఏమంటున్నాడో విను. నాబోటి వాళ్ళను వీరు ఆరువారాలల్లోగానే వురితీయబోతున్నారట."

కానీ ఆరువారాల్లోనే మిస్టర్ స్టోక్స్ ఫెడరల్ సైన్యములో మేనేజరైనాడు. అతడు విడివడిపోయే రాష్ట్రాలమీద సైన్యాన్ని ప్రయోగించరాదనటం రిపబ్లికన్ ప్రభుత్వంమీద ఒక ప్రగాఢమైన డెమాక్రాటి చేసే విమర్శ మాత్రమే పోర్టు సమ్లర్ లో జరిగిన కాల్పులనే సంఘటన అతనికళ్ళు తెరిచేటంత వరకూఅది యుద్ధమని అతడికి అవగతం కాలేదు. రాజకీయ పక్షాలకు సంబంధించిన చిన్ని సంఘర్షణ మాత్రమే అని అతడు అంతవరకూ భావించాడు. ఇరుపక్షాల మధ్య ఏర్పడ్డ విచ్ఛిత్తి ఎంత తీవ్రమయిందో అర్థంచేసుకోలేకపోయిన అతనివంటి వ్యక్తులు మొదట్లో చాలామంది ఉండేవారు.

యుద్ధ సేవ చేయవలసిన అవసరం పెన్సిల్వేనియా రైల్‌రోడ్ కంపెనీలో పనిచేసేవారికి అతివేగంగా వచ్చింది, మిస్టర్ స్కాట్‌ను ట్రాన్స్‌పోర్టేషను శాఖకు యుద్ధ సహ కార్యదర్శిని చేశారు. అతడు వెంటనే తనకు విశ్వాసపాత్రుడయిన ఆండ్రూ కార్నెగీని రైల్వే మనుష్యులతో ఒక సైనిక