పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బల్‌రన్ - డన్ఫ్‌ర్మ్‌ లైన్

6

కొంతకాలంనుంచి నిరంతరం అతిసూక్ష్మంగా జాతీయ సంఘటనలమీద, సమస్యలమీద ఆసక్తి వహించి అతి నిశిత దృష్టితో పరిశీలిస్తున్న యువకార్నెగీ బానిసత్వం, రాష్ట్రాల హక్కులు అన్న వివాదగ్రస్త రెండంశాల వల్ల వుత్తర దక్షిణాలమధ్య క్రమంగా వృద్ధిపొందుతున్న తగాదాను గురించి తీవ్రమైన ఆందోళన చెందటం ప్రారంభించాడు. ఈ రాజకీయాలనే మాహాశిలవు మీద తనకు ప్రియమైన జాతీయ నౌక భగ్నం కాబోతున్నదని అతడు నమ్మ లేక పోయినాడు. అతడు నిశ్చయంగా ఆక్లిష్ట పరిస్థితికి సంచరించి తరువాతి కాలంలో అధ్యక్షుడు క్లీన్ లాండ్ అతడ్ని గురించి "అఫెన్సిన్ పార్టి జాన్" అని అన్న దానికి తగ్గట్లు రూపొందాడు. లింకన్ అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డ ఫలితంగా 1861 నాటి వసంతారంభంలో దక్షిణ రాష్ట్రాలు విడివడి పోవటం ప్రారంభించాయి. ఆ సమయంలో అతడు ఒక ఆదివారంనాడు గ్రీన్స్‌బర్గ్‌లో తన వుత్తమ మిత్రుడైన మిష్టర్ స్టోళ్స్ యింట్లో అతిథిగా వున్నాడు. అప్పు డతని అతిథేయ విడివడి పోతున్న రాష్ట్రాలను ఆపటానికి బలప్రయోగం చేసేందుకు ఫెడరల్ ప్రభుత్వానికి ఎటువంటిహక్కు లేదన్నప్పుడు విని ఆశ్చర్యపడ్డాడు.